Assembly Elections 2023 Live Updates: 5 రాష్ట్రాల ఎన్నికల తేదీల్ని ప్రకటిస్తున్న ఎన్నికల సంఘం
5 States Assembly Elections 2023 Dates Live: మరి కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం 5 రాష్ట్రాల ఎన్నికల తేదీల్ని ప్రకటించనుంది.

Background
5 States Assembly Elections:
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అంతా సిద్ధమవుతోంది. ఢిల్లీలో పోలీసులు, వ్యయాలు, సాధారణ విభాగాలకు సంబంధించిన పరిశీలకులతో సీఈసీ రాజీవ్ కుమార్ సమీక్ష జరిపారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ధన బలాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. పార్టీలు, అభ్యర్థులు పంపిణీ చేసే ధన బలాన్ని పూర్తిగా కట్టడి చేయాలని అబ్జర్వర్లను నిర్దేశించారు రాజీవ్ కుమార్. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణపై ధన, కండ బలం ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన వ్యూహాలపై చర్చించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థంగా అమలు చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణపై ధనం, కండ బలం ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన వ్యూహాన్ని ఈసీ అమలు చేయనుంది.
ఇటీవల ఆన్ లైన్ నగదు బదిలీ అభ్యర్థులకు అనుకూలంగా మారిందని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఆ విధంగా ప్రలోభ పెట్టినా కూడా తమకు తెలిసిపోతుందని, ఆన్ లైన్ లో నగదు బదిలీల వివరాలను తెలుసుకునేందుకు బ్యాంకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగించనుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారం కూడా తీసుకుంటున్నట్టు సీఈసీ తెలిపారు. సీ విజిల్ యాప్ ద్వారా ప్రజలు ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు చేయవచ్చని, ఫొటోను యాప్ లో అప్‌లోడ్ చేస్తే 100 నిముషాల వ్యవధిలో అధికారులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేసి, ఫిర్యాదుదారుడికి సమాచారమిస్తారని రాజీవ్ కుమార్ తెలిపారు.
గత ఎన్నికల్లో తెలంగాణలో 73.37 శాతం పోలింగు నమోదైంది. 29 నియోజకవర్గాల్లో మాత్రం పోలింగ్ 60 శాతం కంటే తక్కువగా ఉంది. ఆయా నియోజకవర్గాల్లో ఈసారి పోలింగ్ శాతం పెంచడంపై ఫోకస్ పెడుతున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో 35,356 పోలింగు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మహిళలకు 597 ప్రత్యేక కేంద్రాలు, దివ్యాంగులకు 120 కేటాయించారు. ఒక్కో సెగ్మెంట్ లో యువతకు ఒక పోలింగ్ కేంద్రం కేటాయించనుంది. 80 ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతానికిపైగా అంగవైకల్యం ఉన్నవారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తోంది.
5 రాష్ట్రాల పోలింగ్ తేదీలు ప్రకటన
5 రాష్ట్రాల పోలింగ్ తేదీలు ఇలా..
మధ్యప్రదేశ్: నవంబర్ 17
రాజస్థాన్: నవంబర్ 23
ఛత్తీస్‌గఢ్ (రెండు విడతల్లో) : నవంబర్ 7, 17
తెలంగాణ: నవంబర్ 30
మిజోరం: నవంబర్ 7
ఫలితాల ప్రకటన : డిసెంబర్ 3
5 రాష్ట్రాల్లో 60 లక్షల మంది కొత్త ఓటర్లు
5 రాష్ట్రాల్లో మొత్తం 679 అసెంబ్లీ స్థానాలున్నట్టు చెప్పిన సీఈసీ...ఈ రాష్ట్రాల్లో 40 రోజుల పాటు పర్యటించామని తెలిపారు. ఈ 5 రాష్ట్రాల్లో 60 లక్షల మంది కొత్త ఓటర్లున్నారని చెప్పారు.





















