News
News
X

Job Openings: గతేడాదితో పోలిస్తే మహిళలకు పెరిగిన ఉద్యోగ అవకాశాలు

Job Openings: కార్యాలయాల్లో పని చేసే మహిళల సంఖ్య పెరుగుతున్నట్లు ఫౌండిట్ అనే సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాదితో పోలిస్తే నియామకాలు పెరిగినట్లు చూపిస్తున్నాయి.

FOLLOW US: 
Share:

Job Openings: ఉద్యోగాల్లో మహిళల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత సంవత్సరం ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు 35 శాతం పెరిగాయని ఫౌండిట్ అనే హైరింగ్ వెబ్ సైట్ పేర్కొంది. దేశంలోని వైట్ కాలర్ ఆర్థిక వ్యవస్థలో మహిళా సిబ్బందికి గిరాకీ పెరుగుతోందని ఫౌండిట్ సంస్థ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. 

బాగా పెరగిన మహిళల నియామకాలు

ఫౌండిట్ గణాంకాల ప్రకారం ఐటీ ఆధారిత సేవలు(ఐటీఈఎస్), బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్(బీపీఎం) రంగం అత్యధికంగా 36 శాతం అవకాశాలను మహిళలకు ఇచ్చింది. ఐటీ కంప్యూటర్స్, ఆతిథ్యం, స్టాఫింగ్,  అకౌంటింగ్, ఆర్థిక సేవలు, నియామకాలు, బ్యాంకింగ్, డయాగ్నొస్టిక్స్, ఆరోగ్య సంరక్షణ, రంగాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నట్లు ఫౌండిట్ సంస్థ పేర్కొంది. మహిళలకు అధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే నగరాల్లో దిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్-NCR(21 శాతం), ముంబయి (15 శాతం), బెంగళూరు (10 శాతం), చెన్నై (9 శాతం), పుణె (7 శాతం) ముందు ఉన్నాయి.

నాయకులుగా మారుతున్న వనితలు

ఏదో ఒక కారణంతో వృత్తికి విరామం ఇచ్చి, తిరిగి పనిలో చేరిన వారి సంఖ్య మొత్తం మహిళా ఉద్యోగుల్లో 6 శాతంగా ఉంది. ఫ్రీలాన్స్ చేసే వారి సంఖ్య 4 శాతంగా ఉంటోంది. అంటే వైట్ కాలర్ ఆర్థిక వ్యవస్థలో తాత్కాలిక అవకాశాలు(గిగ్ వర్క్) పెరుగుతున్నట్లు ఫౌండిట్ సంస్థ గణాంకాలు పేర్కొంటున్నాయి. ఎక్స్పీరియన్స్ పరంగా చూస్తే నాయకత్వ స్థాయిలో 8 శాతం మంది మహిళలు ఉన్నారు. ఇది గత సంవత్సరం 6 శాతమే. మధ్య స్థాయి హోదాల్లో 24 శాతం మంది ఉండగా.. తక్కువ స్థాయి (1-3 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్) హోదాల్లో 18 శాతం మంది కనిపించినట్లు ఫౌండిట్ నియామక సంస్థ గణాంకాలు చూపిస్తున్నాయి. 8 నుండి 15 ఏళ్ల అనుభవం కలిగిన మహిళలు.. లీడర్ షిప్ అవకాశాలను కోల్పోతున్నట్లు 50 మంది మంది చెబుతున్నారు. అయితే సొంతంగా పరిమితులు విధించుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కార్యాలయాల్లో, బయటా పలు సవాళ్లు ఎదురవ్వడమే ఇందుకు కారణమని ఓ సర్వే పేర్కొంటుంది. దీని వల్ల తొలి స్థాయి, మధ్య స్థాయి హోదాలతో పోలిస్తే పూర్తి స్థాయిలో అనుభవం ఉన్న మహిళల సంఖ్య అతి తక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

గతేడాది 30 ఉద్యోగాల్లో నియామకమైతే.. ఈ ఏడాది 36

ఐటీఈఎస్, బీపీవో రంగాల్లో గతేడాది ఫిబ్రవరిలో 30 ఉద్యోగాల్లో మహిళలు నియామకమైతే, ఈ ఏడాది ఆ సంఖ్య 36కు పెరిగినట్లు ఫౌండిట్ సంస్థ పేర్కొంది. ఐటీ, కంప్యూటర్స్ రంగంలో గతేడాది ఫిబ్రవరిలో మహిళలు 24 ఉద్యోగాల్లో నియామకం అయితే, ఈ ఏడాది ఆ సంఖ్య 35కు పెరిగింది. బ్యాంకింగ్, అకౌంటింగ్, ఆర్థిక సేవ రంగాల్లో గతేడాది ఫిబ్రవరిలో మహిళలు 13 ఉద్యోగాల్లో నియామకమైతే, ఈ ఏడాది ఆ సంఖ్య 22కు పెరిగింది. నియామకాలు, స్టాఫింగ్, ఆర్పీవో రంగాల్లో గత ఏడాది ఫిబ్రవరిలో మహిళలు 5 ఉద్యోగాల్లో నియామకం అయితే, ఈ ఏడాది ఆ సంఖ్య 20కు పెరిగింది. ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ, డయాగ్నొస్టిక్స్ రంగాల్లో గతేడాది ఫిబ్రవరిలో మహిళలు 3 ఉద్యోగాల్లో నియామకం అయితే, ఈ ఏడాది ఆ సంఖ్య 8కు పెరిగింది.

Published at : 07 Mar 2023 07:10 PM (IST) Tags: Job Openings Woman Jobs Increased Bussiness News Jobs Hire Woman 35 percent Woman Jobs Increase

సంబంధిత కథనాలు

చికెన్ మంచూరియాపై న్యూయార్క్ టైమ్స్‌ హాట్‌ ట్వీట్- మండిపడుతున్న ఇండియన్‌ నెటిజన్స్ ?

చికెన్ మంచూరియాపై న్యూయార్క్ టైమ్స్‌ హాట్‌ ట్వీట్- మండిపడుతున్న ఇండియన్‌ నెటిజన్స్ ?

Indian Railways: రైళ్లపై రాళ్లు రువ్వితే కేసులు మామూలుగా ఉండవు - రైల్వేశాఖ వార్నింగ్

Indian Railways: రైళ్లపై రాళ్లు రువ్వితే కేసులు మామూలుగా ఉండవు - రైల్వేశాఖ వార్నింగ్

No-confidence Motion : లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం, ప్రతిపక్షాలు సమాలోచనలు!

No-confidence Motion : లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం, ప్రతిపక్షాలు సమాలోచనలు!

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

Umesh Pal Case Verdict : యూపీ మాఫియా డాన్ అతీక్ అహ్మద్‌కు జీవిత ఖైదు - ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో యూపీ కోర్టు తీర్పు

Umesh Pal Case Verdict :  యూపీ మాఫియా డాన్ అతీక్ అహ్మద్‌కు జీవిత ఖైదు - ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో యూపీ కోర్టు తీర్పు

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!