అన్వేషించండి

Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

మహారాష్ట్రలో పర్బానీ జిల్లాలో యశ్వాడిలో హనుమాన్ ఆలయంలో జరిగిన ప్రమాదంలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమని, మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మహారాష్ట్ర పర్బానీలో హనుమాన్ ఆలయం పైకప్పు కూలింది.
  • నిర్మాణంలో ఉన్న సభా మండపం కూలి ఏడుగురు మరణించారు.
  • 32 మంది గాయపడ్డారు; సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి.
  • ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

Temple wall collapse in Parbhani, Maharashtra | ముంబై: మహరాష్ట్రలోని పర్బానీ జిల్లాలోని ఓ ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి ప్రసిద్ధ హనుమాన్ ఆలయంలో గర్బగుడి ముందు నిర్మాణంలో ఉన్న మండపం పైకప్పు కూలి భక్తులపై పడింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి చికిత్స కోసం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. 

అసలేం జరిగిందంటే..
మహారాష్ట్రలోని పరభణి జిల్లా మానవత్ తాలూకాలోని యశవాడిలోని హనుమాన్ ఆలయంలో శనివారం (20 జూన్) పెద్ద ప్రమాదం జరిగింది. ప్రసిద్ధ హనుమాన్ ఆలయ గర్భగుడి ముందు నిర్మాణంలో ఉన్న సభా మండపం పైకప్పు అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ప్రమాదంలో 7 గురు భక్తులు మరణించగా, 32 మంది గాయపడ్డారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.

Also Read: NEET Re-Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA

సమాచారం ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో ఆలయ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే యంత్రాంగం తక్షణమే సహాయక, రెస్క్యూ చర్యలను ప్రారంభించింది. శనివారం కావడం వల్ల పెద్ద సంఖ్యలో భక్తులు భారీ సంఖ్యలో హనుమాన్ దర్శనానికి వస్తుంటారు. ఘటనా స్థలంలో పలు అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయి. మెడికల్ బృందాలను కూడా తీసుకొచ్చారు. జిల్లా అధికారులు, పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 

ఆలయంలో విషాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..
మహారాష్ట్రంలోని పర్బానీ జిల్లాలో హనుమాన్ ఆలయంలో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మహారాష్ట్రలోని పరభణిలో గోడ కూలి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరం. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించడం నన్ను తీవ్రంగా కలిచివేసింది’ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Also Read: Gujarat Man Fakes Own Kidnapping: భర్త సెల్ఫ్ కిడ్నాప్ డ్రామా - భార్య నుంచి 50 లక్షలు గుంజుదామని ప్లాన్ - డామిట్ కథ అడ్డం తిరిగింది!

Frequently Asked Questions

పర్బానీలో జరిగిన ప్రమాదం ఏమిటి?

మహారాష్ట్రలోని పర్బానీ జిల్లాలోని యశ్వాడి హనుమాన్ ఆలయంలో నిర్మాణంలో ఉన్న మండపం పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో భక్తులు శిథిలాల కింద చిక్కుకున్నారు.

ఈ విషాద ఘటన ఎక్కడ జరిగింది?

ఈ దుర్ఘటన మహారాష్ట్రలోని పర్బానీ జిల్లా, మానవత్ తాలూకాలోని యశ్వాడిలో ఉన్న ప్రసిద్ధ హనుమాన్ ఆలయంలో జరిగింది.

ప్రమాదంలో ఎంతమంది భక్తులు మరణించారు లేదా గాయపడ్డారు?

ఈ ప్రమాదంలో 7 గురు భక్తులు మరణించారు మరియు 32 మంది గాయపడ్డారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది?

ఈ ప్రమాదం శనివారం (జూన్ 20) మధ్యాహ్నం జరిగింది. ఆ రోజు శనివారం కావడం వల్ల ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎలా స్పందించారు?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
BJP National Office Bearers Meeting: నితిన్ నబీన్ నేతృత్వంలో బీజేపీ కొత్త టీం తొలి సమావేశం - వందేమాతరం నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం!
నితిన్ నబీన్ నేతృత్వంలో బీజేపీ కొత్త టీం తొలి సమావేశం - వందేమాతరం నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget