By: Ram Manohar | Updated at : 13 Jul 2022 04:32 PM (IST)
బూస్టర్ డోస్ ఉచితంగా అందిస్తామని ప్రకటించిన కేంద్రం
అప్పటి నుంచి బూస్టర్ డోస్ ఉచితం..
కరోనా కేసులు మళ్లీ పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా బూస్టర్ డోస్ ఇస్తామని ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఉచితంగా బూస్టర్ డోసులు అందించనున్నారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ప్రకటన చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ నెల 15 వ తేదీ నుంచి 75 రోజుల పాటు ఉచితంగా అందించనున్నారు. 18-59 ఏళ్ల మధ్య వయసున్న వారికి టీకాలు అందిస్తామని తెలిపింది. అన్ని ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లోనూ టీకాలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. బూస్టర్ డోస్‌లు తీసుకునే వారి సంఖ్యను పెంచాలన్నదే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశమని కేంద్రం వెల్లడించింది. దేశంలో 18-59 ఏళ్ల మధ్య ఉన్న వారి జనాభా 77 కోట్లుగా ఉంది. వీరిలో 1% మాత్రమే బూస్టర్ డోస్ తీసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. 60 ఏళ్లకు పైబడిన 16 కోట్ల మంది జనాభాలో 26%, హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లు కూడా బూస్టర్ డోస్ తీసుకోని జాబితాలో ఉన్నారు.
భారత్‌లో దాదాపు చాలా మంది రెండో డోస్ తీసుకుని 9 నెలలు దాటిపోయింది. ICMR సహా పలు అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు... యాంటీబాడీస్ ఆర్నెల్లు మాత్రమే ఉంటాయని చెబుతున్నాయి. రెండు డోసులు తీసుకున్నా, బూస్టర్ డోస్ తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని స్పష్టం చేస్తున్నాయి. అని కేంద్రం వివరిస్తోంది. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్-NTAGI గత వారమే కీలక ప్రకటన చేసింది. సెకండ్ డోస్‌కి, ప్రికాషన్ డోస్‌కి మధ్య 9 నెలల గ్యాప్‌ని ఆరు నెలలకు కుదించాలని సూచించింది. ఈ సూచనల మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ, ఆ వ్యవధిని 6 నెలలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
India is celebrating 75 years of independence. On the occasion of Azadi ka Amrit Kaal, it has been decided that from 15th July 2022 till the next 75 days, citizens above 18 years of age will be given booster doses free of cost: Union Minister Anurag Thakur pic.twitter.com/Qai76dFVW7
— ANI (@ANI) July 13, 2022
#WATCH | Union Minister Anurag Thakur says, "...It has been decided that from 15th July 2022 till the next 75 days, all citizens above 18 years of age will be given booster doses free of cost...This facility will be available at all government centres..."#COVID19 pic.twitter.com/kZSOqHZQLg
— ANI (@ANI) July 13, 2022
Komatireddy Venkatreddy : మునుగోడు ఉపఎన్నిక సెమీ ఫైనల్, అలా చేస్తే రాజీనామా చేస్తా- కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Monkeypox: అటు కొవిడ్ ఇటు మంకీపాక్స్, సతమతమవుతున్న దేశ రాజధాని
Revenge Lover : ప్రియుడు మోసగాడని ఫుల్ పేజీ యాడ్ ఇచ్చిన లవర్ - తర్వాతే అసలు ట్విస్టులు
Visakha News : సివిల్స్ కోచింగ్ కు వచ్చి ప్రేమ పేరుతో జల్సాలు, అప్పులు చేసి ఆత్మహత్య!
Independence Day 2022: ఎర్రకోట వద్ద పదివేల మంది పోలీసులు, 5 కిలోమీటర్ల వరకూ నో ఫ్లైయింగ్ జోన్
Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?
Telangana TDP Votes : టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?
Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో
TDP On Madhav : మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?