Delhi Coaching Centre: కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం, వైర్‌లు పట్టుకుని బిల్డింగ్‌పై నుంచి దూకిన విద్యార్థులు
Delhi Coaching Centre: ఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది.
Delhi Coaching Centre:
ఢిల్లీలో ఘటన..
ఢిల్లీలోని ముఖర్జీనగర్‌లో ఓ కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలార్పారు. కోచింగ్ సెంటర్‌లో ఉన్న విద్యార్థులు వైర్‌లు పట్టుకుని కిందకు దిగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిల్డింగ్‌లో ఉన్న అందరూ సురక్షితంగా బయటపడ్డారని అధికారులు వెల్లడించారు. ఎవరికీ తీవ్ర గాయాలవ్వలేదని స్పష్టం చేశారు. ఎలక్ట్రిసిటీ మీటర్‌లో అగ్నిప్రమాదం జరగడం వల్ల ఒక్కసారిగా ఆందోళన చెందారు. పెద్ద ఎత్తున పొగ కమ్ముకుంది. ఒక్కసారిగా అందరూ పరుగులు పెట్టారు. ఇంతలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. 11 మంది సిబ్బంది వెంటనే వైర్‌ల సాయంతో అందరినీ కిందకు తీసుకొచ్చారు. విద్యార్థులందరూ సేఫ్‌గా బయటపడ్డారు.
"అందరూ సురక్షితంగా బయటపడ్డారు. కొందరు విద్యార్థులకు స్పల్ప గాయాలయ్యాయి. బిల్డింగ్‌లో ఎవరూ చిక్కుకోలేదు. ఎలక్ట్రిసిటీ మీటర్‌లో లోపం తలెత్తడం వల్ల అగ్నిప్రమాదం జరిగింది. పొగ రావడం వల్ల అంతా ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి ప్రాణాలు కాపాడింది"
- సుమన్ నల్వా, ఢిల్లీ పోలీస్ పీఆర్వో
#WATCH | People escape using wires as fire breaks out in a building located in Delhi's Mukherjee Nagar; 11 fire tenders rushed to the site, rescue operation underway
— ANI (@ANI) June 15, 2023
(Source: Delhi Fire Department) pic.twitter.com/1AYVRojvxI
ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు.
"ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా దురదృష్టకరం. కొందరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. అందరూ సురక్షితంగా ఉన్నారు. ఆందోళన చెందాల్సిన పని లేదు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమైన మంటల్ని అదుపులోకి తీసుకొచ్చింది. జిల్లా అధికారులు కూడా వెంటనే స్పందించారు"
- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి
आग की ये घटना बेहद दुर्भाग्यपूर्ण है। कुछ छात्र बचने के प्रयास में मामूली रूप से घायल हुए हैं, बाक़ी सभी छात्र सुरक्षित हैं। घबराने की बात नहीं है, दमकल विभाग द्वारा आग पर क़ाबू पा लिया गया है। ज़िला प्रशासन भी मौक़े पर मौजूद है। https://t.co/h32QYbxuKB
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 15, 2023
ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం..
కోల్కతా విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ ఆవరణలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. కోల్కతా ఎయిర్ పోర్టులోని 3సి డిపార్చర్ టెర్మినల్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం. అయితే మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. అక్కడ ఇప్పటివరకు ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైరింజన్లు ఎయిర్ పోర్టులో డిపార్చర్ టర్మినల్ కు చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పింది. 3సి టెర్మినల్ భవనంలో సెక్యూరిటీ చెక్ ఏరియా సమీపంలో జూన్ 14 రాత్రి 9.20 గంటలకు మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు చెబుతున్నారు. ఫైరింజన్ సిబ్బంది హుటాహుటీన అక్కడికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. దాదాపు 30 నిమిషాల పాటు శ్రమించి మంటల్ని ఆర్పివేసినట్లు ఆనందబజార్ పత్రికా పేర్కొంది.
Also Read: Karnataka Syllabus: RSS ఫౌండర్ హెడ్గేవర్ పాఠం తొలగించిన కర్ణాటక ప్రభుత్వం, అధికారికంగా ప్రకటన