Telangana IAS Transfer: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ, రంగారెడ్డి కలెక్టర్ పై బదిలీ వేటు!
IAS Transfer in Telangana: తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరికొందరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పై వేటు వేశారు.
![Telangana IAS Transfer: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ, రంగారెడ్డి కలెక్టర్ పై బదిలీ వేటు! IAS News Telangana government transfers 6 IAS official Telangana IAS Transfer: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ, రంగారెడ్డి కలెక్టర్ పై బదిలీ వేటు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/24/a8a40a12a7f6fd27a0a0ce2ff85997be1703422659761233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana government transfers IAS official: హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఉన్నతాధికారులను బదిలీ (IAS Transfers in Telangana) చేసింది. రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్ అధికారిని బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి కలెక్టర్ పై బదిలీ వేటు పడింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ (Rangareddy district Collector)గా ఉన్న భారతి హోలికేరిని జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
ట్రాన్స్ ఫోర్ట్ కమిషనర్ గా జ్యోతి బుద్ధా ప్రకాష్, ఏక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కమిషనర్ గా శ్రీధర్, రంగారెడ్డి కలెక్టర్ భారతి హోలీ కెరిపై బదిలీ వేటు పడింది. రంగారెడ్డి కలెక్టర్ గా గౌతమ్ పోర్ట్ ను నియమించారు. ఇంటర్ బోర్డు డైరెక్టర్ గా శృతి ఓజా, ట్రైబల్ ఫెల్ఫెర్ డైరెక్టర్ గా నర్సింహా రెడ్డి, సివిల్ సప్లై కమిషనర్ గా దేవేంద్ర సింగ్ చౌహన్ లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
- ట్రాన్స్ ఫోర్ట్ కమిషనర్ గా జ్యోతి బుద్ధా ప్రకాష్
- ఏక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కమిషనర్ గా శ్రీధర్
- రంగారెడ్డి కలెక్టర్ భారతి హోలీ కెరిపై బదిలీ వేటు
- రంగారెడ్డి కలెక్టర్ గా గౌతమ్ పోర్ట్
- ఇంటర్ బోర్డు డైరెక్టర్ గా శృతి ఓజా
- ట్రైబల్ ఫెల్ఫెర్ డైరెక్టర్ గా నర్సింహా రెడ్డి
- సివిల్ సప్లై కమిషనర్ గా దేవేంద్ర సింగ్ చౌహన్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)