Arvind Kejriwal: 'రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా' - అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన
Delhi News: తన సీఎం పదవికి త్వరలోనే రాజీనామా చేస్తానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం కీలక ప్రకటన చేశారు. నిర్దోషిగా నిరూపించుకునేంత వరకూ ఆ పదవిలో ఉండనని అన్నారు.
Arvind Kejriwal Sensational Announcement: రెండు రోజుల్లో తన సీఎం పదవికి రాజీనామా చేస్తానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆదివారం సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీలోని (Delhi) ఆప్ కార్యాలయంలో ఆదివారం తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకూ ఆ పదవిలో ఉండడని స్పష్టం చేశారు. ఆప్ కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడే తమతో ఉండి ముందుకు నడిపించాడని.. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే శత్రువులతో పోరాడతామని అన్నారు. ఆప్ నేతలు సత్యేందర్ జైన్, అమానతుల్లా ఖాన్ ఇంకా జైల్లోనే ఉన్నారని.. త్వరలోనే వారు బయటకు వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. 'కేజ్రీవాల్ ధైర్య సాహసాలే లక్ష్యంగా నన్ను జైలుకు పంపారు. నన్ను జైల్లో పెట్టి మా పార్టీని విచ్ఛిన్నం చేసి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. భారత రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో నేను జైలులో రాజీనామా చేయలేదు. ప్రభుత్వం జైలు నుంచి నడపగలదని సుప్రీంకోర్టు నిరూపించింది. కుట్రపై సత్యం విజయం సాధించింది. దేశాన్ని బలహీనపరుస్తోన్న, విభజిస్తున్న శక్తులపై నా పోరాటం ఆగదు.' అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
#WATCH | Delhi: CM Arvind Kejriwal says, "They sent me to jail because their goal was to break the AAP and the courage of Arvind Kejriwal... They thought they would break our party and form a government in Delhi after jailing me... But our party did not break... I did not resign… pic.twitter.com/o0SJqoiujL
— ANI (@ANI) September 15, 2024
दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल ने कहा, "...मैं 2 दिन बाद मुख्यमंत्री पद से इस्तीफा देने जा रहा हूं। जब तक जनता अपना फैसला नहीं दे देती, मैं मुख्यमंत्री की कुर्सी पर नहीं बैठूंगा... मैं हर घर और गली में जाऊंगा और जब तक जनता का फैसला नहीं मिल जाता, तब तक मुख्यमंत्री की… pic.twitter.com/4ciEleT5KD
— ANI_HindiNews (@AHindinews) September 15, 2024
ఇటీవలే బెయిల్ మంజూరు
కాగా, ఢిల్లీ లిక్కర్ కేసుకు (Delhi Liquor Case) సంబంధించి సీబీఐ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు (CM Kejriwal) సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో దాదాపు 6 నెలల తర్వాత తీహార్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. లిక్కర్ స్కాంలో మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయగా.. ఈడీ కస్టడీలో ఉన్న ఆయన్ను జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసింది. సీబీఐ కేసులో తన అరెస్టును సవాల్ చేయడం సహా.. బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ రెండు వేర్వేరు పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేయగా విచారించిన అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా, ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 లక్షల పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలతో బెయిల్ ఇచ్చింది. కేసు గురించి క్కడా బహిరంగ వ్యాఖ్యలు చెయ్యొద్దని స్పష్టం చేసింది. సీఎం కార్యాలయానికి వెళ్లొద్దని.. ఎలాంటి అధికారిక ఫైళ్లపై సంతకాలు సైతం చెయ్యొద్దని పేర్కొంది. కేసు విచారణ కోసం ట్రయల్ కోర్టు ఎదుట హాజరు కావాలని తెలిపింది.
Also Read: New Vande Bharat Trains: దేశంలో 7 కొత్త వందేభారత్‌లు, జెండా ఊపి ప్రారంభించిన మోదీ