By: ABP Desam | Updated at : 31 Jul 2023 11:39 AM (IST)
Edited By: Pavan
ప్రధాని మోదీపై లాలూ సంచలన వ్యాఖ్యలు, ఓడిపోయాక అదే పని చేస్తారంటూ కామెంట్స్ ( Image Source : ABP Hindi )
Lok Sabha Elections: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయాక విదేశాల్లో ఆశ్రయం కోసం వెతుకుతున్నారని లాలూ కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానని మోదీ ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించారు. విపక్ష కూటమి I.N.D.I.A ను ఏర్పాటు చేసిన ప్రతిపక్ష పార్టీలు.. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. క్విట్ ఇండియా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన లాలూ.. రాబోయే ఎన్నికల్లో మోదీ ఓడిపోయిన తర్వాత.. దేశాన్ని వదిలేసే ఆలోచనలో ఉన్నారని, అందుకే నరేంద్ర మోదీ విదేశాలను సందర్శిస్తున్నారని అన్నారు.
విదేశాల్లో పిజ్జాలు, మోమోస్, చౌ మెయిన్ లను ఆస్వాదించగలిగే ప్రదేశాన్ని మోదీ వెతుకుతున్నారని లాలూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స అనంతరం లాలూ ప్రసాద్ యాదవ్ క్రమంగా కోలుకుంటున్నారు. తాజాగా ఆయన బ్యాడ్మింట్ ఆడుతూ ఉల్లాసంగా కనిపించారు.
ఇండియాను తిట్టి చూడండి: లాలూ
బిహార్ రాజధాని పాట్నాలోని మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ నివాసంలో ఆదివారం (జులై 30) జరిగిన స్టూడెంట్ ఆర్జేడీ ఇండియా కార్యక్రమంలో లాలూ ప్రసాద్ యాదవ్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన బీజేపీ వర్సెస్ ఇండియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. బీహార్ లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న విషయాన్ని గుర్తు చేసిన లాలూ.. విపక్ష కూటమికి ఇండియా అనే పేరు పెట్టడాన్ని చాలా మంది మెచ్చుకున్నారని చెప్పుకొచ్చారు. ఇండియా వ్యూహానికి సంబంధించి ముంబైలో 3వ సమావేశం జరగనుందని.. విపక్ష పార్టీలన్నీ విభేదాలు మరిచి కలిసి పోటీ చేయాలని సూచించారు. విపక్షాల ఐక్యతపై బీజేపీ తీవ్ర ఆందోళన చెందుతోందని వ్యాఖ్యానించారు.
Cyclone Michaung Updates: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ
Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం
IIT Kanpur Placements 2023: ఐఐటీల్లో ప్లేస్‌మెంట్ల జోరు, అంతర్జాతీయ సంస్థల్లో అందిపుచ్చుకుంటున్న అవకాశాలు
Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ అలజడి, రెండు తెగల మధ్య కాల్పులు - 13 మంది మృతి
Mizoram Election Results 2023: ఒకప్పుడు ఇందిరా గాంధీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్, ఇప్పుడు మిజోరం సీఎం - ఎవరీ లల్దుహోమ?
Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!
Sleeping on Floor Benefits : అసలు నేలమీద పడుకుంటే ఎంత మంచిదో తెలుసా?
Janagama ZP Chairman Died: జనగామ జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి మృతి, బీఆర్ఎస్ పార్టీలో విషాదం
/body>