అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Ayodhya Ram Mandir Photos: అయోధ్య రామమందిరం వైభవం, ప్రత్యేకతలు ఇవీ- మీరు ఓ లుక్ వేయండి

Ram Mandir Consecration: అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ జనవరి 22న జరగనుంది. ఈ వేడుకల్లో ముఖ్యమైన ప్రాణప్రతిష్ఠ క్రతువులు మంగళవారం ప్రారంభమయ్యాయి. 

Ayodhya Ram Mandir Inauguration News: అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir)లో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ జనవరి 22న జరగనుంది. ఈ వేడుకల్లో ముఖ్యమైన ప్రాణప్రతిష్ఠ (Ram Mandir Pran Pratishtha) క్రతువులు మంగళవారం ప్రారంభమయ్యాయి. సరయు నది ఒడ్డున 'దశవిధ' స్నానం, విష్ణుపూజ, గోపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిపేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. వారం రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించి 22వ తేదీ రామ్ లల్లా విగ్రహం ప్రతిష్ఠాపన చేస్తారు. చివరి రోజు జరిగే మహోత్సవానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రాణప్రతిష్ట క్రతువులు ప్రారంభమైన సందర్భంగా ఆలయ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరూ చూసేయండి.

Ayodhya Ram Mandir Photos: అయోధ్య రామమందిరం వైభవం, ప్రత్యేకతలు ఇవీ- మీరు ఓ లుక్ వేయండి

రామాలయ సముదాయంలో బంగారు పూతతో కూడిన 14 గేట్లు ఏర్పాటు చేశారు. వాటిపై ఏనుగు, తామర, నెమలి మొదలైన బొమ్మలు చెక్కబడ్డాయి. తలుపుల ఏర్పాటు పనులు పూర్తయ్యాయని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర కమిటీ తెలిపింది. 

Ayodhya Ram Mandir Photos: అయోధ్య రామమందిరం వైభవం, ప్రత్యేకతలు ఇవీ- మీరు ఓ లుక్ వేయండి

శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ప్రకారం.. ఆలయం 1,000 ఏళ్లు నిలిచేలా నిర్మించబడింది. వెయ్యి సంవత్సరాల వరకు మరమ్మతులు అవసరం లేదు. ఆలయ నిర్మాణంలో సిమెంటు, కాంక్రీటు, ఇనుము ఉపయోగించలేదు.

Ayodhya Ram Mandir Photos: అయోధ్య రామమందిరం వైభవం, ప్రత్యేకతలు ఇవీ- మీరు ఓ లుక్ వేయండి

ఈ ఆలయ నిర్మాణానికి వాడిన ప్రతి ఇటుక మీద శ్రీరామ నామం లిఖించి ఉంది. ఇవి అత్యంత మన్నికైన ఇటుకలట. ఈ ఆలయ నిర్మాణం ఉత్తర భారతీయ ఆలయల తరహాలో గుజారా చౌలుక్య శైలిలో అయోధ్య ఆలయాన్ని నిర్మించారు.

Ayodhya Ram Mandir Photos: అయోధ్య రామమందిరం వైభవం, ప్రత్యేకతలు ఇవీ- మీరు ఓ లుక్ వేయండి

మొత్తం మూడు అంతస్తుల్లో ఆలయ నిర్మాణం జరుగుతోంది. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు. ఆలయంలో 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉన్నాయి. మొత్తం ఆలయాన్ని నిర్మించడానికి రెండు నుంచి మూడు సంవత్సరాలు పడుతుంది. 

Ayodhya Ram Mandir Photos: అయోధ్య రామమందిరం వైభవం, ప్రత్యేకతలు ఇవీ- మీరు ఓ లుక్ వేయండి

ప్రధాన ఆలయం 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఆలయం మొత్తం పొడవు 360 అడుగులు, శిఖరంతో కలిసి ఆలయం మొత్తం ఎత్తు 161 అడుగులు ఉంటుంది. ఇంత పెద్ద ఆలయాన్ని దర్శించుకోవాలంటే వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందే కదా. అలాంటి వారి కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్నారు.  

Ayodhya Ram Mandir Photos: అయోధ్య రామమందిరం వైభవం, ప్రత్యేకతలు ఇవీ- మీరు ఓ లుక్ వేయండి

ఆలయ గర్భగుడిలో బాల రాముడు రూపంలో కనిపిస్తాడు. గ్రౌండ్ ఫ్లోర్‌లో రాముడి పుట్టుక, అతడి బాల్యాన్ని వర్ణించే శిల్పాలు చెక్కారు. మొదటి అంతస్తులో రామసభను వివరించే శిల్పాలు ఉంటాయి. మందిర నిర్మాణానికి భరత్ పూర్ నుంచి గులాబి రంగు బన్సీపహార్ పూర్ సాండ్ స్టోన్‌ను వినియోగించారు.

Ayodhya Ram Mandir Photos: అయోధ్య రామమందిరం వైభవం, ప్రత్యేకతలు ఇవీ- మీరు ఓ లుక్ వేయండి

రామమందిర ప్రారంభోత్సవ వేడుకకు థాయ్ లాండ్ నుంచి మన్ను వస్తుందట. ఇది వరకు నిర్మాణ సమయంలో కూడా థాయ్‌లాండ్ లోని రెండు నదుల నుంచి సేకరించిన నీటిని కూడా వినియోగించారట. అంతేకాదు అయోధ్య రామాలయం నమూనాను ఒకటి థాయ్ లాండ్‌లో నిర్మించారు.

రామమందిరం గ్రౌండ్ ఫ్లోర్‌లో 160 విభాగాలుగా, రెండో అంతస్తు 132 విభాగాలుగా విభజించబడి ఉంటుంది. ఆలయానికి మొత్తం 12 ద్వారాలు ఉంటాయి. ఇలా ఎన్నెన్నో విశేషాలతో అయోధ్య రామ మందిరం ఒక అద్భుత కట్టడంగా విరాజిల్లనుంది. 

నేటి నుంచి ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు

  • జనవరి 16: అయోధ్య ప్రాణప్రతిష్ఠ క్రతువులు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్ నియమించిన హోస్ట్, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం  ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని నిర్వహించారు. సరయూ నది ఒడ్డున 'దశవిధ' స్నానం, విష్ణుపూజ, గోపూజ చేపట్టారు.
  • జనవరి 17: రామ్ లల్లా విగ్రహం ఊరేగింపు అయోధ్యకు చేరుకుంటుంది. మంగళ కలశంలో సరయూ జలాన్ని తీసుకొని భక్తులు అయోధ్య ఆలయానికి చేరుకుంటారు.
  • జనవరి 18: గణేష్ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, వాస్తు పూజలు నిర్వహిస్తారు.
  • జనవరి 19 : యజ్ఞం ప్రారంబంకానుంది. తర్వాత 'నవగ్రహ' 'హవన్' స్థాపన జరుగుతుంది.
  • జనవరి 20: రామజన్మభూమి ఆలయ గర్భగుడిని జనవరి 20న సరయూ నీటితో కడుగుతారు, ఆ తర్వాత వాస్తు శాంతి 'అన్నాధివాస్' ఆచారాలు జరుగుతాయి.
  • జనవరి 21: రామ్ లల్లా విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయించి, చివరకు శంకుస్థాపన చేస్తారు.
  • జనవరి 22: ప్రధాన "ప్రాణ్‌ ప్రతిష్ఠ" వేడుక జనవరి 22న మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమవుతుంది. రామ్ లల్లా విగ్రహం ప్రతిష్ఠాపన చేస్తారు. చివరి రోజు జరిగే మహోత్సవానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది.
  • జనవరి 23: భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. జనవరి 21 22 తేదీల్లో అయోధ్య ఆలయానికి భక్తులను రానివ్వరు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
Jayamangala Venkataramana : వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!ఎలక్ట్రిక్ వెహికిల్స్ పేలిపోకూడదంటే.. జాగ్రత్తలు ఇవే!Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
Jayamangala Venkataramana : వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
Pamkuntla Sai Reddy: 'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
CM Chandrababu: 'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Game Changer: ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి ప్రీ రిలీజ్ వేడుక... రిలీజ్‌కు ముందు 'గేమ్ ఛేంజర్' ఖాతాలో అరుదైన రికార్డు
ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి ప్రీ రిలీజ్ వేడుక... రిలీజ్‌కు ముందు 'గేమ్ ఛేంజర్' ఖాతాలో అరుదైన రికార్డు
Embed widget