ECI on Vote Chori: వోట్ చోరీ ఆరోపణలపై రాహుల్ గాంధీకి ఎలక్షన్ కమిషన్ అల్టిమేటం, 7 రోజుల డెడ్‌లైన్
Rahul Gandhi comments on Vote Choti: రాహుల్ గాంధీ ఆరోపణలపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ స్పందించారు. వారం రోజుల్లోగా అఫిడవిట్ ఇవ్వాలని, లేనిపక్షంలో , క్షమాపణ చెప్పాలని సూచించారు.

ECI Gyanesh kumar slams Rahul Gandhi | న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఓట్ల దొంగతనం (Vote Chori)పై చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ, "ఎలక్షన్ కమిషన్‌కు అన్ని పార్టీలు సమానమే. ఈసీకి ఎలాంటి భేదభావాలు ఉండవు. కానీ కొందరు నేతలు ఓటు చోరీ పేరుతో అనవసర రాద్దాంతం చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ సంస్థలను అవమానించడమే అని చెప్పవచ్చు. బిహార్‌లో ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) పై ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సరికాదు. ఓటరు జాబితాను బూత్ లెవల్‌లోనే ప్రతి పార్టీ చూసుకుంటుంది. ఎన్నికల సంస్కరణ చర్యల్లో భాగంగానే పలు రాష్ట్రాల్లో ఓటరు జాబితాను సవరిస్తున్నాం.
రాహుల్ గాంధీ అఫిడవిట్ ఇస్తారా లేక క్షమాపణ చెబుతారా..
ప్రధాన ఎన్నికల అధికారి రాహుల్ గాంధీ విమర్శలపై మాట్లాడుతూ.. "రాహుల్ గాంధీ తాను చేసిన ఓట్ చోరీ ఆరోపణలు, విమర్శలపై 7 రోజుల్లోగా అఫిడవిట్ సమర్పించాలి. లేకపోతే తాను చేసిన అసత్య, నిరాధార ఆరోపణలపై దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అంతేగానీ మూడవ ప్రత్యామ్నాయం లేదు. ఏడు రోజుల్లో ప్రమాణ పత్రం అందకపోతే, ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఎన్నికల సంఘం డేటా కాకుండా ఒక PPTని సమర్పిస్తే, ఈ విధంగా తప్పుడు డేటాను అందించడం, పోలింగ్ అధికారి ఈ మహిళ రెండుసార్లు ఓటు వేసిందని చెప్పారనడం వంటివి తీవ్రమైన విషయాలపై ఎన్నికల సంఘం ప్రమాణ పత్రం (Affifavit) లాంటివి లేకుండా చర్యలు తీసుకోదు" అని అన్నారు.
ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ, "ప్రపంచంలోనే అతిపెద్ద ఓటర్ల జాబితా మనది. అతిపెద్ద ఎన్నికల సిబ్బంది, అత్యధిక ఓటర్లు ఉన్న దేశంలో ఉన్నాం. మీ పేరు ఓటర్ల జాబితాలో రెండు చోట్ల ఉంటే, మీరు రెండుసార్లు ఓటు వేశారని.. చట్టవిరుద్ధంగా అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. రాహుల్ గాంధీ చేసిన వోట్ చోరీ, రెండు సార్లు ఓట్లు వేశారన్న ఆరోపణల తర్వాత ఎన్నికల సంఘం మౌనంగా ఉండటం వీలుకాదు. కనుక ఎంపీ రాహుల్ గాంధీ తాను చేసిన ఆరోపణలకు సంబంధించి ప్రమాణ పత్రం సమర్పించాలి లేదా దేశానికి క్షమాపణ చెప్పాలి" అని స్పష్టం చేశారు.
#WATCH | Delhi: On Rahul Gandhi's allegations against ECI, Chief Election Commissioner Gyanesh Kumar says, "...An affidavit will have to be given or an apology will have to be made to the country. There is no third option. If the affidavit is not received within 7 days, it means… pic.twitter.com/AJVbxEdPja
— ANI (@ANI) August 17, 2025
బిహార్ లో ఎన్నికల తరుణంలో రాహుల్ గాంధీ ఓట్ల తొలగింపుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్షాలకు చెందిన ఓట్లు పోతున్నాయని ఆరోపించారు. కొన్నిచోట్ల ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయని చెప్పడం రాజకీయంగా దుమారం రేపింది.























