Coronavirus Vaccine for Children: 12 ఏళ్ల లోపు పిల్లలకు 3 టీకాలు- DCGI కీలక నిర్ణయం
Coronavirus Vaccine for Children: కొవాగ్జిన్ టీకాను 12 ఏళ్ల లోపు పిల్లలకు ఇచ్చేందుకు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది.
Coronavirus Vaccine for Children: 6-12 ఏళ్ల లోపు పిల్లలకు కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ (భారత ఔషధ నియంత్రణ) మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటు 5-12 ఏళ్ల మధ్య వారికి కొర్బావాక్స్ వ్యాక్సిన్, 12 ఏళ్లు పైబడిన వారికి జైడస్ సంస్థ వ్యాక్సిన్ జైకొవ్ డి టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చింది డీసీజీఐ.
#COVID19 | DCGI grants emergency use authorisation to ZycovD (Zydus Cadila vaccine) for children above the age of 12 years: Sources
— ANI (@ANI) April 26, 2022
#COVID19 | DCGI (Drugs Controller General of India) grants emergency use authorisation to Corbevax for children between the age of 5-12 years: Sources
— ANI (@ANI) April 26, 2022
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు తీసుకోగా, కోట్లాది మందిని అనారోగ్యానికి గురి చేసింది. భారత్‌లోనూ తీవ్ర ప్రభావం చూపింది. అయితే, కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో పలు కరోనా వేవ్‌లను అడ్డుకోగలిగింది భారత్. అయితే, కొవిడ్ నియంత్రణ చర్యల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కీలక పాత్ర పోషించింది.
ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచింది. ఈ క్రమంలోనే 12-15 ఏళ్లలోపు పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్‌ను కేంద్రం మార్చిలో ప్రారంభించనుంది. అలాగే, సీనియర్ సిటిజన్‌లకు ముందస్తు జాగ్రత్త మోతాదులను (బూస్టర్ డోసులు లాంటివి) అందిస్తోంది. మార్చి 16 నుంచి 12-13 ఏళ్లు, 13-14 ఏళ్ల వారికి కరోనా వైరస్ టీకాలు వేయడం ప్రారంభించింది.
కరోనా కేసులు
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజులో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కొత్తగా 2,483 కరోనా కేసులు నమోదుకాగా 1347 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 4,30,62,569కి పెరిగింది.
దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. సోమవారం 22,83,224 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,87,95,76,423కు చేరింది.
కరోనా ఫోర్త్ వేవ్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసుల పెరుగుదల, జీనోమ్ సీక్వెన్సీ, ఇన్‌ఫెక్షన్ పెరుగుదల వంటి అంశాలపై చర్చించి ప్రత్యేక దృష్టి సారించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.
Also Read: Hanuman Chalisa Row: నవనీత్ రాణా దంపతులకు నో రిలీఫ్- బెయిల్ కోసం వెయిటింగ్ తప్పదు
Also Read: Covid Update: ఫోర్త్ వేవ్ దగ్గర పడిందా! ఒక్కరోజులో 1347 మంది కరోనాతో మృతి