Meftal Side Effects: ఆ పెయిన్ కిల్లర్‌తో జాగ్రత్త - కేంద్రం వార్నింగ్
Meftal: తల నొప్పి, కండరాల నొప్పి, కీళ్ల నొప్పులకు, పిల్లల్లో వచ్చే హై ఫీవర్, మహిళలు నెలసరి నొప్పి నివారణకు ఉపయోగించే మెఫ్తాల్ ఔషధంపై కేంద్ర ప్రభుత్వం డ్రగ్ సేఫ్టీ అలెర్ట్‌ను జారీ చేసింది.
Indian Pharmacopoeia Commission: తల నొప్పి, కండరాల నొప్పి, కీళ్ల నొప్పులకు, పిల్లల్లో వచ్చే హై ఫీవర్, రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్, ఆస్టియో ఆర్థ్రయిటిస్, జ్వరం, దంతాల నొప్పి, మహిళలు నెలసరి సమయంలో వచ్చే నొప్పి నివారణకు ఉపయోగించే మెఫ్తాల్ ఔషధం (Meftal)పై కేంద్ర ప్రభుత్వం (Central Government) డ్రగ్ సేఫ్టీ అలెర్ట్ (Drug Safety Alert)ను జారీ చేసింది. ఔషధం ప్రతికూల ప్రభావాలను పర్యవేక్షించాలని ఆరోగ్యరంగ నిపుణులు, రోగులకు సూచించింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలోని భారత ఔషధ ప్రమాణాలను నిర్దేశించే ఇండియన్ ఫార్మాకోపోయియా కమిషన్ (Indian Pharmacopoeia Commission) నవంబర్ 30న తాజా అడ్వైజరీ జారీ చేసింది.
Indian Pharmacopoeia Commission (IPC) issued a drug safety alert about Meftal painkiller, stating that its constituent, mefenamic acid, can cause adverse reactions pic.twitter.com/MHcfyoTLuI
— ANI (@ANI) December 7, 2023
మహిళల్లో కొన్నిసార్లు పీరియడ్స్ నొప్పి భరించలేనంతగా ఉంటుంది. దానిని తగ్గించడానికి మహిళలు పెయిన్ కిల్లర్ల (Meftal Pain Killer)ను ఆశ్రయిస్తారు. అటువంటి పరిస్థితిలో, కొన్ని నొప్పి నివారణ మందులు తీసుకోవడం హాని కలిగిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పీరియడ్స్ సహా పలు రకాల నొప్పుల కొసం తీసుకునే మెఫెనామిక్ యాసిడ్ అంటే మెఫ్టాల్ మందు విషయంలో ఇండియన్ ఫార్మాకోపోయియా కమిషన్ (IPC) డ్రగ్ సెఫ్టీ హెచ్చరికలు జారీ చేసింది.
ఔషధ ప్రతిచర్యలను నియంత్రించే ప్రభుత్వ సంస్థ అయిన ఫార్మాకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా (PvPI) మెఫెనామిక్ యాసిడ్ గురించి పెద్ద ప్రకటన ఇచ్చింది. ఈ మెడిసిన్ వాడిన తర్వాత డ్రస్ సిండ్రోమ్ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని ఆ సంస్థ చెబుతోంది. వీటి వాడకం ద్వారా ఇసినోఫిలియా, సిస్టెమిక్ సింప్టమ్ సిండ్రోమ్ వంటి చర్యలు వెలుగులోకి వచ్చినట్లు వెల్లడించింది. ఒకవేళ ఏమైనా దుష్ర్పభావాలు ఎదురైతే పీవీపీఐకి తెలియజేయాలని సూచించింది. www.ipc.gov.in వెబ్‌సైట్ లేదా పీవీపీఐ హెల్ప్‌లైన్ నంబర్ 1800-180-3024 ద్వారా తమను సంప్రదించాలని తెలిపింది.
PvPI ప్రకారం దీనిని ప్రధానంగా కండరాలు, కీళ్లలో నొప్పి లేదా తలనొప్పి వంటి అనేక సమస్యలకు ఈ ఔషధాన్ని ఉపయోగిస్తున్నారు. చాలా సార్లు ఈ ఔషధం పిల్లలలో జ్వరంలో కూడా ఉపయోగించబడుతుందని తేలింది. వాస్తవానికి డ్రెస్ సిండ్రోమ్ అనేది తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్య. దీనిలో చర్మంపై దద్దుర్లు మొదలైనవి ఏర్పడతాయి. ఈ ప్రతిచర్య కొన్నిసార్లు మరణానికి కూడా దారితీయొచ్చని నిపుణుల అభిప్రాయ పడ్డారు. ఈ ఔషధం తీసుకున్న తర్వాత మరణ సంభవించే అవకాశం 10 శాతం పెరుగుతుందని అంటున్నారు. డాక్టర్ సలహా లేకుండా ఈ ఔషధాన్ని తీసుకోవడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.