Delhi Pollution: పొల్యూషన్‌ని కంట్రోల్ చేసేందుకు 5 అస్త్రాలు, ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలివే
Delhi Pollution: ఢిల్లీలో కాలుష్య కట్టడికి ప్రభుత్వం 5 కీలక చర్యలు తీసుకుంటోంది.
Delhi Air Pollution:
ఢిల్లీ కాలుష్యం..
ఢిల్లీతో పాటు NCRలో కాలుష్యం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Delhi Air Quality)లో వాయు నాణ్యత దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం AQI 460కి చేరుకుంది. దీన్ని "Severe Plus" కేటగిరీగా నిర్ధరించింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఇప్పటికే స్థానికులపై ఈ కాలుష్య ప్రభావం మొదలైంది. కళ్ల మంటలు, గొంతు గరగరతో ఇబ్బంది పడుతున్నట్టు చెబుతున్నారు. అంతే కాదు. ఎక్కడికక్కడ దుమ్ము ధూళి కమ్ముకోవడం వల్ల విజిబిలిటీ తగ్గిపోయింది. రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలేవీ కనబడడం లేదు. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వీలైనంత వేగంగా ఈ సమస్యని పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నోయిడాతో పాటు గుడ్‌గావ్‌లోనూ చర్యలు తీసుకుంటోంది. యాంటీ పొల్యూషన్ గైడ్‌లైన్స్ (Delhi anti-pollution guidelines) పాటించని వాళ్లకు జరిమానా విధిస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. కాలుష్యాన్ని (Delhi Air Pollution) తగ్గించేందుకు 5 కీలకమైన చర్యలు తీసుకుంటోంది.
#WATCH | Delhi | The Latest ANI drone camera footage from Akshardham area, shot at 1:45 p.m. today, shows the city shrouded in a thick blanket of haze.
— ANI (@ANI) November 3, 2023
The air quality in Delhi is in 'Severe' category today as per CPCB (Central Pollution Control Board). pic.twitter.com/TghICuZXoE
కాలుష్య కట్టడికి 5 చర్యలు..
. కాలుష్య స్థాయి పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ ప్రైమరీ స్కూల్స్‌ని రెండ్రోజుల పాటు మూసేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయం తీసుకుంది.
. ఇప్పటికే కాలుష్యం పెరుగుతోంది. ఇలాంటి సమయంలో నిర్మాణ పనులు జరిగితే ఇంకా ప్రమాదకరం. అందుకే అత్యవసరం కాని నిర్మాణ పనులను వెంటనే ఆపేయాలని ఆదేశించింది. ఎక్కువ కాలుష్యం వెదజల్లే వాహనాలను వాడకూడదని తేల్చి చెప్పింది.
. నిర్దేశిత స్థాయి కన్నా ఎక్కువ కాలుష్యం విడుదల చేస్తున్న వాహనాలపై ఆంక్షలు విధించింది. పదేళ్లకు పైబడిన వాహనాలను ఎక్కడికక్కడే కట్టడి చేస్తోంది. మైనింగ్, కూల్చివేతలు లాంటి వాటిపైనా ఆంక్షలు అమలు చేస్తోంది.
. BS III పెట్రోల్, BS IV డీజిల్ ఫోర్ వీలర్స్ రోడ్లపైకి రాకుండా బ్యాన్ చేసింది. ఢిల్లీ, గుడ్‌గావ్, ఫరియాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధనగర్‌లో ఈ ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చింది.
. కాలుష్యాన్ని తగ్గించేందుకు Red Light on Gaadi Off క్యాంపెయిన్ మొదలు పెట్టింది. రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఇంజిన్ ఆఫ్ చేయాలని సూచిస్తోంది. దీంతో పాటు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ని పెంచేందుకు అదనంగా 20 మెట్రో రైల్ ట్రిప్స్‌ని నడపనుంది. వీలైనంత వరకూ మెట్రో సర్వీస్‌లను వినియోగించుకోవాలి సూచిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ అత్యవసర భేటీకి పిలుపునిచ్చారు. చాలా చోట్ల దుమ్ముని తగ్గించేందుకు పెద్ద పెద్ద ట్యాంకర్లతో నీళ్లు చల్లుతున్నారు. అయితే...రానున్న రోజుల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read: అధిష్ఠానం ఆదేశిస్తే సీఎం అవుతా, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు