అన్వేషించండి

CJP Abhijeet Dipke Released: అభిజిత్ దీప్కే సహా సీజేపీ ముఖ్య నేతల విడుదల.. కోర్టు షరతులు ఏంటో తెలుసా?

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేతో పాటు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల విడుదలకు ఢిల్లీ కంటోన్మెంట్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు కండీషన్లతో అనుమతి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

న్యూఢిల్లీ: కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేతో పాటు  సౌరవ్‌ దాస్, అశుతోష్‌ రాంకాలను పోలీసులు విడుదల చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలనే డిమాండుతో శనివారం జంతర్‌ మంతర్‌వద్ద ఆందోళన చేపట్టడానికి ఢిల్లీకి వచ్చిన సీజేపీ నేతలను విమానం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం వారిని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా.. ఆ ముగ్గురిని విడుదల చేయాలని ఆదేశించారు. న్యాయమూర్తి  సీజేపీ కీలక నేతలను విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారని  సీజేపీ నేత రత్నాసింగ్‌ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.  

ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం..
అభిజిత్ దీప్కే అరెస్టుతో సీజేపీ ఇన్‌ఛార్జ్‌ అయిన అజింక్య శిండే ఆధ్వర్యంలో ఆదివారం నాడు జంతర్‌ మంతర్‌వద్ద నిరసన కొనసాగిస్తామని ప్రకటించారు. వరుసగా రెండో రోజు కూడా ఆందోళన కొనసాగుతుందని చెప్పడంతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జంతర్ మంతర్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 30,000 మందికి పైగా పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది మోహరించారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలు, సరిహద్దు ప్రాంతాలతో పాటు రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్లు లాంటి ప్రదేశాల పోలీసులు నిఘాను పెంచారు. 

సీజేపీ నేతల విడుదలకు కోర్టు షరతులు ?

ఢిల్లీలో ఆందోళన చేపట్టేందుకు వచ్చి అరెస్ట్ అయిన సీజేపీ ముఖ్య నేతల విడుదలకు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు ఓ షరతు విధించిందినట్లు తెలుస్తోంది. ఏడాది పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకూడదు అనే కండీషన్‌తో వీరికి బెయిల్ మంజూరు చేశారు. దాంతో 50 వేల ష్యూరిటీ, బాండ్ సమర్పించినట్లు సమాచారం. అదే నిజమైతే సీజేపీ నేతలు ఇకనుంచి ఎలాంటి ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టలేరా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీజేపీ ఉద్యమాలు, ఆందోళనలు ఇక కొనసాగించే అవకాశం ఉండదా అని ఆ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

తనను అక్రమంగా నిర్బంధించినందుకు పోలీసులపై కేసు నమోదు చేయాలని, తను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సీజేపీ లీగల్ అఫైర్స్ హెడ్ రత్నా సింగ్ పిటిషన్‌ను శనివారం ఢిల్లీ కోర్టు కొట్టివేసింది.

ఈ ముగ్గురు సిజెపి నాయకులపై భారత్ న్యాయ సురక్ష సంహితలోని సెక్షన్ 126 (శాంతిభద్రతల పరిరక్షణకు పూచీకత్తు), సెక్షన్ 170 (నేరాలను నిరోధించడానికి అరెస్టు) కింద కేసులు నమోదయ్యాయి. ప్రశాంతతకు లేదా శాంతికి భంగం కలిగించే అవకాశం ఉన్న వారిని విచారించి, శాంతిని కాపాడేందుకు (గరిష్టంగా 1 సంవత్సరం వరకు) బాండ్ సమర్పించాలని ఆదేశించే అధికారాన్ని బిఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 126 ఇస్తుంది. 

అదే విధంగా బిఎన్‌ఎస్ సెక్షన్ 170 ప్రకారం, ఒక cognizable offence పాల్పడేందుకు కుట్ర పన్నుతున్న వ్యక్తిని, ఆ నేరాన్ని నిరోధించలేని పక్షంలో వారెంట్ లేకుండా అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. ఇతర చట్టాల కింద నిర్బంధానికి అనుమతి ఉంటే తప్ప, 24 గంటల వరకు కస్టడీకి టైమ్ ఉంటుంది. 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Punjab Assembly Elections.. ఆప్ తొలి జాబితా జాబితా విడుదల- ధురి నుంచి బరిలోకి సీఎం భగవంత్ మాన్
ఆప్ తొలి జాబితా జాబితా విడుదల- ధురి నుంచి బరిలోకి సీఎం భగవంత్ మాన్
PM Kisan 24th Installment: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ నిధులు విడుదల.. మీ ఖాతాలో రూ.2 వేలు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి!
రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ నిధులు విడుదల.. రూ.2 వేలు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి!
కుంభమేళా 2027: నాసిక్-త్రయంబకేశ్వర్ సింహస్థ పర్వం పూర్తి షెడ్యూల్, అమృతస్నానాల ప్రాముఖ్యత!
కుంభమేళా 2027: నాసిక్-త్రయంబకేశ్వర్ సింహస్థ పర్వం పూర్తి షెడ్యూల్, అమృతస్నానాల ప్రాముఖ్యత!
AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Punjab Assembly Elections.. ఆప్ తొలి జాబితా జాబితా విడుదల- ధురి నుంచి బరిలోకి సీఎం భగవంత్ మాన్
ఆప్ తొలి జాబితా జాబితా విడుదల- ధురి నుంచి బరిలోకి సీఎం భగవంత్ మాన్
YS Sharmila Daughter Marriage: ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
ISRO మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
ఇస్రో మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
GVMC Mayor Election: ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
Miyapur 550 Acres Land Auction: మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
Gambhir Franchise Hunt: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Embed widget