Navy Chopper Accident: ఇండియన్ నేవీ చాపర్‌కు ప్రమాదం, ముగ్గురు సిబ్బంది సేఫ్
Navy Chopper Accident: ముంబయి కోస్ట్‌లో ఇండియన్ నేవీ చాపర్ ప్రమాదానికి గురైంది.
Navy Chopper Accident:
ముంబయి కోస్ట్‌లో ప్రమాదం..
ఇండియన్ నేవీ చాపర్ ప్రమాదానికి గురైంది. ముంబయి కోస్ట్‌లో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో Advanced Light Helicopter (ALH) లో ముగ్గురు ఉన్నారు. నేవల్ పాట్రోల్ క్రాఫ్ట్ అప్రమత్తమై సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ముగ్గురు బాధితులనూ సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో విచారించాలని భారత నేవీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఉన్నట్టుండి పవర్ ఆఫ్ అవడంతో పాటు కిందకు జారిపోయిందని, ఫలితంగా పైలట్ కంట్రోల్ కోల్పోయాడని ఇండియన్ నేవీ ప్రాథమికంగా తెలిపింది. ప్రమాదానికి గురైన ALH-DHRUV ను దేశీయంగా తయారు చేశారు. ఇందులో రెండు ఇంజిన్‌లుంటాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) దీన్ని రూపొందించింది. 1984లో వీటి తయారీ మొదలు పెట్టింది. జర్మనీ సహకారంతో డిజైన్ చేసింది. 1992లో తొలిసారి గాల్లోకి ఎగిరిన ఈ హెలికాప్టర్...2002లో అధికారికంగా నేవీలో చేరింది.
Indian Navy ALH, on a routine sortie off Mumbai, met with an accident close to the coast. Immediate search and rescue ensured the safe recovery of a crew of three by Naval patrol craft. An inquiry to investigate the incident has been ordered: Indian Navy pic.twitter.com/MhgFgDka14
— ANI (@ANI) March 8, 2023
An Indian Navy ALH on a routine flying mission off Mumbai experienced a sudden loss of power & rapid loss of height. Pilot carried out controlled ditching over water. All three aircrew exited the helicopter safely & were recovered as part of a swift Rescue Operation: Indian Navy
— ANI (@ANI) March 8, 2023
Also Read: Tripura CM Manik Saha: త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం , ప్రధాని మోదీకి కృతజ్ఞతలు