మీరు యాపిల్ ఫోన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త - ఈ ప్రమాదం తప్పదేమో!
Alert For Apple Users: యాపిల్ యూజర్స్‌కి కేంద్ర ప్రభుత్వం హైరిస్క్ అలెర్ట్ జారీ చేసింది.
High Risk Alert For Apple Products:
యాపిల్ ఫోన్స్ హ్యాక్..?
Indian Computer Emergency Response Team శామ్‌సంగ్ గ్యాలక్సీ ఫోన్‌లకు సెక్యూరిటీ అడ్వైజరీ జారీ చేసింది. హ్యాకింగ్ గురయ్యే ప్రమాదముందని హెచ్చరించింది. ఈ వార్నింగ్‌తో శామ్‌సంగ్ యూజర్స్ ఆందోళన చెందుతుంటే...ఇప్పుడు యాపిల్ యూజర్స్‌కీ షాక్ ఇచ్చింది ప్రభుత్వం. యాపిల్ ప్రొడక్ట్స్‌కి హైరిస్క్ వార్నింగ్ ఇచ్చింది. యూజర్ డేటా చోరీకి గురయ్యే అవకాశముందని తేల్చి చెప్పింది. డివైజ్ సెక్యూరిటీకీ భంగం వాటిల్లొచ్చని హెచ్చరించింది. యాపిల్ డివైజెస్‌లో vulnerabilities ని ఎక్కువగా కనిపెట్టినట్టు CERT వెల్లడించింది. భద్రతాపరంగా ఉన్న అన్ని వలయాలనూ దాటుకుని సులువుగా హ్యాకింగ్ చేసేందుకు అవకాశముందని, అప్రమత్తంగా లేకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. టార్గెటెడ్ సిస్టమ్స్‌పై సైబర్ దాడులు జరగొచ్చి అంచనా వేసింది. iOS,iPadOS,macOS, tvOS, watchOS సహా సఫారీ బ్రౌజర్ కూడా ఈ హ్యాకింగ్ నీడలో ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోకపోతే ఈ ప్రమాదంతప్పదని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఆటో ఇండస్ట్రీలో వెహికిల్స్‌కి ఏమైనా ఇబ్బంది వస్తే వాటిని రీకాల్ చేసి ఆ సమస్యల్ని సవరించి మళ్లీ మార్కెట్‌లోకి పంపుతారు. అలాగే మొబైల్స్‌కి సంబంధించి ఇదే ప్యాటెర్న్ ఫాలో అవుతున్నారు. హ్యాకింగ్‌కి గురయ్యే ప్రమాదముందని తెలిసిన ప్రొడక్ట్స్‌ని వెనక్కి తెప్పించి అందులోని బగ్స్‌ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో Adobe Prodcuts కి కూడా ఇదే అలెర్ట్ జారీ చేసింది CERT. దీంతో పాటు మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ కూడా హ్యాక్ అయ్యే ప్రమాదముందని వెల్లడించింది.
శామ్‌సంగ్ గ్యాలక్సీ ఫోన్ యూజర్స్‌కి అలెర్ట్ వార్నింగ్స్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. Indian Computer Emergency Response Team కి చెందిన సెక్యూరిటీ అడ్వైజరీ ఈ అలెర్ట్ ఇచ్చింది. లక్షలాది శామ్‌సంగ్ గ్యాలక్సీ ఫోన్‌ల సెక్యూరిటీకి భంగం వాటిల్లే ప్రమాదముందని అప్రమత్తం చేసింది. కొత్త మోడల్స్‌తో పాటు పాత మోడల్స్‌కి కూడా ఈ వార్నింగ్ ఇచ్చింది. డిసెంబర్ 13నే ఈ అలెర్ట్ జారీ చేసింది కేంద్రం. ఈ సెక్యూరిటీ అలెర్ట్‌ని హైరిస్క్‌గా కేటగిరీ చేసింది. యూజర్స్ అందరూ వెంటనే ఆపరేటింగ్ సిస్టమ్‌ని అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. శామ్‌సంగ్ మొబైల్స్‌లో vulnerabilities ఎక్కువగా ఉన్నాయని, వాటిని అలాగే వదిలేస్తే సెక్యూరిటీ వలయాన్ని దాటుకుని ఎవరైనా చాలా సులువుగా సైబర్ దాడికి పాల్పడే ప్రమాదముందని వివరించింది. సున్నితమైన సమాచారాన్ని తస్కరించే అవకాశాలున్నాయని తెలిపింది. ఆయా మొబైల్స్‌లో స్పెషల్ కోడ్స్‌ని ఎగ్జిక్యూట్ చేసి పూర్తిగా అధీనంలోకి తీసుకునే ప్రమాదముందని స్పష్టం చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం...శామ్‌సంగ్ మొబైల్ ఆండ్రాయిడ్ 11,12,13,14 వర్షన్స్ మొబైల్స్‌కి ఈ సమస్య ఉందని వెల్లడించింది.
Also Read: Lok Sabha Security Breach: లోక్‌సభ దాడి వెనక విదేశీ కుట్ర! డబ్బులిచ్చి ఇదంతా చేయించారా?