అన్వేషించండి

High Speed Train Between Telugu States: తెలుగు రాష్ట్రాల మధ్య హైస్పీడు ప్రయాణం, విశాఖ నుంచి హైదరాబాద్‌కు డైలీ సర్వీస్‌ చేయొచ్చు!

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం మరింత తగ్గనుంది, హైదరాబాద్- విశాఖ మధ్య హైస్పీడ్ రైలు అందుబాటులోకి రానుంది

Hyderabad To Vizag High Speed Train: తెలుగురాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం మరింత తగ్గిపోనుంది. మరీ ముఖ్యంగా అత్యంత రద్దీగా ఉండే హైదరాహబాద్(Hyderabad)- విశాఖ(Vizag) మార్గంలో ఇక 4 గంటల్లోనే దూసుకపోవచ్చు. రెండు ప్రధాన నగరాల మధ్య హైస్పీడ్ రైలు పట్టాలెక్కనున్నాయి. ఇప్పటికే వందేభారత్‌ రైలు(Vandhe Bharath Train)తో సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని పొందుతున్న తెలుగు ప్రజలు హైస్పీడు రైళ్లు అందుబాటులోకి వస్తే ఇకపై రెండు నగరాల మధ్య డైలీ సర్వీసు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు...

హైస్పీడు పరుగులు
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రెండు రాష్ట్రా్లోని ప్రధాన నగరాలను కలుపుతూ సూపర్ ఫాస్ట్ హైస్పీడ్ రైలు నడపాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి విశాఖకు కేవలం నాలుగు గంటల్లోనే చేరుకోవచ్చు. హైదరాబాద్-విశాఖ, కర్నూలు(Karnool)-విజయవాడ(Vijayawada) మధ్య హైస్పీడ్ రైలు కారిడార్‌కు సంబంధించిన ప్రణాళికలు తుది దశకు చేరుకున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. 

ఈ కారిడార్లలో గరిష్ఠంగా రైలు 220 కిలో మీటర్ల వేగంతో రైలు పరిగెత్తించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికోసం కొత్త లైన్ వేయాలని రైల్వేశాఖ ప్రతిపాదిస్తోంది.ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంజనీరింగ్.. ట్రాఫిక్ స్టడీ సర్వే ప్రారంభం కానుంది రైల్వే కారిడార్ ఏ మార్గంలో ఉండాలన్న దానిపై ఆ సంస్థ ఆరు నెలల్లో ఓ నివేదిక సమర్పిస్తుంది. దీనిని బట్టి ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం విషయం తెలుస్తుంది. రైల్వేశాఖకు, ప్రయాణికులకు ఇద్దరికీ ఆమోదయోగ్యమైన మార్గంపై అధ్యయనం చేసి సర్వే సంస్థ నివేదిక ఇవ్వనుంది.

తగ్గనున్న ప్రయాణ సమయం
అధికారులు ప్రాథమికంగా వేసిన అంచనా ప్రకారం హైదరాబాద్ నుంచి వయా విజయవాడ మీదుగా విశాఖకు 4 గంటల్లోనే చేరుకోవచ్చు. అయితే ఈ రైళ్లు సికింద్రాబాద్, నాంపల్లి నుంచి కాకుండా... శంషాబాద్ నుంచి ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్(Warangal), ఖమ్మం(Khamam) మీదుగా విజయవాడకు కొత్త హైస్పీడ్ మార్గం ఇప్పటికే ప్రతిపాదించారు. నల్గొండ(Nalgonda).. గుంటూరు(Guntur) మీదుగానూ రెండో ప్రత్యామ్నయ మార్గాన్ని పరిశీలిస్తున్నారు. లేదా కొత్తగా హైదరాబాద్ సూర్యాపేట మీదుగా విజయవాడ(Vijayawada)కు జాతీయ రహదారి పక్కనే కొత్త రైల్వేమార్గం వేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది.

అమరావతి టూ రాయలసీమ
రెండో హైస్పీడ్ ప్రపోజల్‌ మార్గం పూర్తిగా ఏపీలోనే ఉంది. విజయవాడ నుంచి కర్నూలు వరకు మరో హైస్పీడ్ కారిడార్ కోసం రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఇది ఆచరణలోకి వస్తే కర్నూలు నుంచి విజయవాడకు వేగంగా ప్రయాణించవచ్చు.ఇప్పటికే వందేభారత్ రైలు ద్వారా విశాఖ - సికింద్రాబాద్ మధ్య ప్రయాణీకులకు ప్రయాణ సమయం తగ్గింది. ఈ హైస్పీడ్ కారిడార్ అందుబాటులోకి వస్తే మరింతగా ప్రయాణ సమయం తగ్గటంతో పాటుగా సౌకర్యవంతంగా ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత రద్దీగా ఉండే మార్గం హైదరాబాద్-విశాఖ మార్గమే. ఇప్పటికే ఈ మార్గంలో పరిమితికి మించి రైళ్లను నడుపుతున్నారు. ఈ మార్గంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వందేభారత్ రైలు దూసుకుపోతోంది. ఇప్పుడు హైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం మరింత తగ్గే అవకాశం ఉంది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Venkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడుPrime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారుల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Egg Rates: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Actress Shobita: సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
Peelings Song Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
Embed widget