అన్వేషించండి

Ambil Mahesh Poyyamozhi: ఏఐ, కోడింగ్‌ ద్వారా తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో పెను మార్పులు: అన్బిల్ మహేశ్ పొయ్యమొళి

ABP Southern Rising Summit | తమిళనాడు విద్యా మంత్రి అంబిల్ మహేష్ పొయ్యమొళి భాష, విద్య, సాంకేతికత గురించి మాట్లాడుతూ.. పాఠశాలల్లో AI, రోబోటిక్స్, డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

ABP Southern Rising Summit 2025 | తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విద్యా రంగం పట్ల చాలా సీరియస్‌గా ఉన్నారని, రాబోయే రోజుల్లో విద్యను పూర్తిగా మార్చే చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర పాఠశాల విద్యాశాక మంత్రి అన్బిల్ మహేశ్ పొయ్యమొళి  అన్నారు. రాష్ట్ర విద్యా విధానం, భాషా సమస్యలు,  కొత్త టెక్నాలజీ ఎడ్యుకేషన్‌పై ఆయన కీలక ప్రకటనలు చేశారు. 

చెన్నైలో వేదికగా మంగళవారం నాడు ఏబీపీ నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్ మూడో ఎడిషన్ నిర్వహిస్తోంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో రాజకీయ నాయకులు, విద్య, సినీ, సాంస్కృతిక రంగాలకు చెందిన  సంబంధించిన ప్రముఖలు ఒకే వేదికపై తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. దక్షిణ భారతదేశ అభివృద్ధి, కొత్త విధానాలు, సామాజిక సమస్యలు, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లపై బహిరంగంగా చర్చించడం సదరన్ రైజింగ్ సమ్మిట్ లక్ష్యం.

విద్యా శాఖ మంత్రి అంబిల్ మహేష్ పొయ్యమోళి 

సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొన్న తమిళనాడు మంత్రి అంబిల్ మహేష్ తన ప్రసంగంలో మాట్లాడుతూ.. తమిళనాడు ప్రభుత్వం ఆలోచన కేవలం ఆర్థికాభివృద్ధికి మాత్రమే పరిమితం కాలేదు. మెరుగైన సమాజాన్ని నిర్మించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. మన నైతికత కేవలం ఆర్థికపరమైనది కాదు. విద్య, అవగాహనతో పాటు కొత్త సవాళ్లను ఎదుర్కొనే సమాజాన్ని నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

భాష గురించి కీలక వ్యాఖ్యలు

తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఈ సమ్మిట్‌లో కేంద్రంపై విమర్శలు గుప్పించారు. హిందీనే కాదు ఏదైనా ఇతర భాషలను తమిళనాడు ప్రజలపై రుద్దాలని ప్రయత్నిస్తే తాము మరో భాషా ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని సంకేతాలిచ్చారు. ఇదే విషయంపై మంత్రి అన్బిల్ మహేశ్ పొయ్యమొళి  భాషపై తన స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాము అన్ని భాషలను స్వాగతిస్తున్నామని, అయితే  ప్రతి భాషకు దాని సొంత గుర్తింపు, ఆవశ్యకత ఉందన్నారు. కానీ ఏదైనా భాషను తమిళనాడు ప్రజలపై బలవంతంగా రుద్దితే, మేం దానిని కచ్చితంగా వ్యతిరేకిస్తాము అన్నారు.

TN SPARK గురించి ప్రస్తావించిన విద్యాశాఖ మంత్రి

‘తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతికతను భారీగా వినియోగిస్తుంది. పాఠశాల విద్యాశాఖను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి TN SPARK అనే పెద్ద కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ కార్యక్రమం కింద విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్, కోడింగ్, డిజిటల్ టూల్స్ నేర్పిస్తున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పిల్లలు కూడా మోడ్రన్ టెక్నాలజీని నేర్చుకుంటున్నారు. TN SPARK విద్యార్థులను తక్కువ వయసులోనే డిజిటల్ ప్రపంచంతో అనుసంధానిస్తోంది. దాంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విధానం సైతం మరింత వేగవంతం అవుతుందని’ అన్బిల్ మహేశ్ పొయ్యమొళి పేర్కొన్నారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Ravindra Jadeja: రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
Jana Nayakudu : విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
Advertisement

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Ravindra Jadeja: రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
Jana Nayakudu : విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
Hero Splendor లేదా TVS Star City Plus ఏ బైక్ కొనడం బెస్ట్ ? ధర, మైలేజీ తెలుసుకోండి
Hero Splendor లేదా TVS Star City Plus ఏ బైక్ కొనడం బెస్ట్ ? ధర, మైలేజీ తెలుసుకోండి
Beyond Fixed Deposits : ఈ 5 పథకాల్లో పెట్టుబడి పెడితే ఎప్పటికీ డబ్బుల కొరత ఉండదు.. FDల కంటే బెస్ట్
ఈ 5 పథకాల్లో పెట్టుబడి పెడితే డబ్బుల వర్షం కురుస్తుంది ఎప్పటికీ డబ్బుల కొరత ఉండదు
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Embed widget