అన్వేషించండి

𝐓𝐚𝐦𝐚𝐧𝐧𝐚𝐚𝐡 𝐁𝐡𝐚𝐭𝐢𝐚 : తమన్నా చేసిన స్కామేంటి ? ఇంత జరిగినా బయటకు రాలేదా ?

𝐇𝐏𝐙 𝐓𝐨𝐤𝐞𝐧 : హీరోయిన్ తమన్నా భాటియా ఈడీ అధికారుల ముందు హాజరవడం సంచలనం రేపింది. చాలా మంది అసలు కేసేంటి అని ఆరా తీశారు. ఆ పూర్తి వివరాలు ఇవి.

𝐓𝐚𝐦𝐚𝐧𝐧𝐚𝐚𝐡 𝐁𝐡𝐚𝐭𝐢𝐚  𝐋𝐢𝐧𝐤 𝐭𝐨 𝐭𝐡𝐞 𝐇𝐏𝐙 𝐓𝐨𝐤𝐞𝐧 𝐒𝐜𝐚𝐦 : హెచ్‌పీజడ్ క్రిప్టో కరెన్సీ పేరుతో మల్టీ క్రోర్ స్కాం జరిగినప్పుడు దేశంలో సంచలనం సృష్టించింది. భారీ ఎత్తున లాభాలు వస్తాయని..బిట్ కాయిన్స్ మైనింగ్ చేస్తామని ప్రచారం చేసుకున్న HPZ టోకెన్ అనే సంస్థ మోసాలకు పాల్పడింది. ఈ సంస్థపై మొదట నాగాలాండ్ లో కేసు నమోదు అయింది. హెచ్‌పీజడ్ టోకెన్ సంస్థ ప్రత్యేక యాప్ ను సిద్ధం చేసి అసలు లేని క్రిప్టో కరెన్సీ మైనింగ్ మెషిన్స్ మీద పెట్టుబడి పెట్టాలని ప్రజల్ని నమ్మించింది. ఈ సంస్థ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి మనీలాండరింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. 

ఈ కేసులోనే తమన్నా భాటియాను ఈడీ విచారణకు పిలిచి ప్రశ్నించింది. అయితే తమన్నా ఈ స్కాంలో నేరుగా ఎక్కడా పాల్గొనలేద.కానీ హెచ్‌పీజడ్ సంస్థ నుంచి ఆమెకు కొన్ని పేమెంట్స్ అందాయి. ఆ పేమెంట్స్ కేవలం ఆ సంస్థ నిర్వహిచిన ఈవెంట్స్ పాల్గొనేందుకు చేసినవి. ఈ అంశంపై ప్రశ్నించేందుకే ఈడీ ఆమెను పిలిపిచింది. ఈ యాప్ విషయంపై తమన్నాపై ఎలాంటి ఆరోపణలు కానీ..మనీలాండరింగ్ చేసినట్లుగా కేసులు కానీ లేవు. అదే సమయంలో ఈ యాప్ విషయంలో ఆమె ఇన్వాల్వ్ మెంట్ ఉన్నట్లుగా కూడా ఎక్కడా ఈడీ చెప్పలేదు. ఓ ఈవెంట్ కు హాజరవడం వల్ల ఆమెకు అందిన డబ్బు విషయంలో మాత్రమే ప్రశ్నించేందుకు పిలిపించారు.  

మూడేళ్ల కిందట ఈ కంపెనీపై మొదటి సారి నాగాలాండ్ లోని కోహిమ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. అవడానికి నాగాలాండ్ కేంద్రమే అయినా హైదరాబాద్‌లోనూ లింకులు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఆపరేట్ అవుతున్న మూడు చైనీస్ కంపెనీలకు ఈ యాప్ తో సంబంధాలు ఉన్నాయి. ఈ మూడు కంపెనీ హైదరాబాద్ లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద రిజిస్టర్ అయ్యాయి. యాప్ ద్వారా సేకరిస్తున్న నగదును  ఈ మూడు కంపెనీల ద్వారా మనీలాండరింగ్ చేశారు. 
 
క్రిప్టో కరెన్సీని మైనింగ్ చేయాలంటే పెద్ద పెద్ద యంత్రాలు కావాలని ఆ యంత్రాల కోసం పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని ప్రజల్ని పిచ్చోళ్లను చేశారుఈ యాప్ నిర్వహకులు. అయితే ఇలాంటి యంత్రాలు ఉంటాయని.. వాటిని కొంటామని కూడా ఎక్కడా ఆ కంపెనీ ఎవరికీ చెప్పలేదు. అలాంటి పనులు కూడా చేయలేదు. ఇన్వెస్టర్ల దగ్గర నుంచి నిధులు సేకరించి దారి మళ్లించారు. ఈ కేసులో ఈడీ పూర్తి విచారణ జరిపి 76 చైనా సంస్థలకు సంబంధం ఉందని.. 299 మంది వ్యక్తులు ఈ స్కాంలో పాలు పంచుకున్నారని గుర్తించారు. వీరిలో చైనీస్ నేషనల్స్ దేశం పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే అప్పటికే చాలా మంది దేశం దాటి పోయారన్న ఆరోపణలు ఉన్నాయి.                

అంటే ఈ యాప్ మంచిదని తమన్నా ప్రచారం చేసి డబ్బులు తీసుకున్నారు. అదొక్కటే ఆమెను ఈడీ విచారణ వరకూ తీసుకొచ్చింది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Pushpa 2 Collection: కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget