ముంబయిలోని ఓ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం, ఇద్దరు మృతి - నలుగురికి గాయాలు
Mumbai Fire Accident: ముంబయిలోని ఓ బిల్డింగ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
Mumbai Fire Accident:
అగ్ని ప్రమాదం..
ముంబయిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 8 అంతస్తుల బిల్డింగ్‌లో ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి. కండివలిలో ఈ ప్రమాదం సంభవించింది. బిల్డింగ్‌లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి చుట్టూ వ్యాపించాయి. పెద్ద ఎత్తున పొగ కమ్ముకోవడం వల్ల స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది. 8 ఫైర్ ఇంజిన్‌లు వచ్చి మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాయి. మంటల్లో చిక్కుకున్న వాళ్లని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మంటలు మొదటి అంతస్తుకే పరిమితమయ్యేలా చేయడం వల్ల ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ ముగ్గురి పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్న సిబ్బంది...ఘటనపై విచారణ మొదలు పెట్టారు. ఎందుకు మంటలు వ్యాపించాయన్నది ఇంకా స్పష్టత రాలేదు.
#WATCH | Mumbai: Earlier visuals of the fire that broke out in the Pavan Dham Veena Santur Building of Mahaveer Nagar in Kandivali West. The fire was taken under control with the help of 8 firefighters. https://t.co/8liMiz4lEb pic.twitter.com/BbQ3hLHmek
— ANI (@ANI) October 23, 2023
మధ్యాహ్నం 12.27 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. పవన్ ధామ్ వీణా సంతూర్ బిల్డింగ్‌లో మంటలు వ్యాపించినట్టుగా సమాచారం అందినట్టు వివరించారు. చాలా సేపు శ్రమిస్తే కానీ మంటలు అదుపులోకి రాలేదు.
#WATCH | Mumbai Fire | Visuals from Pavan Dham Veena Santur Building of Mahaveer Nagar in Kandivali West where a fire broke out earlier today and claimed two lives. pic.twitter.com/YGUykYd7dN
— ANI (@ANI) October 23, 2023
బెంగళూరులోని కోరమంగళలో ఓ మల్టీస్టోర్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం (Koramangala Fire Accident) సంభవించింది. ముందుగా ఓ కేఫ్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడి నుంచి పరిసర ప్రాంతాల్లోకి మంటలు వ్యాప్తి చెందాయి. ఆ తరవాత పేలుడు కూడా సంభవించింది. బిల్డింగ్‌లోని వాళ్లంతా గట్టిగా కేకలు వేస్తూ బయటకు వచ్చారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుంది. బిల్డింగ్‌లో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంట ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ప్రాథమిక వివరాల ప్రకారం...బిల్డింగ్‌లోని కేఫ్‌లో గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించింది. రెస్క్యూ టీమ్ వచ్చి కాపాడినప్పటికీ కొందరు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు బిల్డింగ్ పై నుంచి దూకేశారు. ఓ వ్యక్తి మంటల్లో చిక్కుకున్నాడు. అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. చెట్టుమీద పడడం వల్ల గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Also Read: Viral Video: పార్క్ చేసిన BMW కార్‌లో నుంచి రూ.14 లక్షల చోరీ, వీడియో వైరల్