అన్వేషించండి

Air India: ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీస్‌ల్లో భారీగా కోతలు- జులై 15 వరకు నిలిపేస్తున్నట్టు ప్రకటన

Air India: ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీస్‌లను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. వివిధ మార్గాల్లో ఏర్పడుతున్న అంతరాయాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

Air India: అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదంతో జరిగి వారం రోజులు అవుతోంది. దాని ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలు,విమానాలు, విమాన సంస్థలపై పడుతోంది. చాలా సంస్థలు టెక్నికల్ సమస్యలతో విమానాలు అత్యవసర ల్యాండింగ్ అవుతున్నాయి. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో జరిగింది. మరికొన్ని విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఈ కారణంగా కూడా చాలా విమానాలు ఎమర్జెన్సీగా దింపాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. 

అహ్మదాబాద్ ప్రమాదం ప్రభావంతో ఎయిర్ ఇండియా చాలా అంతర్జతీయ విమానాలను క్యాన్సిల్ చేసింది. మరికొన్నింటిని కుదించింది. జులై 15 వరకు మార్పులు చేర్పులు చేసిన వివరాలను అధికారికంగా విడుదల చేసింది.  

బోయింగ్ 787, 777 విమానాల సేవలను తాత్కాలికంగా తగ్గిస్తున్నట్లు టాటా సంస్థ పేర్కొంది. ఆ వివరాలు అందిస్తు‌న్నట్టు తెలిపింది. వైడ్-బాడీ విమానాలతో నడిచే విమానాలను తాత్కాలికంగా 15 శాతం తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. 270 మంది మరణించిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం, బోయింగ్ 787, బోయింగ్ 777 విమానాల టర్న్అరౌండ్ సమయాలు ఎక్కువగా ఉండటం,   అనేక మార్గాల్లో అంతరాయాలు ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకుంది. 

"ఈ మార్పులు 21జూన్ 2025 నుంచి అమలులోకి వస్తాయి. కనీసం జులై 15, 2025 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది" అని ఎయిర్ ఇండియా గురువారం తన ప్రకటనలో తెలిపింది.

జూలై 15, 2025 వరకు ఎయిర్ ఇండియా సర్వీస్‌ నిలిపేసిన రూట్‌ల వివరాలు ఇవే:

  • ఢిల్లీ-నైరోబి1 (A1961/962)-4x వీక్లీ ఫ్లైట్స్‌  
  • అమృత్‌సర్-లండన్ (గాట్విక్) (Al169/170) -3x వీక్లీ ఫ్లైట్స్‌  
  • గోవా (మోపా)-లండన్ (గాట్విక్) (Al145/146) - 3x వీక్లీ ఫ్లైట్స్‌  

జూలై 15, 2025 వరకు సర్వీస్‌లు తగ్గిన మార్గాలు :
ఉత్తర అమెరికా

  • ఢిల్లీ-టొరంటో: వారానికి 13x నుంచి వారానికి 7xకి తగ్గించేశారు. 
  • ఢిల్లీ-వాంకోవర్: వారానికి 7x నుంచి వారానికి 5xకి తగ్గించేశారు. 
  • ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో: వారానికి 10x నుంచి వారానికి 7xకి తగ్గించేశారు
  • ఢిల్లీ-చికాగో: వారానికి 7x నుంచి వారానికి 3xకి తగ్గించేశారు
  • ఢిల్లీ-వాషింగ్టన్ (డల్లెస్): వారానికి 5x నుంచి వారానికి 3xకి తగ్గించేశారు. 

యూరప్

  • ఢిల్లీ-లండన్ (హీత్రో): వారానికి 24x నుంచి 22xకు తగ్గించారు
  • బెంగళూరు-లండన్ (హీత్రో): వారానికి 7x నుంచి 6xకు తగ్గించారు
  • అమృత్‌సర్-బర్మింగ్‌హామ్ అండ్‌ ఢిల్లీ బర్మింగ్‌హామ్: వారానికి 3x నుంచి 2x కు తగ్గించారు
  • ఢిల్లీ-పారిస్: వారానికి 14x నుంచి 12x కు తగ్గించారు
  • ఢిల్లీ-మిలన్: వారానికి 7x నుంచి 4x కు తగ్గించారు
  • ఢిల్లీ-కోపెన్‌హాగన్: వారానికి 5x నుంచి 3xకు తగ్గించారు
  • ఢిల్లీ-వియన్నా: వారానికి 4x నుంచి 3xకు తగ్గించారు
  • ఢిల్లీ-ఆమస్టర్‌డామ్‌: వారానికి 7x నుంచి 5xకుతగ్గించారు

ఆస్ట్రేలియా

  • ఢిల్లీ-మెల్బోర్న్ అండ్‌ ఢిల్లీ-సిడ్నీ: వారానికి 7x నుంచి 5xకు తగ్గించారు

తూర్పు ఆసియా 

  • ఢిల్లీ-టోక్యో (హనేడా): వారానికి 7x నుంచి 6xకి తగ్గించారు. 
  • ఢిల్లీ-సియోల్ (ఇంచియాన్): వారానికి 5x నుంచి 4xకి తగ్గించారు. 

ఈ చర్యల వల్ల ప్రభావితమైన ప్రయాణీకులకు ఎయిర్ ఇండియా క్షమాపణలు చెప్పింది. ప్రత్యామ్నాయ విమానాల్లో అవకాశాలు కల్పించడం, ఉచిత రీషెడ్యూలింగ్ లేదా వారి ప్రాధాన్యత ప్రకారం అందించబోతున్నట్టు వెల్లడించింది. సవరించిన షెడ్యూల్‌ను వెబ్‌సైట్ http://airindia.com మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంచుతారు. అంతే కాకుండా ఫోన్ ద్వారా కూడా సంప్రదించి తెలుసుకోవచ్చని తెలిపింది. ప్రయాణీకులు, సిబ్బంది, విమానాల భద్రతకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తామని వీలైనంత త్వరగా పూర్తి షెడ్యూల్‌ను పునరుద్ధరిస్తామని ప్రకటించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Trimukha Movie Release Date: సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Tata Sierra Dealership: టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
Embed widget