![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Andaman Airport: ఇటీవల ప్రారంభం, అప్పుడే ఊడిపోయిన ఎయిర్ పోర్ట్ సీలింగ్- కాంగ్రెస్, బీజేపీ మధ్య ఫైట్
Andaman Airport: ఈమధ్యే ప్రారంభమైన అండమాన్ ఎయిర్‌పోర్టు సీలింగ్ ఒక్క వర్షానికే ఊడిపోయింది. ఈ విషయంపై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
![Andaman Airport: ఇటీవల ప్రారంభం, అప్పుడే ఊడిపోయిన ఎయిర్ పోర్ట్ సీలింగ్- కాంగ్రెస్, బీజేపీ మధ్య ఫైట్ Andaman Airport War Between BJP vs Congress Over Andaman Airport Ceiling Collapse Check Details Andaman Airport: ఇటీవల ప్రారంభం, అప్పుడే ఊడిపోయిన ఎయిర్ పోర్ట్ సీలింగ్- కాంగ్రెస్, బీజేపీ మధ్య ఫైట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/24/8c1f4cb580ecc57e106f0e55f8f51e921690202512339519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Andaman Airport: అండమాన్ పోర్ట్ బ్లెయిర్ లోని వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని కొన్ని రోజుల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇటీవల కురిసిన వర్షానికి ఈ టెర్మినల్ ఫాల్స్ సీలింగ్ ఊడిపోయింది.
Not so good news ... the ceiling of the new Veer Savarkar International Airport drops. #Andaman pic.twitter.com/yhjUOnXfQF
— Andaman Chronicle (@AndamanNews) July 23, 2023
ఈ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. విమానాశ్రయ సీలింగ్ వర్షానికి ఊడిపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా జైరాం రమేష్ కు కౌంటర్ ఇచ్చారు. సీసీటీవీల ఏర్పాటు కోసం ఉద్దేశపూర్వకంగానే సీలింగ్ ను లూజ్ చేసినట్లు సింధియా తన ట్వీట్ లో పేర్కొన్నారు.
The Prime Minister will inaugurate anything these days — even if it’s unfinished or substandard infrastructure (highways, airports, bridges, trains, etc)
— Jairam Ramesh (@Jairam_Ramesh) July 23, 2023
More than willing ministers anxious to boost their Sensex with him oblige.
It’s the taxpayers and citizens who pay the cost.… https://t.co/TGUg128dsz
జైరాం రమేష్ తన ట్వీట్ లో 'ఈ రోజుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఏదైనా కట్టడం, నిర్మాణం అసంపూర్తిగా ఉన్నా, నాసిరకమైన మౌలిక సదుపాయాలతో నిర్మించినా.. వాటిని ప్రారంభిస్తున్నారు' అంటూ గాలికి ఊగుతున్న ఫాల్స్ సీలింగ్ ప్యానెల్ వీడియోను పోస్టు చేశారు. జైరాం రమేష్ ట్వీట్ పై తాజాగా జ్యోతిరాదిత్య సింధియా ట్విట్టర్ వేదికగానే స్పందించారు. 'తదుపరి సారి 'తదుపరి సారి.. ఏమీ లేకున్నా సంచలనాల కోసం ప్రయత్నించే ముందు వివరణ అడగండి' అంటూ ట్వీట్ చేశారు. ఈ ఫాల్స్ సీలింగ్ నిర్మాణం టెర్మినల్ వెనక బయట ఉందని, అలాగే సీసీటీవీల ఏర్పాటు కోసం ఉద్దేశపూర్వకంగానే ఫాల్స్ సీలింగ్ లో కొత్త భాగాన్ని వదులు చేసినట్లు చెప్పుకొచ్చారు. భారీ గాలుల (సుమారు 100 కి.మీ/గం) వల్ల ఫాల్స్ సీలింగ్ ప్యానెళ్లు ఊగిపోయినట్లు చెప్పుకొచ్చారు. ఏమీలేని చోట సంచలనాల కోసం వెంపర్లాడే ముందు వివరణ తీసుకోవాలంటూ ట్విట్టర్ పోస్టులో రాసుకొచ్చారు.
The structure is outside the terminal building. Besides, a part of the false ceiling had been deliberately loosened for CCTV work. Heavy winds (about 100 km/hr) later, led to the swinging panels as seen in the video. The false ceiling had been restored after completing the work.… https://t.co/DuLYjUIk0V
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) July 24, 2023
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)