Pahalgam conspirator Munir: పహల్గాం దాడి కుట్రదారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీరే-సంచలన విషయం బయటపెట్టిన మాజీ సైనికాధికారి
Pakistani Army officer: పాకిస్తాన్ మాజీ సైనిక అధికారి ఆదిల్ రాజా సంచలన విషయం బయట పెట్టారు. 'పహల్గామ్ ఉగ్రవాద దాడి వెనుక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఉన్నారని ఆయన తెలిపారు.

Former Pakistani Army officer claims Pahalgam conspirator was Munir: పహల్గామ్‌లో ఉగ్రవాద దాడికి ఆదేశం పాకిస్తాన్ జనరల్ అసిమ్ మునీర్ ఇచ్చారని పాకిస్తాన్ మాజీ ఆర్మీ అధికారి అదిల్ రాజా సంచలన ప్రకటన చేశారు. మునీర్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ దాడిని చేశాడని అదిల్ రాజా ఆరోపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
बडी खबर : पाकिस्तान के पुर्व आर्मी ऑफिसर ने खुलासा किया की पहलगांव मे आतंकी हमला करने का ऑर्डर पाकिस्तान के जनरल आसीम मुनीर ने दिया था।
— Cyber Huntss (@Cyber_Huntss) May 3, 2025
😲😲 pic.twitter.com/MDqgBy7z9v
అదిల్ రాజా సంచలన విషయం బయట పెట్టడం.. పాకిస్తాన్ లోనూ కలకలం రేపుతోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వ్యవహారం మొదటి నుంచి అనుమాాస్పదంగానే ఉంది. పహల్గాం దాడి జరగడానికి వారం రోజుల ముందు ఆయన ఓ సదస్సులో మాట్లాడుతూ.. కశ్మీర్ ప్రజల స్వాతంత్య్ర పోరాటానికి మద్దతుగానే ఉంటామని ప్రకటించారు. ఆయన అలా ప్రకటన చేసిన తరవాత వారం రోజుల్లో దాడి జరిగింది. దీంతో అందరూ ఆయన పనేనని అనుమానించారు. దాడి తర్వాత కూడా మునీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో మొత్తం కుట్ర దారు ఆయనేనని.. ఉగ్రదాడి వెనుక ఆర్మీ హస్తం ఉందని తేలిపోయిందని అంతర్జాతీయ సమాజానికి క్లారిటీ వచ్చింది.
ఓ వైపు ఆఫ్ఘన్ వైపు నుంచి తాలిబన్లు..మరో వైపు బలూచిస్తాన్ లో.. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ.. పాకిస్తాన్ సైన్యాన్ని ఊచకోత కోస్తున్న సమయంలో ఆయన ఎందుకు ఇలాంటి కుట్ర చేశారన్నది ఎవరికీ అర్థం కాని విషయంగా మారింది. భారత్ పై దాడి చేస్తే.. ఉగ్రదాడులు చేస్తే ప్రతి దాడి ఖాయమని మునీర్ కు తెలియకుండా ఉండదు. అియనా ఆయన దాడి చేశారు. దీనికి కారణాలేమిటన్నది పాకిస్తాన్ లో చర్చనీయాంశమయింది.
ప్రస్తుత ఆర్మీ చీఫ్ మునీర్.. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కంటే ప్రమాదకమైన వ్యక్తి అని పాకస్తాన్ లో చర్చ జరుగుతోంది. ఆయన ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలదోసి మళ్లీ ఆర్మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. గతంలో ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో కూడా ఆయన కుట్రలు చేశారు. ఇమ్రాన్ పై అవినీతి ఆరోపణలు రావడానికి మునీరే ప్రధాన కారణం. అప్పట్లో ఇమ్రాన్ కు ఆర్మీ సపోర్టు ఉండేది.. రాను రాను మునీర్ ఇమ్రాన్ ను టార్చర్ పెట్టారు. చివరికి ఆయన పదవి పోయింది. ప్రస్తుత ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లుగా కనిపిస్తున్నారు కానీ.. ఆయన దృష్టి అంతా.. అల్లకల్లోలంరేపి అయినా దేశాన్ని చేతుల్లోకి తీసుకోవాలన్న లక్ష్యం ఉందని అంటున్నారు.
ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల భారత్ .. పాకిస్తాన్ పై దాడి చేస్తే... దాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వాన్ని క్యాప్చర్ చేసి.. పాలన చేయాలని ప్లాన్ లో ఉన్నారని అంటున్నారు.





















