News
News
X

Earthquake: భూకంపంతో టర్కీ అతలాకుతలం- మరి భారత్ లో వస్తే!

Earthquake: టర్కీలో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం విధ్వంసం సృష్టించింది. మరి ఇలాంటి భారీ భూకంపం భారత్ లో వస్తే! దాన్ని ఎదుర్కోవడానకి దేశం సిద్ధంగా ఉందా!

FOLLOW US: 
Share:

Earthquake:  టర్కీలో సోమవారం, మంగళవారం సంభవించిన భారీ భూకంపం విధ్వంసం సృష్టించింది. 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంతో టర్కీ అతలాకుతలమైంది, పొరుగు దేశాలతో పాటు, గ్రీన్‌లాండ్‌కు దూరంగా ప్రకంపనలు వచ్చాయి. భూకంప కేంద్రం టర్కీలోని గజియాంటెప్ నగరానికి సమీపంలో ఉంది. టర్కీ మరియు సిరియాలోని నగరాల్లోని కొన్ని ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. మరణాల సంఖ్య 5 వేలకు చేరుకుంది. ఈ భూకంపం వలన సంభవించిన నష్టంలో మానవ తప్పిదాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఈ శతాబ్దంలో టర్కీని తాకిన అత్యంత భారీ భూకంపం ఇదేనని చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు సాగుతున్నాయి. 

మరి ఇలాంటి భారీ భూకంపం భారత్ లో వస్తే! దాన్ని ఎదుర్కోవడానకి దేశం సిద్ధంగా ఉందా! ఎందుకంటే భారత ఉపఖండంలో ఇప్పటికే భూకంపాలు వచ్చిన చరిత్ర ఉంది. భవిష్యత్తులోనూ ఈ విపత్తు సంభవించే అవకాశం ఉందని నిపుణులు గుర్తించారు. మరి టర్కీలో సంభవించిన లాంటి భారీ విపత్తు మనకూ వస్తే దాన్ని ఎంతవరకు ఎదుర్కోగలమో చూద్దాం. 

భారత్ కు భూకంపాల ముప్పు ఉంది

టిబెట్ పీఠభూమి యొక్క ఎత్తును కొనసాగిస్తూ.. భారత ప్లేట్ సుమారుగా ఏడాదికి 47 మి.మీ చొప్పున ఆసియాలోకి వెళ్తోంది. ఇది హిమాలయ, ఆల్టిన్ టాగ్, టియన్ షాన్ పర్వతాలను విచ్ఛిన్నం చేస్తుంది. దీన్ని బట్టి భారతదేశం భూకంపాల నుంచి సురక్షితం కాదని ఒక నివేదిక పేర్కొంది. దీనివలన ఆసియా, ఇంకా భారత్ లోని కొన్ని ప్రాంతాల్లో స్థిరమైన, అనూహ్యమైన భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. 

హిమాలయ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని.. దీనికోసం భారత్ సిద్ధంగా ఉండాలని గత నవంబర్ లో శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇంక ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించే మార్గాలపై దృష్టిపెట్టాలని సూచించారు. భారత్, యురేషియన్ ప్లేట్ ల మధ్య ఘర్షణ ఫలితంగా హిమాలయాల్లో భూకంపాలు సంభవించవచ్చని.. వాడియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ సీనియర్ జియోఫిజిసిస్ట్ అజయ్ పాల్ తెలిపారు. 'హిమాలయాల కింద వడకట్టిన శక్తి చేరడం వలన భూకంపాలు సంభవించడం అనేది సాధారణ ప్రక్రియ. మొత్తం హిమాలయ ప్రాంతంలో ప్రకంపనలు రావొచ్చు. అలాగే పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం కూడా ఉంది. అయిన భూకంపం ఎప్పుడు వస్తుందో అంచనా వేయలేము. తదుపరి క్షణం, వచ్చే నెల, లేదా 100 తర్వాతైనా భూకంపాలు రావచ్చు' అని అజయ్ అన్నారు. 

భారతదేశంలో గత 150 ఏళ్లలో హిమాలయ ప్రాంతంలో 4 భారీ భూకంపాలు వచ్చాయి.  1897లో షిల్లాంగ్‌లో, 1905లో కాంగ్రాలో, 1934లో బీహార్-నేపాల్‌లో,  1950లో అస్సాంలో భూకంపాలు వచ్చాయి.  

భుజ్ భూకంపం (2001)

భారతదేశం అనేక శక్తివంతమైన భూకంపాలను చూసింది, వాటిలో అత్యంత ఘోరమైన వాటిలో ఒకటి 2001 నాటి భుజ్ భూకంపం, ఇది భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో, పాకిస్తాన్ సరిహద్దులో సంభవించింది. దీని వల్ల 20,000 మందికి పైగా మరణించారు. 150,000 మందికి పైగా గాయపడ్డారు, వేల మంది నిరాశ్రయులయ్యారు. అయితే దీన్నుంచి భారత్ గుణపాఠం నేర్చుకుందా? అంటే అవుననే చెప్పాలి. 

భారతదేశంలో భూకంప ప్రూఫ్ బిల్డింగ్ పాలసీని కలిగి ఉందా?

భారత్ భూకంప ప్రూఫ్ బిల్డింగ్ పాలసీని కలిగిఉంది. భూకంప శాస్త్రవేత్తలు భారతదేశంలోని 59 శాతం భూభాగాన్ని వివిధ పరిమాణాలలో భూకంపాలకు గురయ్యే అవకాశం ఉందని వర్గీకరించారు. అత్యంత అధిక-రిస్క్ జోన్ లో 11 శాతం, హై-రిస్క్ జోన్ లో 18 శాతం, మోడరేట్-రిస్క్ జోన్‌లో 30 శాతం భూకంప ప్రభావిత ప్రాంతం ఉంది. 

భారీ భూకంపాలు ఆస్తి మరియు ప్రాణాలకు అధిక స్థాయిలో విధ్వంసం కలిగిస్తాయి. అందువల్ల, భవనాలు, ఇళ్లు మరియు ఇతర మౌలిక సదుపాయాలను నిర్మించేటప్పుడు కొన్ని మార్గదర్శకాలను అనుసరించాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు. భూకంప-నిరోధక నిర్మాణానికి సంబంధించిన భారతీయ ప్రమాణాల జాబితా కూడా ఉంది, ఇది నిర్మాణాల రూపకల్పన, భవనాల నిర్మాణం, మట్టి భవనాల భూకంప నిరోధకతను మెరుగుపరచడం, భవనాల మరమ్మత్తు మరియు భూకంప పటిష్టతపై సూచనలు చేస్తుంది.

భారత్ లో చాలావరకు ఈ మార్గదర్శకాలను అనుసరించే నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే వందశాతం జరుగుతున్నాయా లేదా అనేది తెలియదు. జనాభా ఎక్కువగా ఉండే ముంబయి, దిల్లీ లాంటి నగరాల్లో ఈ మార్గదర్శకాలను ఎంతవరకు పాటిస్తున్నారో తెలియదు.

Published at : 07 Feb 2023 05:46 PM (IST) Tags: Earthquakes Earthquakes in India India to Ready for Earthquakes

సంబంధిత కథనాలు

LPG Cylinder Subsidy:  పీఎంయూవై లబ్దిదారులకు గుడ్ న్యూస్, ఎల్పీజీ సిలిండర్ పై సబ్సిడీ మరో ఏడాది పొడిగింపు

LPG Cylinder Subsidy: పీఎంయూవై లబ్దిదారులకు గుడ్ న్యూస్, ఎల్పీజీ సిలిండర్ పై సబ్సిడీ మరో ఏడాది పొడిగింపు

UPSC NDA 1 Admit Card: యూపీఎస్సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

UPSC NDA 1 Admit Card: యూపీఎస్సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

సమ్మర్ లో కశ్మీర్ వెళ్లాలి అనుకుంటున్నారా ? ఇదిగో ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ 

సమ్మర్ లో కశ్మీర్ వెళ్లాలి అనుకుంటున్నారా ? ఇదిగో ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ 

UPSC CDS Admit Card: సీడీఎస్-1 ఎగ్జామ్ హాల్‌టికెట్లు వచ్చేశాయ్! పరీక్ష ఎప్పుడంటే?

UPSC CDS Admit Card: సీడీఎస్-1 ఎగ్జామ్ హాల్‌టికెట్లు వచ్చేశాయ్! పరీక్ష ఎప్పుడంటే?

CM KCR On Rahul Gandhi : ప్రధాని మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతుంది, రాహుల్ గాంధీపై వేటు దేశ చరిత్రలో చీకటి రోజు- సీఎం కేసీఆర్

CM KCR On Rahul Gandhi : ప్రధాని మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతుంది, రాహుల్ గాంధీపై వేటు దేశ చరిత్రలో చీకటి రోజు- సీఎం కేసీఆర్

టాప్ స్టోరీస్

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

Jio IPL Plans: రూ.219కే రోజూ 3 జీబీ డేటా - అదనంగా 2 జీబీ కూడా - ఐపీఎల్ ముందు జియో కొత్త ప్లాన్లు!

Jio IPL Plans: రూ.219కే రోజూ 3 జీబీ డేటా - అదనంగా 2 జీబీ కూడా - ఐపీఎల్ ముందు జియో కొత్త ప్లాన్లు!