Air India Plane Crash: విమానం టేకాఫ్ సమయంలో ఎక్కువ ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి, 5 ప్రధాన కారణాలు ఇవే
Plane Crash During Take Off | అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే ప్రమాదానికి గురైంది. టేకాఫ్ సమయంలో ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతాయో కొన్ని కారణాలు ఇలా ఉన్నాయి.

Air india plane crash ahmedabad: గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 737 గురువారం మధ్యాహ్నం కూలిపోవడం తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో 242 మంది ఉండగా ఒక్క ప్రయాణికులు రమేశ్ విశ్వాస్ కుమార్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. 12 మంది సిబ్బంది, 229 మంది ప్రయాణికులు చనిపోయారు. వీరితో పాటు విమానం కూలిన మెడికల్ కాలేజీ హాస్టల్లోని మెడికోలు 24 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య పెరిగింది. ఈ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ప్రమాదానికి గురైంది. బ్లాక్ బాక్స్ కోసం ఇంకా సెర్చ్ చేస్తున్నారు. ఇంజన్లకు ఫ్యూయల్ అందకపోవడంతో ప్రమాదం జరిగిందని సైతం వినిపిస్తోంది. అయితే టేకాఫ్ సమయంలో ఇలాంటి ప్రమాదాలు ఎందుకు ఎక్కువగా జరుగుతాయో తెలుసుకుందాం.
విమానం ఎగరడానికి సమయం చాలా కీలకం
విమానం టేకాఫ్ సమయం చాలా క్లిష్టమైన సమయంగా భావిస్తారు. లెక్కలు గమనిస్తే.. ప్రపంచంలో జరిగే విమాన ప్రమాదాలలో దాదాపు 35 శాతం టేకాఫ్ సమయంలో లేదా టేకాఫ్ అయిన వెంటనే జరుగుతాయి. విమానం ప్రాపర్‌గా టేకాఫ్ అయిన తర్వాత ప్రమాదాల రేటు తగ్గుతుంది. టేకాఫ్ సమయంలో విమానం గ్రౌండ్ నుండి అధిక వేగాన్ని అందుకుంటుంది. ఈ సమయంలో పైలట్ రన్ వే, ఇంజిన్, వాతావరణం, విమానం కంట్రోల్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఆ విషయాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ఇంజిన్ ఫెయిల్ అవ్వడం
టేకాఫ్ సమయంలో ఇంజిన్ దాని గరిష్ట సామర్థ్యం వద్ద ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, పక్షులు తగలడం, ఇంధనం అందకపోవడం, ఇంధనం ఒత్తిడి సమస్య లేదా తయారీ లోపం వంటి ఇంజిన్ లో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే వెంటనే ప్రమాదానికి కారణం అవుతుంది.
పైలట్ తప్పిదాలు
పైలట్ తప్పిదాలు సైతం విమానం కూలిపోవడానికి ఒక ప్రధాన కారణం కావచ్చు. ముఖ్యంగా టేకాఫ్ సమయంలో పైలట్ పిచ్ యాంగిల్, వేగం, రన్ వే లిఫ్ట్ ఆఫ్ పాయింట్ ను సరిగ్గా అంచనా వేయలేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో మానవ తప్పిదం కారణంగానే ఎక్కువ విమాన ప్రమాదాలు జరుగుతుంటాయి.
ప్రతికూల వాతావరణం
విమానం కూలిపోవడానికి టేకాఫ్ సమయంలో ఉరుములు, బలమైన గాలులు, తక్కువ విజిబిలిటీ లేదా మైక్రోబర్డ్ వంటివి కూడా కొన్నిసార్లు ప్రమాదానికి కారణం అవుతాయి. ఇటీవల ఢిల్లీలో ప్రతికూల వాతావరణం కారణంగా తుఫాను వచ్చినప్పుడు, ఒక విమానం టర్బ్యులెన్స్ లో బర్డ్ చిక్కుకున్న వీడియో వైరల్ అయింది.
సాంకేతిక లోపం
టేకాఫ్ సమయంలో విమానం కూలిపోవడానికి సాంకేతిక లోపం ఓ కారణం. చాలాసార్లు విమానం ల్యాండింగ్ గేర్, ఆటోథ్రోటిల్ సిస్టమ్, హైడ్రాలిక్స్ లేదా ఎయిర్ స్పీడ్ ఇండికేటర్ లో అనుకోకుండా తలెత్తే సాంకేతిక లోపం కారణంగా విమానం ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. టేకాఫ్, ల్యాండింగ్ సమయం తక్కువగా ఉన్నందున, సాంకేతిక లోపం తలెత్తే అవకాశాలు తక్కువ. ఆ సందర్భాలలో ఏ ఇబ్బంది లేకపోతే ఈజీగా టేకాఫ్, ల్యాండింగ్ చేయడానికి వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు.






















