Rajasthan: ఒక్క మేక రెండు లక్షలు - దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా ?
Bakrid: రాజస్తాన్ లో బక్రీద్ సందర్భంగా ఓ మేకను రెండు లక్షలకు అమ్మకానికి పెట్టారు. కొనేందుకు జనం పోటీ పడ్డారు.

Two lakhs Goat: బక్రీద్ దగ్గరకు రావడంతో దేశంలో చాలా చోట్ల గొర్రెల మండీలలో సందడి కనిపిస్తోంది. మేకల కొనుగోలు ,అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. బక్రీద్ సందర్భంగా మేకల్ని దానం చేయడం సంప్రదాయంగా వస్తోంది. రమీజ్ అనే మేకల వ్యాపారి అజ్మేరీ జాతి ఒక ప్రత్యేకమైన మేకను అమ్మకానికి పెట్టాడు.దాని ధరను రెండు లక్షలుగా నిర్ణయించాడు.
అజ్మేరీ జాతి మేకలు పెద్ద పరిమాణం, బలమైన శరీర నిర్మాణం , మాంసం ఎక్కువగా కలిగి ఉంటాయి. పండుగ సమయంలో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రమీజ్ తాను అమ్మకానికి తెచ్చిన అజ్మేరా మేక ప్రత్యేకతలను గొప్పగా చెప్పాడు. పరిమాణం, బరువు, రూపం ఇతర మేకల కన్నా గొప్పగా ఉన్నాయి. గతంలో "అల్లాహ్" లేదా "మొహమ్మద్" వంటి మతపరమైన చిహ్నాలను పోలిన గుర్తులు ఉన్న మేకలు సాంస్కృతిక ప్రాముఖ్యత కారణంగా ఎక్కువ ధరలకు అమ్ముడయ్యేవి. సాధారణంగా బక్రీద్ సమయంలో మంచి జాతి మేకలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది.
क्या कोई दयालु और पर्यावरण प्रेमी इस बकरे को कष्टपूर्ण हत्या से बचा सकता है?
— डॉ रमाकान्त राय (@RamaKRoy) June 4, 2025
इसकी कीमत 2 लाख रुपए लगाई गई है। आप लोग इस पोस्ट को इतना शेयर कीजिए कि इस बकरे की जान बच जाए।#बकरीद_पर_बकरे_की_हत्या_बंद_हो pic.twitter.com/GyDFXIkQH2
అజ్మేరీ మేకలు రాజస్థాన్‌లోని అజ్మీర్ ప్రాంతానికి చెందినవి . ఈ జాతి మేకలు ఈద్-అల్-అధా సమయంలో దానం ఇవ్వడానికి అనువైనవిగా భావిస్తారు. అవి ఆరోగ్యవంతమైనవి , ఎక్కువ మంచి మాంసం ఇస్తాయి. ఈ జాతి మేకలు సాధారణంగా రూ. 50,000 నుండి రూ. 2 లక్షల వరకు ధరలు కలిగి ఉంటాయి, కానీ ప్రత్యేక లక్షణాలు ఉన్న మేకలు లేదా పండుగ సమయంలో డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలను రైతులు ఎక్కువగా చెబుతారు.
#WATCH | Rajasthan | Ajmer's Bakra Mandi, where goats are priced between Rs 15,000 to Rs 2 lakhs, bustles with buyers ahead of Eid-al-Adha, also known as Bakra-Eid
— ANI (@ANI) June 4, 2025
A goat seller, Rameez, says, "This goat of the Ajmera breed is priced at Rs 2 lakhs. There is no other goat like… pic.twitter.com/rH5UDJhdhV
బక్రీద్ పండుగ సందర్భంలో ముస్లిం సమాజంలో మేకలు, గొర్రెలు లేదా ఇతర జంతువులను కొనుగోలు చేస్తారు. ఈ సందర్భంగా అజ్మీర్ వంటి మండీలు జంతువుల కొనుగోలు కోసం కేంద్రంగా మారుతాయి.ఇలాంటి ధరలు గతంలో కూడా నమోదయ్యాయి. త ఈద్ సందర్భంలో కొన్ని మేకలు రూ. 7 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ధరలకు అమ్ముడయ్యాయని మీడియా రిపోర్టు చేసింది.





















