Viral Video:చాక్లెట్ టీ ఐస్‌క్రీమ్- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వెరైటీ ఫ్లేవర్
Viral Video:ఈ వీడియో ఫేస్‌బుక్‌లో ఫుడ్ బ్లాగర్ పేజీలో వైరల్‌గా మారింది. చాక్లెట్లను పాలు, టీతో కలిపి ఈ ఐస్ క్రీమ్ తయారు చేసినట్లు ఈ వీడియోలో ఉంది.

Viral Video: కొన్నిసార్లు సోషల్ మీడియాలో వింత ఆహారాలు తయారు చేసే వీడియోలు వైరల్ అవుతుంటాయి, ఇది ఆహార ప్రియులను ఆశ్చర్యపరుస్తుంది. నెటిజన్ల వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తుంటాయి. కొన్ని నెలల క్రితం, వివిధ రకాల మ్యాగీలను తయారు చేస్తున్న వీడియో బాగా వైరల్ అయింది. ఎక్కడో చాక్లెట్ మిక్స్ చేసి మ్యాగీ తయారు చేశారు. మ్యాగీని మిఠాయి ఫ్లోస్ నుంచి కూడా తయారు చేశారు. ఇలా వింతైన వంటకాలు చేస్తూ చాలా మంది నెట్టింట వైరల్‌గా మారారు. ఎప్పటికప్పుడు ఇలాంటి వైవిధ్యమైన రెసిపీలతో జనాలు నెట్టింటకు వస్తుంటారు. ఇప్పుడు అలాంటి వీడియో గురించే మనం చెప్పుకోబోతున్నాం.
ఇలాంటి వింతైనా వంటకంబులో మరో కొత్త రెసిపీ యాడ్ అయిపోయింది. ఐస్‌క్రీమ్‌తో కలిపిన టీ ఐస్ క్రీమ్ ఒక వింత పదం. భారతీయుల్లో చాలా మందికి టీ అంటే మహా ఇష్టం. అదే టైంలో ఐస్ క్రీమ్ అన్నా కూడా నాలుక లపలపలాడిస్తారు. ఈ రెండు ఒకేసారి తినాలంటే మాత్రం వీలుపడదు. అందుకే అలాంటి వాళ్ల కోసం ఓ కుర్రాడి తయారు చేసిన సరికొత్త ఐస్‌క్రమ్ పేరే టీ ఐస్‌క్రీమ్.
ఈ వీడియో ఫేస్‌బుక్‌లో ఫుడ్ బ్లాగర్ పేజీలో వైరల్‌గా మారింది. చాక్లెట్లను పాలు, టీతో కలిపి ఈ ఐస్ క్రీమ్ తయారు చేసినట్లు ఈ వీడియోలో ఉంది. ఈ రోజుల్లో రోల్ ఐస్ క్రీం తినడం ఒక ట్రెండ్ గా మారింది. ఆ రకమైన ఐస్ క్రీమ్ ను ఆ కుర్రాడు తయారు చేశాడు. టీ మిక్స్ చేసి ఐస్ క్రీమ్ రోల్స్ తయారు చేయడం ద్వారా ఈ కుర్రాడు చాలా ఫేమస్ అయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. అయితే చాలా మంది నెటిజన్లకు ఈ వీడియో అస్సలు నచ్చలేదు. ఈ వీడియోకు వ్యూస్, కామెంట్లు, లైక్ ల సంఖ్య పెరుగుతోంది.
ప్రతి ఒక్కరూ ఇప్పటి వరకు అనేక ఫ్లేవర్స్‌లో ఉన్న ఐస్ క్రీం తిన్నారు. కానీ ఐస్ క్రీమ్‌ను టీ మిక్స్ చేసి తయారు చేసే ఈ ఫ్లేవర్‌ను మాత్రం ఇంత వరకు చాలా మందికి తెలియకపోవచ్చు. అందుకే ఈ వింతైన వంటకం తయారు చేసిన వ్యక్తి చాలా ఫేమస్ అయ్యాడు. వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన చాలా మంది ఒక్కసారైనా టేస్ట్ చేస్తే బాగుంటుందని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఐస్ క్రీమ్ వంటి వాటితో ప్రయోగాలు చేయకపోవడమే మంచిదని అంటున్నారు.
టీ, ఐస్ క్రీమ్ రెండూ వేర్వేరు రుచులను కలిగి ఉంటాయి. చాలా మంది ఇండియన్స్‌కు ఈ రెండింటిపై మక్కువ ఉంటుంది. కాబట్టి టీని ఐస్‌క్రీమ్‌ను కలపితే అధ్వాన్నంగా ఉంటుందని మరికొందరు వాదిస్తున్నారు. ఈ వీడియో వివిధ వ్యక్తుల విభిన్న అభిప్రాయాల మధ్య పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.





















