Ban On Social Media: దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై చర్యలు, సోషల్ ఖాతాలపై నిషేధం
Pahalgam Terror Attack : సోషల్ మీడియాలో దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పై, వారి ఛానెల్స్ నిషేధించాలని చట్టపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

Kashmir Terror Attack | న్యూఢిల్లీ: మన దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేశ సమగ్రతను దెబ్బతీసేలా, సార్వభౌమాధికారిన్ని ధిక్కరించేలా, దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ల పై చర్యలకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దేశానికి వ్యతిరేకంగా కంటెంట్ పోస్ట్ చేస్తున్న సోషల్ మీడియా ఛానెల్స్ నిషేధించడంతో పాటు ఆ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై చట్టపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.
సోషల్ మీడియాలో దుష్ప్రచారం..
2025 ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇదివరకే భారత్‌కు వ్యతిరేకంగా దేశ మీడియా డిబేట్స్ లో పాకిస్తాన్ వారు పాల్గొనకండా నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియా సంస్థ తమ స్వార్థం కోసం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని గుర్తించారు. ఆ కంటెంట్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల వ్యాఖ్యలు హింసను ప్రేరేపించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఆ సోషల్ ఖాతాలపై కేంద్రం నిషేధం
ఈ విషయంపై సంబంధిత మంత్రిత్వ శాఖలు.. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలు ఐటీ చట్టం 2000, 'ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నియమాలు, 2021' ప్రకారం దేశానికి వ్యతిరేకంగా కంటెంట్ పోస్టున్న ప్లాట్‌ఫారమ్‌లను నిషేధించాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం స్టాండింగ్ కమిటీకి కావలసిన సమాచారాన్ని మే 8, 2025 నాటికి ఎవరైనా అందించవచ్చు. దాని సాఫ్ట్ కాపీని comit@sansad.nic.in కు ఈమెయిల్ చేయవచ్చు. కేంద్ర మంత్రిత్వశాఖలు పక్కా సమాచారంతోనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై చర్యలతో పాటు సోషల్ మీడియా ఖాతాలు సైతం నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు.
మే 7న దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్
భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులతో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. హోం శాఖ ఆదేశాల ప్రకారం మే 7, 2025న ప్రజా రక్షణ కోసం దేశ వ్యాప్తంగా సమర్థవంతంగా మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని ఆదేశించింది. అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో మాక్ డ్రిల్ లో చూపిస్తారు. ఇందులో కేవలం అధికారులే కాదు ప్రజలు, వివిధ సంస్థలు, వ్యవస్థలు పాల్గొంటాయి.






















