Goa Elections 2022: గోవా ఎన్నికల బరిలో శివసేన, ఎన్‌సీపీ ఉమ్మడి పోరు.. సింగిల్‌గా కాంగ్రెస్ పోటీ
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, ఎన్‌సీపీ కలిసి బరిలోకి దిగుతున్నాయి. మహారాష్ట్రలో వీరితో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్.. ఒంటరిగా గోవాలో పోటీచేస్తుంది.
వచ్చే నెలలో జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. సీట్ల పంపకాలపై ఎన్‌సీపీతో చర్చలు చేస్తామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. అయితే మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీతో పొత్తులో ఉన్న కాంగ్రెస్.. గోవా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనుంది.
We will contest between 10-15 seats in Goa, NCP leaders are also coming to Goa: Sanjay Raut, NCP pic.twitter.com/Kii8PVyEnp
— ANI (@ANI) January 16, 2022
కాంగ్రెస్‌తో కుదరదు..
40 స్థానాలున్న గోవా అసెంబ్లీ ఎన్నికలు ఒక్క విడతలోనే జరగనున్నాయి. ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుంది. 2017లో జరిగిన గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ 17, భాజపా 13 స్థానాల్లో గెలుపొందాయి. ఇతరులు 10 స్థానాలు గెలిచారు.
Also Read: Covid Cases: దేశంలో కొత్తగా 2.71 లక్షల మందికి కరోనా.. 8 వేలకు చేరువలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య
Also Read: 1 Year of Vaccination: భారత్ మరో రికార్డ్.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మొదలై ఏడాది పూర్తి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి