News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Bharat Buzz: సోనియా నివాసంలో కాంగ్రెస్ లీడర్ల అత్యవసర భేటీ, వెంటనే I.N.D.I.A కూటమితోనూ

G-20 సదస్సుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిన ఆహ్వానంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అనే సాంప్రదాయానికి భిన్నంగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఉన్న సంగతి తెలిసిందే.

FOLLOW US: 
Share:

మన దేశానికి ఉన్న రెండు పేర్లలో ఇండియా అనే పేరును తొలగించి ‘భారత్‌’గా మార్చుతారనే ప్రచారం వేళ కాంగ్రెస్ పార్టీ అత్యవసరంగా సమావేశం అయింది. కాంగ్రెస్ పార్లమెంటరీ లీడర్లు సోనియా గాంధీ నివాసంలో సమావేశం అయ్యారు. అనంతరం ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే నివాసంలో I.N.D.I.A కూటమికి చెందిన నేతలు సమావేశం అవనున్నారు. G-20 సదస్సుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిన ఆహ్వానంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అనే సాంప్రదాయానికి భిన్నంగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఉన్న సంగతి తెలిసిందే. ఈ పరిణామం బయటికి వచ్చినప్పటి నుంచి దేశం పేరు మారుస్తారని బాగా ప్రచారం జరుగుతూ ఉంది.

సెప్టెంబరు 18 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సమావేశాలు ఎందుకు ప్రారంభం అవుతున్నాయనే అంశంపై ఎటువంటి ఎజెండా ఇవ్వలేదు. ఇలా చేయడం ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. బీజేపీ నాయకులతోపాటుగా అమితాబ్ బచ్చన్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి వంటి పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో ‘భారత్’ అనే పేరును స్వాగతిస్తూ ప్రశంసించారు.

కూటమి పేరు భారత్ గా మార్చితే - కేజ్రీవాల్

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ‘I.N.D.I.A’ కూటమిగా ఏర్పడ్డ విపక్షాలకు మోకాలడ్డిన చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘I.N.D.I.A’ కూటమి పేరు సమస్యగా ఉన్నందున ‘భారత్‌’గా మార్చుకుంటే, మరి ‘భారత్‌’ స్థానంలో భారతీయ జనతా పార్టీ మరేదైనా పేరు పెట్టుకుంటుందా? అని ప్రశ్నించారు.

దేశం 140 కోట్ల మంది ప్రజలది, కేవలం ఒక పార్టీది కాదు అంటూ మండిపడ్డారు. అలాగే ఇంకా ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ఒక వేళ విపక్ష కూటమి పేరును ఇండియా నుంచి భారత్‌ అని మార్చితే అప్పుడు ఏం చేస్తారంటూ ప్రశ్నించారు. తాము కూటమి పేరును భారత్‌గా మారిస్తే మీరు దేశం పేరును బీజేపీగా మారుస్తారా అంటూ అడిగారు.

కాంగ్రెస్‌ నాయకుడు జైరాం రమేష్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, ‘‘మోదీ చరిత్రను వక్రీకరించడం, భారతదేశాన్ని విభజించడం కొనసాగించవచ్చు, ఇది రాష్ట్రాల యూనియన్, ఇది భారతదేశం, కానీ మేం బెదిరిపోం, అయితే INDIA పార్టీల ప్రయోజనం ఏమిటి? ఇది భారతదేశం - సామరస్యం, సయోధ్య, విశ్వాసాన్ని తీసుకురండి. భారత్ ఏకమవుతుంది, భారత్ గెలుస్తుంది!’’ అని అన్నారు.

ఇటీవల విపక్ష పార్టీలు కలిసి  తమ కూటమికి I.N.D.I.A గా పేరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే విపక్ష కూటమికి I.N.D.I.A పేరు పెట్టుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ భయపడ్డారని ఈ క్రమంలోనే దేశం పేరును ఇండియా కాకుండా భారత్‌ అని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. దేశం పేరు మార్చే అంశాన్ని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.

రాజ్యాంగంలో ఇలా

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1లో దేశం పేరును ప్రస్తావించారు. ఇండియా, అంటే భారత్‌ అని, రాష్ట్రాల యూనియన్‌ అని పేర్కొన్నారు. దేశాన్ని అధికారికంగా ఏమని పిలుస్తారో తెలిపే రాజ్యాంగంలోని నిబంధన ఇదొక్కటే. దీని ఆధారంగానే హిందీలో భారత్‌ రిపబ్లిక్‌ అని, ఇంగ్లీష్‌లో రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండియా అని రాశారు. 

Published at : 05 Sep 2023 08:48 PM (IST) Tags: PM Modi India News Congress news Sonia Gandhi Bharat Name change

ఇవి కూడా చూడండి

Aditya L1: ఇస్రో కీలక అప్‌డేట్, సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆదిత్య L1

Aditya L1: ఇస్రో కీలక అప్‌డేట్, సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆదిత్య L1

FSSAI: న్యూస్ పేపర్లలో ఆహారం ప్యాక్ చేయొద్దు, ఆరోగ్యానికి ప్రమాదం- ఫుడ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరిక

FSSAI: న్యూస్ పేపర్లలో ఆహారం ప్యాక్ చేయొద్దు, ఆరోగ్యానికి ప్రమాదం- ఫుడ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరిక

అంబులెన్స్ కు దారివ్వని బిహార్ సీఎం సెక్యూరిటీ, ప్రమాదంలో చిన్నారి ప్రాణాలు

అంబులెన్స్ కు దారివ్వని బిహార్ సీఎం సెక్యూరిటీ, ప్రమాదంలో చిన్నారి ప్రాణాలు

Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు

Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు

ESIC Recruitment 2023: ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో 1,038 పారామెడికల్ స్టాఫ్ పోస్టులు, తెలంగాణ రీజియన్‌లో ఎన్ని పోస్టులంటే?

ESIC Recruitment 2023: ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో 1,038 పారామెడికల్ స్టాఫ్ పోస్టులు, తెలంగాణ రీజియన్‌లో ఎన్ని పోస్టులంటే?

టాప్ స్టోరీస్

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ