అన్వేషించండి

Alimony: ఉన్నపళంగా విడాకులు మంజూరు చేసిన హైకోర్టు నెలకు లక్ష భరణం కూడా ఇప్పించింది - ఆ భర్త గారు చేసిన ఘనకార్యం ఏమిటో తెలుసా ?

Gujarat HC dissolves marriage: తన భర్త చేస్తున్న నిర్వాకాలు ఏమిటో ఆ భార్య నిరూపించడంతో గుజరాత్ హైకోర్టు వెంటనే విడాకులు ఇచ్చింది. నెలకు లక్ష భరణం చెల్లించాలని ఆదేశించింది.

Gujarat HC dissolves marriage citing cruelty: ఇటీవలి కాలంలో కోర్టుల్లో భరణం అంశంలో జరుగుతున్న వాదనలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ మాత్రం రివర్స్. గుజరాత్ హైకోర్టులో జరిగిన వాదనల్లో ఆ భార్య తన భర్త పెడుతున్న టార్చర్ ను నిరూపించింది. గుజరాత్ హైకోర్టు వెంటనే విడాకులు మంజూరు చేయడమే కాదు.. నెలకు లక్ష భరణం కూడా మంజూరు చేసింది. 

ముంబైకి చెందిన పైలట్ ,  అహ్మదాబాద్‌కు చెందిన టీచర్ 2023 మేలో వివాహం చేసుకున్నారు. ఇది పైలట్‌కు రెండో వివాహం. అతని మొదటి భార్య ఆత్మహత్య చేసుకున్న తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య ద్వారా ఓ కుమారుడు ఉన్నాడు.  భార్య వివాహానికి అంగీకరించినప్పుడు, తనకు పిల్లలు పుట్టకుండా ఉండాలని ,పైలట్ కుమారుడిని చూసుకోవాలని షరతు విధించాడు.              

వివాహం తర్వాత  వివాదాలు మొదలయ్యాయి. భర్త తమ ఇంటి ప్రతి గదిలో సీసీటీవీ కెమెరాలు .  బాత్‌రూమ్‌లో మైక్రోఫోన్‌లు అమర్చాడు. భార్య చేసే ప్రతి పని మీద నిఘా పెట్టాడు.  వివాదాలు పెరిగి పోలీసుల వరకు వెళ్లాయి.   2015 జులైలో భార్య అహ్మదాబాద్‌కు తిరిగి వచ్చేసింది. రెండు సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత నుండి వారు విడివిడిగా ఉంటున్నారు.  భర్త  విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశాడు.  అయితే భార్య కలిసి జీవించడానికి (కంజుగల్ రైట్స్) పిటిషన్ దాఖలు చేసింది.  అహ్మదాబాద్‌లోని ఫ్యామిలీ కోర్టు మొదట డివోర్స్ పిటిషన్‌ను తిరస్కరించింది. భార్య తాను పిల్లలను కనే హక్కును త్యాగం చేసిందని కోర్టు భావించింది. తీర్పును  గుజరాత్ హైకోర్టులో సవాల్ చేశారు.                     
 
అయితే  గుజరాత్ హైకోర్టు భర్త క్రూరమైన ప్రవర్తన కారణంగా భర్తకు విడాకులు మంజూరు చేసింది.  భర్తను భార్యకు జీవితకాలం రూ.1 లక్ష  నెలవారీ పర్మనెంట్ భరణం చెల్లించాలని ఆదేశించింది. భర్త ప్రతి గదిలో సీసీటీవీ,  బాత్‌రూమ్‌లో మైక్రోఫోన్‌లు అమర్చడం మానసిక క్రూరత్వానికి ఆధారంగా కోర్టు గుర్తించింది.   వారు కలిసి ఉండటం కొనసాగిస్తే  క్రూరత్వం కొనసాగుతుందని కోర్టు అభిప్రాయపడింది.  వారి మధ్య ఉన్న శత్రుత్వం,  బహుళ  వివాదాల వల్ల మళ్లీ బంధం ఉండదని కోర్టు భావించింది. ఈ కేసులో  భర్త ,  భార్య కలిసి జీవించడం కొనసాగిస్తే ఇద్దరిపైనా క్రూరత్వాన్ని కొనసాగించడమే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.                   

సీసీటీవీ ,  మైక్రోఫోన్‌లు అమర్చానని భర్త అంగీకరించాడు, కానీ కుటుంబ సభ్యుల భద్రత కోసమని చెప్పాడు. కానీ కోర్టు ఈ వాదనను తిరస్కరించింది. ఈ కేసు మానసిక క్రూరత్వం,  వివాహ సమస్యలపై ముఖ్యమైన తీర్పుగా నిలుస్తుందని భావిస్తున్నారు. దేశంలో ఇటీవలి కాలంలో విడాకుల కేసుల్లో భరణం అంశం కీలకంగా మారింది. మహిళలు..  మగవాళ్లు భరించలేనంతగా భరణం అడుగుతున్నారు. ఇలాంటివి వైరల్ అవుతున్నాయి.              

 

టాప్ హెడ్ లైన్స్

Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilbad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Embed widget