News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Goalie Amrinder Singh: 'దయచేసి నన్ను వదిలేయండ్రా బాబూ'.. మీడియాకు అమరీందర్ సింగ్ విజ్ఞప్తి!

పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పేరు ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఆయనకు బదులు వేరే అమరీందర్ సింగ్‌ను నెటిజన్లు ట్యాగ్ చేయడం ఆసక్తికరంగా మారింది.

FOLLOW US: 
Share:

పంజాబ్‌లో ఓవైపు గంట గంటకు రాజకీయ ఉత్కంఠ పెరిగిపోతుంటే మరోవైపు ట్విట్టర్‌లో ఓ ఆసక్తికర ఘటన వైరల్ అవుతోంది. భారత ఫుట్‌బాల్ గోల్-కీపర్ అమరీందర్ సింగ్.. మీడియాకు ఓ విజ్ఞప్తి చేశారు. ఆయన చేసిన ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ ట్వీట్‌కు పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ రిప్లై ఇవ్వడమే అసలైన ట్విస్ట్.

అసలేమైంది?

అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో ట్విట్టర్‌లో చాలా మంది పంజాబ్ మాజీ సీఎంను ట్యాగ్ చేయబోయి ఫుట్‌బాలర్ అమరీందర్ సింగ్‌ను ట్యాగ్ చేశారు. ఫుట్‌బాలర్ అమరీందర్ సింగ్ ప్రస్తుతం మోహున్ బాగన్ జట్టుకు ఆడుతున్నాడు. ఇండియా అండర్-23 జట్టుకు కెప్టెన్‌గా కుడా చేశాడు. ఇండియన్ సీనియర్ టీమ్‌ తరఫున 7 మ్యాచ్‌లు ఆడాడు. ఇండియన్ సూపర్ లీగ్‌లో ముంబయి సిటీ, ఏటీకే మోహున్ బాగన్ తరఫున ఆడుతున్నాడు.   

" న్యూస్ మీడియా, జర్నలిస్టులకు నా విజ్ఞప్తి. నేను అమరీందర్ సింగ్.. ఇండియన్ ఫుట్‌బాల్ జట్టుకు గోల్‌కీపర్‌ను.. నేను పంజాబ్ మాజీ సీఎం కాదు. దయచేసి నన్ను ట్యాగ్ చేయకండి.                           "
- అమరీందర్ సింగ్, ఫుట్‌బాల్ ఆటగాడు 

మాజీ సీఎం రిప్లై..

ఫుట్‌బాలర్ చేసిన ట్వీట్‌కు మాజీ సీఎం అమరీందర్ సింగ్ రిప్లై ఇచ్చారు. 

" నీ మాటలతో నేను ఏకీభవిస్తున్నాను.. నా ఫ్రెండ్. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను.                         "
-    కెప్టెన్ అమరీందర్ సింగ్, పంజాబ్ మాజీ సీఎం 

Also Read: ISIS Terrorist: కబాబ్ మార్చిన కథ.. ఏకంగా ఐసిస్ ఉగ్రవాదినే పట్టించేసింది!

Also Read: Punjab Congress crisis: రసవత్తరంగా పంజాబ్ రాజకీయం.. కాంగ్రెస్‌కు అమరీందర్ సింగ్ బైబై!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 30 Sep 2021 05:37 PM (IST) Tags: CONGRESS amarinder singh punjab congress Punjab Political Crisis punjab crisis footbaler amrinder singh amrinder singh goal keeper captain amarinder snigh

ఇవి కూడా చూడండి

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

Revanth Reddy Cabinet Meeting: రేవంత్ అధ్యక్షతన ముగిసిన తొలి కేబినెట్ భేటీ, ఈ అంశాలపైనే చర్చలు

Revanth Reddy Cabinet Meeting: రేవంత్ అధ్యక్షతన ముగిసిన తొలి కేబినెట్ భేటీ, ఈ అంశాలపైనే చర్చలు

Telangana New Ministers: తెలంగాణ మంత్రుల్లో అత్యంత ధనవంతుడు ఈయనే, రెండో స్థానంలో కోమటిరెడ్డి

Telangana New Ministers: తెలంగాణ మంత్రుల్లో అత్యంత ధనవంతుడు ఈయనే, రెండో స్థానంలో కోమటిరెడ్డి

తెలంగాణ కేబినెట్ లో ఏ కులానికి ఎన్ని మంత్రి పదవులు దక్కాయంటే ?

తెలంగాణ కేబినెట్ లో ఏ కులానికి ఎన్ని మంత్రి పదవులు దక్కాయంటే ?

AIIMS Bibinagar: బీబీనగర్‌ ఎయిమ్స్‌‌లో 151 సీనియర్‌ రెసిడెంట్‌ ఉద్యోగాలు, వివరాలు ఇలా

AIIMS Bibinagar: బీబీనగర్‌ ఎయిమ్స్‌‌లో 151 సీనియర్‌ రెసిడెంట్‌ ఉద్యోగాలు, వివరాలు ఇలా

టాప్ స్టోరీస్

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Telangana Cabinet :  హోంమంత్రిగా ఉత్తమ్  - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి

New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి