Corona cases India Updates: కొత్తగా 10,197 మందికి కరోనా.. 527 రోజుల కనిష్టానికి యాక్టివ్ కేసులు
దేశంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా బాధితుల సంఖ్య 3,44,66,598 కు చేరుకుంది. అయితే యాక్టివ్ కరోనా కేసులు 527 రోజుల కనిష్టానికి దిగొచ్చాయని కేంద్ర వైద్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.
దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. తాజాగా 10,197 మందికి కొవిడ్ బారిన పడినట్లు నిర్ధారించారు. అదే సమయంలో కరోనా మహమ్మారి బారిన పడి మరో 301 మంది మృతి చెందారు. యాక్టివ్ కరోనా కేసులు 527 రోజుల కనిష్టానికి దిగొచ్చాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
దేశంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా బాధితుల సంఖ్య 3,44,66,598 కు చేరుకుంది. కొవిడ్ 19 మహమ్మారితో పోరాడిన ఇప్పటివరకూ మొత్తం 4,64,153 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 1,28,555 చికిత్స అనంతరం కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కరోనా బాధితులలో బుధవారం ఉదయం వరకు 3,38,73,890 మంది కోలుకున్నారు.
Also Read: Fried Foods: ఆరోగ్యాన్ని వేయించుకుని తినేయకండి... వేపుడు వంటకాలతో వచ్చే రోగాలు ఇవే
#COVID19 | India reports 10,197 new cases, 12,134 recoveries & 301 deaths in last 24 hrs.
— ANI (@ANI) November 17, 2021
Active caseload stands at 1,28,555 - lowest in 527 days.
Daily positivity rate (0.82%) less than 2% for last 44 days, Weekly Positivity Rate (0.96%) less than 2% for last 54 days. pic.twitter.com/Y3EMMu6GNf
భారత్‌లో నమోదవుతున్న కేసులలో సగం కేసులు కేరళ రాష్ట్రం నుంచే వస్తున్నాయి. దేశంలో నమోదైన కేసులలో 5,516 పాజిటివ్ కేసులు, 39 మరణాలు కేరళలో నమోదయ్యాయి. 6,705 మంది రికవరీ అయ్యారు. దేశవ్యాప్తంగా చూస్తే రోజువారీ పాజిటివిటీ రేటు 0.82 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 0.96 శాతానికి దిగొచ్చింది.
జమ్ముకశ్మీర్లో కరోనా పాజిటివిటీ రేటు పెరుగుతున్నందున నేటి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణలో కరోనా కేసులు గత కొన్ని రోజులుగా నిలకడగా ఉన్నాయి. నిన్న ఏపీలో 191 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కోవిడ్ తో తాజాగా ఇద్దరు మృతి చెందారు. తెలంగాణలో 167 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,889కు చేరాయి.
Also Read: తెలంగాణ బాలిక అరుదైన ఘనత.. సినిమాలు చూసింది.. కిలిమాంజారో ఎక్కేసింది