Goa Congress BJP: దేవుడు శాసించాడు- నేను పాటించాను, అందుకే పార్టీ మారాను: మాజీ సీఎం
Goa Congress BJP: దేవుడు చెప్పినందుకే తాము పార్టీ మారామని గోవా మాజీ సీఎం దిగంబర్ కామత్ అన్నారు.
Goa Congress BJP: పార్టీకి విధేయంగా ఉంటామని దేవాలయాలు, చర్చిలు, మసీదుల వద్ద ప్రతిజ్ఞ చేసిన ఏడు నెలలకే గోవాలోని 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది అధికార భాజపాలోకి జంప్ అయ్యారు. ఎన్నికల తర్వాత తాము పార్టీ మారబోమని రాహుల్ గాంధీ సమక్షంలో కూడా వీళ్లు ప్రమాణం చేశారు.
ఆ ప్రమాణాలు, ప్రతిజ్ఞలు ఏమైపోయాయని మీడియా అడిగిన ప్రశ్నకు గోవా మాజీ సీఎం, పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహించిన దిగంబర్ కామత్ దిమ్మతిరిగి పోయే సమాధానం ఇచ్చారు.
తాను, మిగిలిన ఎమ్మెల్యేలు భాజపాలో చేరే ముందు దేవుడి అనుమతి తీసుకున్నామని.. అందుకు "దేవుడు అంగీకరించాడు" అని కామత్ అన్నారు.
Goa | I went to a temple, asked Gods & Goddesses that this (joining BJP) is in my mind, what should I do... God said, you go ahead, don't worry: Former Congress MLA Digambar Kamat, after joining BJP (14.09) pic.twitter.com/Nne2X9Q3zI
— ANI (@ANI) September 15, 2022
భారీ షాక్
గోవాలో ఇది కాంగ్రెస్‌కు భారీ షాక్. మాజీ ముఖ్యమంత్రి సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు భాజపాలో బుధవారం చేరారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కాషాయ కండువ కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
అంతకుముందు ఎమ్మెల్యేలు సీఎం, అసెంబ్లీ స్పీకర్‌తో సమావేశమయ్యారు. కాంగ్రెస్ శాసనపక్షాన్ని భాజపాలో విలీనం చేయాలని ఎమ్మెల్యేలు తీర్మానించారు. విపక్ష నేతగా ఉన్న మైఖెల్ లోబో ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీన్ని మాజీ సీఎం, ఎమ్మెల్యే దిగంభర్ కామత్ బలపర్చగా.. మిగతా ఎమ్మెల్యేలు ఆమోదించారు.
గోవాలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 40 స్థానాలకు గానూ భాజపా 20 సీట్లు దక్కించుకొంది. మెజార్టీ మార్కుకు ఒక్క సీటు తగ్గడంతో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే ఎన్నికల్లో కాంగ్రెస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు వారిలో ఎనిమిది మంది భాజపాలో చేరిపోయారు.
Also Read: Lakhimpur Horror: లఖింపుర్ కేసులో షాకింగ్ విషయాలు- బాలికలపై గ్యాంగ్ రేప్, ఆపై హత్య!
Also Read: Gali Janardhan Reddy: గాలి జనార్ధన్ కేసులో సుప్రీంకోర్టు ఫైర్, ‘ఇది న్యాయాన్ని అవహేళన చేయ్యడమే’