అన్వేషించండి

Shock for Vijay: విజయ్‌కు గవర్నర్ షాక్.. మ్యాజిక్ ఫిగర్ చూపిస్తేనే ప్రమాణం - అధికారికంగా ప్రకటించిన గవర్నర్

Tamilnadu Governer: మ్యాజిక్ ఫిగర్ లేకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న విజయ్‌కు గవర్నర్ షాక్ ఇచ్చారు. 118 మంది ఎమ్మెల్యేల లేఖలు ఇస్తేనే చాన్స్ ఇస్తానని ఆయన స్పష్టం చేశారు.

Governor shocks Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి.  దళప  విజయ్ నేతృత్వంలోని  తమిళగ వెట్రి కళగం అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, అధికార పీఠం దక్కించుకోవడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మెజార్టీ లేని కారణంగా విజయ్‌ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించలేదని  లోక్ భవన్  అధికారికంగా ప్రకటించింది.

రాజ్ భవన్‌లో ఏం జరిగింది? గవర్నర్ వాదన ఇదీ.. 

గురువారం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, విజయ్ మధ్య జరిగిన రెండో విడత భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం అనంతరం రాజ్ భవన్ ప్రకటన విడుదల చేసింది.  ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్ వద్ద లేదు.  కేవలం అతిపెద్ద పార్టీగా ఉన్నంత మాత్రాన ప్రభుత్వం ఏర్పాటుకు పిలవలేమని, రాజ్యాంగ నిబంధనల ప్రకారం మెజార్టీ సభ్యుల సంతకాలతో కూడిన మద్దతు లేఖలు సమర్పించాలని గవర్నర్ స్పష్టం చేశారు.

 లెక్కలు తేలలేదు: విజయ్ కూటమి ఎక్కడ ఆగింది? 

ఎన్నికల ఫలితాల ప్రకారం విజయ్ పార్టీ టీవీకే  108 స్థానాలు సాధించింది. కాంగ్రెస్ తన 5 సీట్ల మద్దతును ప్రకటించడంతో ఈ సంఖ్య  113 కి చేరింది.   విజయ్ రెండు చోట్ల గెలిచినందున, ఒక సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. అప్పుడు టీవీకే బలం  107 కి తగ్గుతుంది. కాంగ్రెస్‌తో కలిపి కూటమి బలం  112 వద్దే ఆగిపోతుంది.  అధికారం దక్కించుకోవడానికి విజయ్‌కు ఇంకా  6 మంది  ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ అదనపు మద్దతు లేఖలు లేకపోవడంతోనే గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

 అసెంబ్లీలోనే తేల్చుకుంటామంటున్న టీవీకే

గవర్నర్ నిర్ణయంపై టీవీకే మద్దతుదారులతో పాటు వీసీకే, సీపీఐ వంటి పార్టీలు మండిపడుతున్నాయి.  అతిపెద్ద పార్టీగా నిలిచిన విజయ్‌ను ముందుగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలి. మెజార్టీని నిరూపించుకోవడానికి అసెంబ్లీ వేదికగా అవకాశం ఇవ్వాలి తప్ప, రాజ్ భవన్‌లో సంతకాలు అడగడం రాజ్యాంగ విరుద్ధం అని వారు వాదిస్తున్నారు. కేంద్రం జోక్యంతోనే గవర్నర్ ఇలా చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.   

 తదుపరి అడుగు ఎటు? 

దాదాపు 60 ఏళ్ల ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి విజయ్ గట్టి దెబ్బ కొట్టినప్పటికీ, రాజ్యాంగపరమైన చిక్కులు ఆయనను వేధిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ ఇతర చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే సమయంలో డీఎంకే, ఏఐఏడీఎంకేలు కూడా ఈ అనిశ్చితిని తమకు అనుకూలంగా మార్చుకుని మళ్లీ చక్రం తిప్పాలని చూస్తున్నాయి. తమిళనాడు భవిష్యత్తు ఇప్పుడు ఆ 6 మంది ఎమ్మెల్యేల మద్దతు పైనే ఆధారపడి ఉంది. 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను విజయ్ ఎప్పుడు సమర్పిస్తారో, అప్పుడే దళపతి సీఎం పీఠంపై సందిగ్ధత తొలగిపోతుంది. రాబోయే 48 గంటలు తమిళనాడు రాజకీయాలకు అత్యంత కీలకం!  


 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
World Breastfeeding Week 2026 : బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
IMD Weather Update: ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
Advertisement

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Monsoon Humidity : వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వర్షంలోనే టూవీలర్‌ నడుపుతున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ బండి మధ్య రోడ్డులోనే ఆగిపోవచ్చు!
వర్షంలో తడిచిన టూవీలర్‌ స్టార్ట్ కావట్లేదా? వీటిని ఒకసారి చెక్‌ చేయండి, ప్రోబ్లెం సాల్వ్‌!
Embed widget