Dolo Makers tax evasion : రూ.2 విలువైన డోలోతో వందల కోట్ల అక్రమాలు - ఈ మనీ ఫీవర్‌కు టాబ్లెట్ లేదు !
కరోనా ధర్డ్ వేవ్ సమయంలో వేల కోట్ల వ్యాపారం చేసిన డోలో టాబ్లెట్ తయారీదారులు అక్రమాలకు పాల్పడ్డారు. ఆ విషయాలు ఐటీ దాడుల్లో వెలుగు చూశాయి.
Dolo Makers tax evasion : కరోనా మూడో వేవ్‌లో అందరి దగ్గరా డోలో 650 టాబ్లెట్సే కనిపించాయి. ఎంతగా అంటే ఆ కంపెనీ సేల్స్ ఒక్క సారిగా పెరిగిపోయాయి. ఆ కంపెనీ యజమానులు కుబేరులయిపోయారు. అత్యంత సంపన్నుల జాబితాలో చేరిపోయారు. అంతగా డోలో 650 టాబ్లెట్స్ అమ్మకాలు జరిగాయి. దీనికి ఇంత హైప్ ఎలా వచ్చింది ? అంటే... రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి చేసుకున్నరాట. ఈ విషయం ఐటీ శాఖ సోదాల్లో బయట పడిన కొన్ని వివరాలతో వెల్లడయింది.
తెల్లారితే జాబ్ ఉంటుందో ఊడుతుందో, బడా సంస్థల ఉద్యోగులకూ ఇదే టెన్షన్-ఎందుకంటే?
ఎలా వచ్చిందో తెలియదు కానీ డోలో టాబ్లెట్లు కరోనాను సమర్థంగా ఎదుర్కొంటాయన్న ఓ ప్రచారం జనంలోకి వచ్చింది. సోషల్ మీడియాలో మీమర్స్ ఈ డోలో మేనియాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లారు. ఫలితంగా అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ డోలో టాబ్లెట్స్ ను కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకోవడం ప్రారంభించారు. రూపాయి కూడా ఉండని ఈ టాబ్లెట్ విలువ రెండు, మూడు రూపాయలకూ అమ్ముకున్నారు. కంపెనీకి వేల కోట్ల అమ్మకాలు వచ్చాయి. అంతకు మించి కంపెనీ విలువ అనూహ్యంగా పెరిగిపోయింది. అయితే ఇదంతా ఎలా వచ్చిందంటే.. దాదాపుగా రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి తెచ్చుకున్నరాని ఐటీ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
వర్షాలు కురవాలని ఎమ్మెల్యేకు బురద స్నానం చేయించిన ప్రజలు!
డాక్టర్లకు, మెడికల్ షాపు ఓనర్లకు దాదాపుగా రూ. వెయ్యి కోట్లను బహుమతులుగా పంపిణీ చేసింది డోలో తయారీదారు సంస్థ. ఈ డోలో ట్యాబ్లెట్స్‌ను మైక్రో ల్యాబ్స్ తయారు చేస్తుంది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆఫీసుల్లో తనిఖీలు చేస్తే అసలు విషయాలు బయటపడ్డాయి. రూ. వెయ్యి కోట్లు ఇలా వైద్యులకు ఉచితంగా పంపిణీ చేసినట్లు పత్రాలు లభ్యమయ్యాయి. అంతే కాదు దాదాపుగా రూ. మూడు వందల కోట్ల పన్ను ఎగ్గొట్టారు. దాదాపుగా వారం రోజుల పాటు ఈ సోదాలు జరిగాయి.
భర్తలపై తప్పుడు కేసులు పెడుతున్న భార్యలు- దిల్లీ హైకోర్టు సీరియస్!భర్తలపై తప్పుడు కేసులు పెడుతున్న భార్యలు- దిల్లీ హైకోర్టు సీరియస్!
మెడికల్ మాఫియా అనేది దేశంలో అతి పెద్ద దోపిడిదారుగా మారిందన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. అయితే తొలి సారిగా రూ. రెండు విలువ చేసే టాబ్లెట్‌తో వేల కోట్లు పోగేసిన వైనం.. అక్రమాలకు పాల్పడిన విధానం మాత్రం ప్రజల్ని మరోసారి ఆశ్చర్యానికి గురి చేస్తోంది.