News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Delhi Earth Quake: దేశ రాజధానిలో భూ ప్రకంపనలు, నేపాల్‌లో భూకంప కేంద్రం - ఆరుగురి మృతి

భూకంప కేంద్రం పొరుగు దేశం నేపాల్ అని గుర్తించారు. భూకంపం యొక్క ప్రకంపనలు దాదాపు 1 నిమిషం పాటు వచ్చినట్లుగా స్థానికులు చెప్పారు.

FOLLOW US: 
Share:

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో సహా ఉత్తర భారతంలో భూకంపం సంభవించింది. మంగళవారం (నవంబర్ 8) అర్ధరాత్రి 2 గంటల సమయంలో ప్రకంపనలు వచ్చాయి. అంతకుముందు పొరుగు దేశం నేపాల్ లో వచ్చిన భూకంపం రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదుకాగా.. ఢిల్లీలోనూ ప్రకంపనలు వచ్చాయి. వెంటనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప కేంద్రం పొరుగు దేశం నేపాల్ అని గుర్తించారు. భూకంపం యొక్క ప్రకంపనలు దాదాపు 1 నిమిషం పాటు వచ్చినట్లుగా స్థానికులు చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీ సహా దాని పరిసర ప్రాంతాలతో పాటు, యూపీ-ఉత్తరాఖండ్, బిహార్, హరియాణా, మధ్యప్రదేశ్‌లలో బలమైన ప్రకంపనలు సంభవించాయి. అయితే నేపాల్‌లో ఈ భూకంపం వల్ల ఆరుగురు చనిపోయినట్లుగా తెలుస్తోంది.

నేపాల్‌లో భూకంపానికి కేంద్రం మణిపూర్‌
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, భూకంప కేంద్రం నేపాల్‌లోని కలుఖేటిలో భూమికి 10 కిలోమీటర్ల దిగువన ఉంది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.3గా నమోదైంది. తెల్లవారుజామున 1.57 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. నేపాల్‌లోని అదే ప్రదేశంలో మంగళవారం అర్ధరాత్రి 3:15 గంటలకు భూకంప కేంద్రం మరోసారి నమోదైంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భూకంపం సంభవించినప్పుడు చాలా మంది ప్రజలు నిద్రలో ఉన్నారు. విషయం తెలిసిన వారు వెంటనే ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు.

గంట క్రితం యూపీలోని పలు జిల్లాల్లో ప్రకంపనలు వచ్చాయి
ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో అర్ధరాత్రి 2 గంటలకు భూకంపం సంభవించడానికి ముందు, ఉత్తరాఖండ్, యూపీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.9గా నమోదైంది. దీని కేంద్రం ఉత్తరాఖండ్‌లోని ఇండో-నేపాల్ సరిహద్దులో ఉందని చెప్పారు. భూకంపం యొక్క లోతు 10 కి.మీ. ఈ రెండు ప్రకంపనలకు ముందు, మంగళవారం ఉత్తర భారతదేశంలోని కొన్ని నగరాల్లో 4.4 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఉదయం 11.57 గంటలకు ఈ భూకంపం సంభవించింది. దీని కేంద్రం మిజోరంలోని చంపై.

భూకంపం సంభవించినట్లయితే ఈ విషయాలను గుర్తుంచుకోండి

భూకంపం సంభవించినప్పుడు మీరు సురక్షితమైన ప్రదేశంలో ఉండటం చాలా ముఖ్యం. భూకంపం కారణంగా భవనాలు, ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉంది. భూకంపాల వల్ల సంభవించిన మరణాలన్నీ భవన శిథిలాల కింద సమాధి కావడం వల్లనే అవుతుంటాయి. అటువంటి పరిస్థితిలో, భూకంపం సమయంలో మీరు సురక్షితమైన ప్రదేశంలో ఉండటం ముఖ్యం. భూకంపం సమయంలో మీరు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.

మీరు ఇంటి లోపల ఉంటే
మీరు భూకంపం సమయంలో ఇంటి లోపల ఉంటే ఒక దృఢమైన టేబుల్ లేదా ఏదైనా ఫర్నిచర్ కింద వెళ్లి కూర్చోవాలి. ఇంట్లో టేబుల్ లేదా డెస్క్ లేకపోతే, మీ ముఖం, తలపై మీ చేతులతో కప్పి, భవనంలో ఒక మూలలో కూర్చోండి. ఒక టేబుల్ లేదా బెడ్ కింద, గది మూలలో ఉండొచ్చు. భూకంపం సమయంలో గాజులు, కిటికీలు, తలుపులు, గోడలకు దూరంగా ఉండండి. పడే వస్తువుల చుట్టూ ఉండకండి.

మీరు ఇంటి నుండి బయట ఉంటే
మీరు ఇంటి వెలుపల ఉంటే, మీరు ఉన్న చోట ఉండండి. భవనాలు, చెట్లు, వీధి దీపాలు,  విద్యుత్/టెలిఫోన్ స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండండి. మీరు బహిరంగ ప్రదేశంలో ఉంటే, భూకంపం యొక్క ప్రకంపనలు ఆగే వరకు అక్కడే ఉండండి. బహిరంగ ప్రదేశానికి వెళ్లి నిలబడటం మంచిది.

Published at : 09 Nov 2022 07:08 AM (IST) Tags: earthquake News Delhi Earth quake Earth Tremors Nepal Earth quake

ఇవి కూడా చూడండి

ఆర్టికల్ 370 రద్దుపై 'సుప్రీం' తీర్పు - చారిత్రాత్మకమంటూ ప్రధాని మోదీ హర్షం

ఆర్టికల్ 370 రద్దుపై 'సుప్రీం' తీర్పు - చారిత్రాత్మకమంటూ ప్రధాని మోదీ హర్షం

UCO Bank Notification: యూకో బ్యాంకులో 127 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు, ఎంపిక ఇలా

UCO Bank Notification: యూకో బ్యాంకులో 127 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు, ఎంపిక ఇలా

Article 370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు - కేంద్రం నిర్ణయం సరైనదేనని స్పష్టీకరణ

Article 370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు - కేంద్రం నిర్ణయం సరైనదేనని స్పష్టీకరణ

Bhagwant Mann: 'అబద్ధాల మా నాన్న మూడోసారి తండ్రి కాబోతున్నారు' - పంజాబ్ సీఎం భగవంత్ పై కుమార్తె సంచలన వ్యాఖ్యలు

Bhagwant Mann: 'అబద్ధాల మా నాన్న మూడోసారి తండ్రి కాబోతున్నారు' - పంజాబ్ సీఎం భగవంత్ పై కుమార్తె సంచలన వ్యాఖ్యలు

Sabrimala Temple: శబరిమలలో విషాదం, అయ్యప్ప ఆలయంలో ఆగిన చిన్నారి గుండె

Sabrimala Temple: శబరిమలలో విషాదం, అయ్యప్ప ఆలయంలో ఆగిన చిన్నారి గుండె

టాప్ స్టోరీస్

What is happening in YSRCP : ఎమ్మెల్యే పదవికే కాదు వైసీపీకి కూడా ఆళ్ల రాజీనామా - వైఎస్ఆర్‌సీపీలో ఏం జరుగుతోంది ?

What is happening in YSRCP : ఎమ్మెల్యే పదవికే కాదు వైసీపీకి కూడా ఆళ్ల రాజీనామా  - వైఎస్ఆర్‌సీపీలో ఏం జరుగుతోంది ?

Bandlagooda Private School: ప్రైవేట్ స్కూల్ అత్యుత్సాహం - అయ్యప్ప మాల ధరించిన బాలికను అనుమతించని యాజమాన్యం

Bandlagooda Private School: ప్రైవేట్ స్కూల్ అత్యుత్సాహం - అయ్యప్ప మాల ధరించిన బాలికను అనుమతించని యాజమాన్యం

Chittoor District News: చిత్తూరు జిల్లా ప్రజలను వణికిస్తున్న ఏనుగుల గుంపు- కుప్పంలో హై అలర్ట్

Chittoor District News: చిత్తూరు జిల్లా ప్రజలను వణికిస్తున్న ఏనుగుల గుంపు- కుప్పంలో హై అలర్ట్

Nelson Dilipkumar: రజనీకాంత్‌ను అలా చూపించొద్దన్నారు, భయమేసినా వెనక్కి తగ్గలేదు: ‘జైలర్’ దర్శకుడు నెల్సన్‌

Nelson Dilipkumar: రజనీకాంత్‌ను అలా చూపించొద్దన్నారు, భయమేసినా వెనక్కి తగ్గలేదు: ‘జైలర్’ దర్శకుడు నెల్సన్‌