Delhi Earthquake: ఢిల్లీలో మరోసారి భూకంపం, వరుస ప్రకంపనలతో వణికిపోతున్న ప్రజలు
Delhi Earthquake: ఢిల్లీలో మరోసారి భూ ప్రకంపనలు అలజడి సృష్టించాయి.
Delhi Earthquake:
ఢిల్లీలో భూకంపం..
ఇప్పటికే కాలుష్యంతో అల్లాడిపోతున్న ఢిల్లీని వరుస భూకంపాలు (Delhi Earthquakes) మరింత భయపెడుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం (నవంబర్ 11) 3.36 నిముషాలకు మరోసారి భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేల్పై 2.6 తీవ్రత నమోదైంది. దాదాపు 10 కిలోమీటర్ల లోతు మేర భూకంప ప్రభావం కనిపించినట్టు National Centre for Seismology వెల్లడించింది. అయితే...ఈ ప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. ఈ మధ్యే ఢిల్లీ,NCR ప్రాంతాల్లో భూమి కంపించింది. వెస్ట్ నేపాల్‌లో రిక్టర్ స్కేల్‌పై 5.6 మ్యాగ్నిట్యూడ్‌తో భూ ప్రకంపనలు నమోదవడం వల్ల ఆ ప్రభావం దేశ రాజధానిపైనా పడింది. సెసిమిక్ జోన్ మ్యాప్ ప్రకారం...Bureau of Indian Standards కీలక విషయం వెల్లడించింది. ఢిల్లీ సహా NCR ప్రాంతాలు భూకంప విషయంలో Zone IV కిందకు వస్తాయని ప్రకటించింది. ఈ జోన్‌లోని ప్రాంతాలకు మధ్య నుంచి భారీ స్థాయిలో భూకంపాలు నమోదవుతాయని తెలిపింది.
Earthquake of Magnitude:2.6, Occurred on 11-11-2023, 15:36:53 IST, Lat: 28.80 & Long: 77.20, Depth: 10 Km ,Location: North District,Delhi, India for more information Download the BhooKamp App https://t.co/dvjcyAga1g @ndmaindia @Indiametdept @KirenRijiju @Dr_Mishra1966 @Ravi_MoES pic.twitter.com/kGgNJu2c07
— National Center for Seismology (@NCS_Earthquake) November 11, 2023
నవంబర్ 6వ తేదీన ఢిల్లీలో భూమి తీవ్రంగా కంపించింది. ఇటీవలే నేపాల్లో సంభవించిన భూకంప ధాటికి ఢిల్లీలోనూ ప్రభావం కనిపించింది. తరవాత మరోసారి తీవ్రంగా భూమి కంపించింది. నవంబర్ 6న 4.18 గంటలకు భూమి కంపించినట్టు అధికారులు వెల్లడించారు. నేపాల్లో ఇప్పటికే భూకంపం అలజడి సృష్టించింది. అక్కడ రిక్టర్ స్కేల్పై 5.2 తీవ్రత నమోదైంది. ఆ వెంటనే దేశ రాజధానిలో భూమి కంపించింది. మూడు రోజుల్లోనే రెండు సార్లు భూకంపం నమోదవడం ఆందోళనకు గురి చేసింది. ఢిల్లీతో పాటు NCR ప్రాంతంలోనూ ఈ ప్రభావం కనిపించింది. నవంబర్ 3న అర్ధరాత్రి 11.30 గంటలకు నేపాల్లో భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేల్పై 6.4 తీవ్రత నమోదైంది. అప్పుడు కూడా ఢిల్లీలో ఈ ప్రభావం కనిపించింది. ఢిల్లీతో పాటు బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లోనూ భూమి కంపించింది.