India Vs Pakistan: భారత్- పాక్ మ్యాచ్ చూస్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి!
India Vs Pakistan: భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్ చూసి అసోంలో ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు.
India Vs Pakistan: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగిన భారత్- పాకిస్థాన్ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠకు గురి చేసింది. చివరి బంతి వరకు టెన్షన్ టెన్షన్‌గా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ చూస్తూ అసోంలో ఓ వ్యక్తి హార్ట్ ఎటాక్‌తో మృతి చెందాడు.
ఇదీ జరిగింది
అసోం శివసాగర్ జిల్లాలో బితు గొగోయి (34).. ఆదివారం భారత్, పాక్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు గుండెపోటుతో మరణించాడు. ఆదివారం సాయంత్రం గొగోయి, అతని స్నేహితులు ఇండియా Vs పాకిస్థాన్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్న స్థానిక సినిమా హాల్‌కు వెళ్లారు.
అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో గొగోయి ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయాడు. వెంటనే అతడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
మరపురాని గెలుపు
నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిని ఈ పోరులో పాకిస్థాన్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. దాయాది జట్టుపై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 160 పరుగుల ఛేదనలో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన జట్టును విరాట్ కోహ్లీ (82*) అద్భుత ఇన్నింగ్స్‌తో ఒంటిచేత్తో విజయ తీరాలకు చేర్చాడు.
చివరి బంతి వరకు విజయం దోబూచులాడిన ఈ మ్యాచ్‌లో.. కోహ్లీ తుది వరకు క్రీజులో నిలిచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. విరాట్‌కు హార్దిక్ పాండ్య (40) అండగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ తన కెరీర్‌లోనే బెస్ట్ అని విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం తెలిపాడు.
Also Read: PM Modi in Kargil: దీపావళి వేళ మోదీకి సర్‌ప్రైజ్- 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా!