అన్వేషించండి

Amritpal Singh Video: పోలీసులు మా ఇంటికి వ‌చ్చుంటే - అమృత్‌పాల్ సింగ్‌ వీడియో వైరల్

ఖ‌లిస్థానీ నాయ‌కుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ పంజాబ్ పోలీసుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేశాడు. సిక్కు యువ‌త‌ను అరెస్టుల పేరుతో అణ‌చివేస్తున్నారంటూ ఆరోపించాడు.

Amritpal Singh Video: కొన్నిరోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఖ‌లిస్థానీ నాయ‌కుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ పంజాబ్ పోలీసుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేశాడు. త‌న‌ను అరెస్ట్ చేయాల‌న్న‌దే పంజాబ్ ప్ర‌భుత్వం ఉద్దేశ‌మైతే నేరుగా త‌న ఇంటికి వ‌స్తే లొంగిపోయేవాడిన‌ని స్ప‌ష్టంచేశాడు. న‌ల్ల‌టి త‌ల‌పాగా ధ‌రించి, శాలువాతో ఉన్న అమృత్‌పాల్ సింగ్ సోష‌ల్ మీడియాలో ఈ మేర‌కు ఓ వీడియో విడుద‌ల చేశాడు. "పంజాబ్ పోలీసులు త‌న‌ను అరెస్ట్ చేయాల‌ని భావిస్తే, నేరుగా నా ఇంటికి వ‌స్తే లొంగిపోయేవాడిని" అని చెప్పాడు. ల‌క్ష‌లాది మంది పోలీసులు త‌న‌ను అరెస్ట్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా స‌ర్వ శ‌క్తిమంతుడైన దేవుడు త‌మ‌ను కాపాడాడ‌ని తెలిపాడు.

హోషియార్‌పూర్ ప‌రిస‌రాల్లో భారీ సెర్చ్ ఆప‌రేష‌న్‌
మ‌రోవైపు, పంజాబ్ పోలీసులు హోషియార్‌పూర్ గ్రామం దాని ప‌రిస‌ర ప్రాంతాల్లో అమృత్‌పాల్ సింగ్ అత‌ని అనుచ‌రులు త‌ల‌దాచుకున్నార‌నే స‌మాచారంతో భారీ సెర్చ్ ఆప‌రేష‌న్ ప్రారంభించారు. పోలీసుల నుంచి త‌ప్పించుకుని గ‌త 11 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న‌అమృత్‌పాల్ సింగ్ సోష‌ల్ మీడియాలో వీడియో విడుద‌ల చేశాడు. అత‌ను పోలీసుల‌కు లొంగిపోవచ్చని వినిపిస్తున్న సంకేతాల నేప‌థ్యంలో ఈ వీడియో ప్ర‌త్య‌క్ష‌మైంది. అమృత్‌పాల్ సింగ్‌తో పాటు అతని సంస్థ 'వారిస్ పంజాబ్ దే' సభ్యులను పోలీసులు అరెస్ట్ చేయ‌డం ప్రారంభించారు. ఈ క్ర‌మంలో జలంధర్ జిల్లాలో పోలీసుల క‌ళ్లుగ‌ప్పి అత‌ను తప్పించుకున్నాడు. అమృత్ పాల్ స్వర్ణ దేవాలయం వైపు వెళుతున్నాడ‌ని వ‌దంతులు వ్యాపించ‌డంతో హోషియార్‌పూర్‌లో భారీ సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది.

'హ్యూ అండ్ క్రై' నోటీసు జారీ చేసిన పోలీసులు
వారిస్ పంజాబ్ దే చీఫ్‌పై అమృత్‌సర్ రూరల్ పోలీసులు బుధవారం 'హ్యూ అండ్ క్రై' (నిందితుడిని ప‌ట్టుకోవ‌డంలో ప్ర‌జ‌ల స‌హ‌కారం కోర‌డం) నోటీసు జారీ చేశారు. "అమృత్‌సర్‌లోని ఖిల్చియాన్ పోలీస్ స్టేషన్, జల్లుపూర్ ఖేరా నివాసి అమృతపాల్ సింగ్ సంధు కుమారుడు లేదా తార్సేమ్ సింగ్ ఆచూకీ కోసం అమృత్‌సర్ జిల్లా (రూరల్) పోలీసులు గాలిస్తున్నారు" అని ఆ నోటీసులో పేర్కొన్నారు. అమృత్‌పాల్ సింగ్‌ సుమారు 6 అడుగుల పొడవు, తెల్లటి గోధుమ రంగులో ఉంటాడ‌ని కూడా నోటీసులో తెలిపారు.

అమృత్‌పాల్ కోసం ముమ్మ‌రంగా వేట
అమృతపాల్ సింగ్ గత 11 రోజులుగా త‌ప్పించుకుని తిరుగుతూ అజ్ఞాతంలోనే ఉన్నాడు. అయితే హర్యానా, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో అత‌ని క‌ద‌లిక‌ల‌ను నిర్థారిస్తూ చాలా సీసీటీవీ ఫుటేజీలు విడుదలయ్యాయి. అమృతపాల్ పంజాబ్ తిరిగి వచ్చారని, పంజాబ్ పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశం ఉందని తాజా సమాచారం. శాంతిభద్రతలను ఉల్లంఘిస్తార‌నే అనుమానంతో ముంద‌స్తుగా అదుపులోకి తీసుకున్న‌మొత్తం 353 మందిలో 197 మందిని విడుదల చేసినట్టు పోలీసులు తెలిపారు. అంత‌కుముందు అమృత్‌పాల్ నేపాల్‌లో ఉన్నాడ‌నే స‌మాచారంతో అప్ర‌మ‌త్త‌మైన భార‌త ప్ర‌భుత్వం అత‌ని క‌ద‌లిక‌ల‌పై నిఘా ఉంచాల‌ని ఆ దేశాన్ని కోరింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
T20 World Cup 2026: కాసేపట్లో టి20 ప్రపంచ కప్ 2026 భారత జట్టు ప్రకటన! ముంబై సమావేశంలో ముగ్గురు క్రికెటర్లపైనే చర్చ!
కాసేపట్లో టి20 ప్రపంచ కప్ 2026 భారత జట్టు ప్రకటన! ముంబై సమావేశంలో ముగ్గురు క్రికెటర్లపైనే చర్చ!
Sharif Usman Hadi: కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
Bigg Boss Telugu Grand Finale : బిగ్​బాస్​ గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజివీ.. నిధి అగర్వాల్ రాకతో కళ్యాణ్​కు గాయం!
బిగ్​బాస్​ గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజివీ.. నిధి అగర్వాల్ రాకతో కళ్యాణ్​కు గాయం!
Peddi Review : ఆ స్టోరీకి చికిిరీ గికిరీలు అవసరమా? - వారు తిన్న కంచంలో ఉమ్మేసినట్లే... రివ్యూయర్స్‌కు విశ్వక్ స్ట్రాంగ్ కౌంటర్
ఆ స్టోరీకి చికిిరీ గికిరీలు అవసరమా? - వారు తిన్న కంచంలో ఉమ్మేసినట్లే... రివ్యూయర్స్‌కు విశ్వక్ స్ట్రాంగ్ కౌంటర్
Embed widget