BSF Museum: వాఘా బోర్డర్ వద్ద బీఎస్‌ఎఫ్ మ్యూజియం, లోపల ఏం ఉంటాయో తెలుసా?
BSF Museum in Attari Wagah Border: అమృత్ సర్ రైల్వే స్టేషన్ నుంచి కేవలం 34 కిలో మీటర్ల దూరంలో బీఎస్ఎఫ్ మ్యూజియం ఉంటుంది. 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.
Attari Wagah Border News: అటారి-వాఘా సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన బీఎస్‌ఎఫ్ (Border Security Force) మ్యూజియం వీక్షకులను ఆకట్టుకుంటోంది. భారత దేశ పరిరక్షణకు బీఎస్‌ఎఫ్ జవాన్లు చేసే సేవలు, వారి త్యాగాలను గుర్తు చేస్తూ సామాన్య ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ బీఎస్ఎఫ్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసారు.
Amritsar Railway Station నుంచి కేవలం 34 km దూరం లో బీటింగ్ రిట్రీట్ సెరిమోని జరిగే ప్రాంగణంలో ఈ బీఎస్ఎఫ్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసారు అధికారులు.
ఈ మ్యూజియం 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. బీఎస్‌ఎఫ్ చరిత్రను, దేశ పరిరక్షణకు వారు నిర్వహించే మీషన్స్ ను, పురోగతిని వివరిస్తూ వీక్షకులకి అవగాహన కల్పిస్తోంది.
మ్యూజియం ప్రత్యేకతలు:
1965 లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత బీఎస్‌ఎఫ్ ను సరిహద్దుల రక్షణ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నాటి నుండి బీఎస్ఎఫ్ ఎన్నో సాహసోపేతమైన ఘన విజయాలను సాధించింది. మ్యూజియంలో బీఎస్‌ఎఫ్ చరిత్రను తెలిపే చిత్రాలు, కథలు, వీడియోలు వీక్షకుల కు అవగాహన కల్పిస్తోంది.
బీఎస్ఎఫ్ ఉపయోగించే యుద్ధ సామగ్రి వివరాలు:
బీఎస్ఎఫ్ మ్యూజియంలో జవాన్లు దేశ పరిరక్షణకు ఉపయోగించే ఆయుధాలు గురిచి ప్రత్యెక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. బీఎస్ఎఫ్ జవాన్లు దేశ సరిహద్దుల పరిరక్షణ కు వాడే వాహనాల వివరాల గురించి కూడా వీక్షకులకు అందుబాటు లో ఉంచారు అధికారులు. థియేటర్ హాల్ లో ఏర్పాటు చేసిన వీడియో స్క్రీనింగ్ ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లు చెసే సాహసాలు, పరిరక్షణ కార్యక్రమాల గురించి అర్థం చేసుకోవచ్చు. యుద్ధాలలో వీరి పాత్రను వివరించే ఫోటోలు, వివరాలు కూడా ఉన్నాయి.
సాంకేతికత పరికరాల వివరాలు:
మ్యూజియంలో సరిహద్దు భద్రతకు ఉపయోగపడే తాజా సాంకేతిక పరికరాలు, డ్రోన్లు, నిఘా కెమెరాలు మొదలైన వాటి నమూనాలు కూడా ప్రదర్శన కూడా ఉన్నాయి. వీటితో బీఎస్‌ఎఫ్ తమ పరికరాలలో ఆధునిక టెక్నాలజీ ఎలా వినియోగిస్తుందో తెలుసుకోవచ్చు.
సందర్శకులకు మ్యూజియంలో వర్చువల్ రియాలిటీ విజువల్ ప్రెజెంటేషన్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ అనుభవాలు సందర్శకులను యుద్ధ క్షేత్రంలో ఉన్నట్టుగా అనిపిస్తాయి.
బీఎస్ఎఫ్ జవాన్ల జీవన శైలి గురించి ప్రత్యేక గ్యాలరీలు:
బీఎస్‌ఎఫ్ జావాన్ల జీవనశైలి ను చూపిస్తూ కొన్ని ప్రత్యేక గ్యాలరీలను కూడా ఏర్పాటు చేశారు. అంతే కాకుండా వారు చెసే సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అట్టారీ వాఘా సరిహద్దు వద్ద ప్రతి రోజు బీఎస్ఎఫ్ జవాల్ను ప్రదర్శించే జరిగే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం తో పాటు ఈ బీఎస్ఎఫ్ మ్యూజియం కూడా ప్రజలు వీక్షించే అవకాశం ఉంటుంది.
ఈ మ్యూజియం భారతదేశ భద్రతకు బీఎస్‌ఎఫ్ జవాన్ల చేసిన కృషిని గుర్తు చేస్తూ ప్రజలకు దేశభక్తిని విలువలను చాటిచెబుతోంది. ఈ మ్యూజియం లోని ప్రత్యేకతలను చూసాక ప్రతి ఒక్కరూ దేశ భద్రతకు బీఎస్‌ఎఫ్ సైనికులు సేవలను గుర్తిస్తూ ఒక మరుపురాని అనుభవాన్ని పొందుతారు అనడంలో ఏటువంటి అతిశయోక్తి ఉండదు.