IGCAR: కల్పక్కం ఐజీసీఏఆర్‌లో 100 జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ పోస్టులు
ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రిసెర్చ్(ఐజీసీఏఆర్) జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
కల్పక్కంలోని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రిసెర్చ్(ఐజీసీఏఆర్) జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్/ జెస్ట్ అర్హత సాధించిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి నేరుగా ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 100
* జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌లు.
విభాగాలు: జనరల్ ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, కండెన్స్‌డ్ మాటర్, థియరిటికల్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, మెటిరియల్ సైన్స్/మెటిరియల్ సైన్స్& ఇంజినీరింగ్, కెమిస్ట్రీ(జనరల్, అప్లైడ్,ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్, అనాలాటికల్), రేడియేషన్ ఫిజిక్స్, అట్మోస్పెరిక్ సైన్స్/మెటియోరాలజీ, లైఫ్‌సైన్స్(మైక్రోబయాలజీ, మరైన్ బయాలజీ, లైఫ్‌సైన్స్‌స్, బయో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ), నానో ఫ్లుయిడ్స్, కెమికల్ సెన్సార్స్, సూపర్ హైడ్రోఫోబిక్ కోటింగ్, కంప్యూటేషనల్ కెమిస్ట్రీ.
అర్హత: బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. గేట్/ జెస్ట్ అర్హత సాధించిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి నేరుగా ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
ఫెలోషిప్:
➥ డైరెక్ట్ పీహెచ్‌డీ: నెలకు రూ.31000 చెల్లిస్తారు.
➥ ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ: నెలకు రూ.21000 చెల్లిస్తారు.
➥ డబుల్ పీహెచ్‌డీ: నెలకు రూ.21000 చెల్లిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: 16.06.2023.
Also Read:
నాగ్‌పుర్ ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు, వివరాలు ఇలా!
నాగ్‌పుర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) రెగ్యులర్, డిప్యూటేషన్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ(గ్రూప్-ఎ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఎంఎస్, ఎండీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు దరఖాస్తులను గూగుల్ ఫాం ద్వారా సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 05 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఖాళీలను భర్తీచేస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌లో 608 ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టులు- అర్హతలివే!
ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, సీఈఈఆర్ఐ నోటిఫికేషన్, సీఎస్‌ఐఆర్-సీఈఈఆర్‌ఐలో సైంటిస్ట్ పోస్టులు, సైంటిస్ట్ పోస్టులు
ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(సీసీఎల్) ట్రేడ్, ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 608 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రేడును అనుసరించి మెట్రిక్యులేషన్, ఐటీఐ, సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
మంగళూరు ఎంఆర్‌పీఎల్‌లో 50 నాన్ మేనేజ్‌మెంట్ కేడర్ పోస్టులు, వివరాలు ఇలా!
మంగళూరులోని మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ నాన్ మేనేజ్‌మెంట్ కేడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ద్వారా ఖాళీలను భర్తీచేస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..