అన్వేషించండి

PM Modi Meets Survivor: ప్రమాద స్థలాన్ని పరిశీలించి, అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ కు వెళ్లిన ప్రధాని మోదీ.. మృత్యుంజయుడికి పరామర్శ

అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం AI171 కూలిపోయిన ప్రాంతాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. అనంతరం సివిల్ హాస్పిటల్‌కు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు.

అహ్మదాబాద్: గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మొత్తం 265 మంది మరణించారు. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం అహ్మదాబాద్‌లో పర్యటిస్తున్నారు. మొదట అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా AI171 విమానం కూలిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆయన వెంటన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ప్రమాదానికి కారణాలపై అధికారులను, రామ్మోహన్ నాయుడును ఆయన ఆరా తీశారు.

అనంతరం అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్‌కు వెళ్లారు ప్రధాని మోదీ. ఘోర విమాన ప్రమాదంలో చనిపోయన వారి కుటుంబసభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు. వారి కుటుంబాలకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గాయపడి చికిత్స పొందుతున్న వారిని ప్రధాని పరామర్శించారు. విమాన ప్రమాదంలో బతికి బయటపడ్డ ఏకైక ప్రయాణికుడు మహేష్ విశ్వాస్ కుమార్ ను ప్రధాని మోదీ పరామర్శించి, అతడి అరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడైన అతను 11A సీటులో ప్రయాణిస్తున్నాడు. విమానం కూలిన తరువాత అతను నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఎయిర్ ఇండియా ప్రకారం, బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానంలో 12 మంది సిబ్బంది, మొత్తం 230 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు కాగా, 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు ఫ్రాన్స్ వాసులు, ఒక కెనడా వాసి ఉన్నారు. చనిపోయిన వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉండటంతో బీజేపీ శ్రేణుల్లో విషాదం అలుముకుంది.

అహ్మదాబాద్ విమాన ప్రమాదం: ముఖ్యమైన అంశాలు 

  • పోలీస్ డిప్యూటీ కమీషనర్ కానన్ దేశాయ్ మీడియాతో మాట్లాడుతూ 265 మృతదేహాలు అహ్మదాబాద్‌లోని సివిల్ హాస్పిటల్‌కు చేరాయని తెలిపారు. 
  • విమానంలో ఉన్న 241 మందితో పాటు, ఐదుగురు MBBS విద్యార్థులు, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెంట్ డాక్టర్ మరియు ఒక డాక్టర్ భార్య కూడా మరణించారు. విమానాశ్రయ పరిధికి వెలుపల ఉన్న BJ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో విమానం కూలిపోవడంతో మరో 60 మంది విద్యార్థులు గాయపడ్డారు. 
  • ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాడు విమాన ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారిని పరామర్శించేందుకు అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్‌ను కూడా సందర్శించారు. 
  • ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతిచెందారు.
  • విమానంలో ఉన్న బాధితుల కుటుంబాలకు సహాయం చేయడానికి, ఎయిర్ ఇండియా అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ మరియు గాట్‌విక్ విమానాశ్రయాలలో ఫ్రెండ్స్ & రిలేటివ్స్ అసిస్టెన్స్ సెంటర్లను ఏర్పాటు చేసిందని ఎయిర్ క్యారియర్ తెలిపింది. 
  • నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సునీల్ తత్కారే బంధువు కూడా ఈ ప్రమాదంలో మరణించారు. అపర్ణ మహడిక్ తత్కారే బంధువు భార్య, ఆమె ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తుండగా, ఆమె భర్త ఎయిర్ ఇండియాలో పైలట్‌గా పనిచేశారు. 
  • ప్రమాద స్థలంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) ఆరు బృందాలు రాష్ట్ర, కేంద్ర ఏజెన్సీలతో కలిసి శిథిలాలను తొలగించే పనిలో నిమగ్నమై ఉన్నాయి, అని ఒక NDRF సిబ్బంది తెలిపారు. 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

International Space Station : 2031లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూల్చివేత - నాసా సంచలన నిర్ణయం
2031లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూల్చివేత - నాసా సంచలన నిర్ణయం
Konaseema Blowout: ఇరుసుమండ బ్లో అవుట్ బాధితులకు ONGC పరిహారం.. ఒక్కో కుటుంబానికి ఎంతంటే ?
ఇరుసుమండ బ్లో అవుట్ బాధితులకు ONGC పరిహారం.. ఒక్కో కుటుంబానికి ఎంతంటే ?
Palash Muchhal: పెళ్లి సమయంలో మరో మహిళతో దొరికిన పలాష్ - మహిళా క్రికెటర్లు చితక్కొట్టారు - వెలుగులోకి కొత్త విషయం
పెళ్లి సమయంలో మరో మహిళతో దొరికిన పలాష్ - మహిళా క్రికెటర్లు చితక్కొట్టారు - వెలుగులోకి కొత్త విషయం
Bangladesh Out From T20 World Cup: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. ఆ స్థానంలో ఛాన్స్ కొట్టేసిన జట్టేదో తెలుసా
టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. ఆ స్థానంలో ఛాన్స్ కొట్టేసిన జట్టేదో తెలుసా

వీడియోలు

Adivasi Kikri String Instrument | అరుదైన గిరిజన సంగీత వాయిద్య పరికరం కిక్రీ | ABP Desam
Sanju Samson Failures vs NZ | కివీస్ తో రెండో టీ20 లోనూ ఫెయిలైన సంజూ శాంసన్ | ABP Desam
Mitchell Santner Praises Team India | టీమిండియాపై న్యూజిలాండ్ కెప్టెన్ ప్రశంసల జల్లు | ABP Desam
Suryakumar Yadav 82 vs Nz Second T20 | టీ20 వరల్డ్ కప్ కి ముందు శుభవార్త | ABP Desam
Ishan Kishan 76 vs NZ Second T20 | మెరుపు ఇన్నింగ్స్ తో కమ్ బ్యాక్ ఘనంగా చాటుకున్న ఇషాన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
International Space Station : 2031లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూల్చివేత - నాసా సంచలన నిర్ణయం
2031లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూల్చివేత - నాసా సంచలన నిర్ణయం
Konaseema Blowout: ఇరుసుమండ బ్లో అవుట్ బాధితులకు ONGC పరిహారం.. ఒక్కో కుటుంబానికి ఎంతంటే ?
ఇరుసుమండ బ్లో అవుట్ బాధితులకు ONGC పరిహారం.. ఒక్కో కుటుంబానికి ఎంతంటే ?
Palash Muchhal: పెళ్లి సమయంలో మరో మహిళతో దొరికిన పలాష్ - మహిళా క్రికెటర్లు చితక్కొట్టారు - వెలుగులోకి కొత్త విషయం
పెళ్లి సమయంలో మరో మహిళతో దొరికిన పలాష్ - మహిళా క్రికెటర్లు చితక్కొట్టారు - వెలుగులోకి కొత్త విషయం
Bangladesh Out From T20 World Cup: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. ఆ స్థానంలో ఛాన్స్ కొట్టేసిన జట్టేదో తెలుసా
టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. ఆ స్థానంలో ఛాన్స్ కొట్టేసిన జట్టేదో తెలుసా
Eluru Politics: టీడీపీలో చింతమనేని వర్సెస్‌ మంత్రి పార్థసారథి- కోవర్టుల కామెంట్స్‌తో రాజకీయం రచ్చ రచ్చ 
టీడీపీలో చింతమనేని వర్సెస్‌ మంత్రి పార్థసారథి- కోవర్టుల కామెంట్స్‌తో రాజకీయం రచ్చ రచ్చ 
Spot registration: కొన్న వెంటనే షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ - తెలంగాణలో వాహన కొనుగోలుదారులకు రిలీఫ్ !
కొన్న వెంటనే షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ - తెలంగాణలో వాహన కొనుగోలుదారులకు రిలీఫ్ !
Nandus World: థియేటర్లలో చిరంజీవి సినిమా... ETV Win ఓటీటీలో ఆ సినిమా... ట్రెండింగ్‌లో నందూస్ వరల్డ్
థియేటర్లలో చిరంజీవి సినిమా... ETV Win ఓటీటీలో ఆ సినిమా... ట్రెండింగ్‌లో నందూస్ వరల్డ్
Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ మోసం- 14.84 కోట్లు ఇచ్చిన దంపతులు.. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్
డిజిటల్ అరెస్ట్ మోసం- 14.84 కోట్లు ఇచ్చిన దంపతులు.. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్
Embed widget