అన్వేషించండి

Vice Presidential Election Schedule: సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ - ఇండియా కూటమి పోటీ చేస్తుందా ?

Vice President: ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో ఎన్నికల ప్రక్రియను ఈసీ ప్రారంచింది. షెడ్యూల్ విడుదల చేసింది.

EC releases schedule for Vice Presidential election : ఉపరాష్ట్రపతి పదవిని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం  షెడ్యూల్  విడుదల చేసింది. పదవి ఖాళీ అయితే  వెంటనే భర్తీ చేయాలన్న నిబంధన ఉండటంతో ఉపరాష్ట్రపతి  రాజీనామా అధికారికంగా ఆమోదం పొందిన వెంటనే సన్నాహాలు ప్రారంభించింది. ఓటర్ల జాబితాను రెడీచేసింది. లోక్ సభ, రాజ్యసభల్లో సభ్యులంతా ఓటు హక్కు కలిగి ఉంటారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అయితే ఎమ్మెల్యేలు కూడా ఓటర్లుగా కూడా ఉంటారు.కానీ ఉపరాష్ట్రపతి పదవికి మాత్రం పార్లమెంట్ సభ్యులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటారు.  

ఏడో తేదీ నుంచి నామిషన్లు ప్రారంభమవుతాయి. 21వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. పోలింగ్ అవసరం అయితే వచ్చే నెల తొమ్మిదో తేదీన నిర్వహిస్తారు. అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తారు.  

ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అన్నదానిపై అధికార ఎన్డీఏలో ఇంకా క్లారిటీ లేదు.  బీహార్ సీఎం నితీష్ కుమార్ తో సహా చాలా మంది పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.  నామినేషన్లకు చివరి తేదీ ఆగస్టు 21వ తేదీ కాబట్టి..  చివరి వరకూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదని భావిస్తున్నారు.  నామినేషన్ల గడువుకు రెండు రోజుల ముందు  బీజేపీ హైకమాండ్  పేరును ఖరారు చేసే అవకాశం ఉంది. ఎవరూ ఊహించని అభ్యర్థులను రంగంలోకి తీసుకు వచ్చే చాన్సులు ఉన్నాయి. బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉపరాష్ట్రపతిని ఎంపిక చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.  మిత్రపక్షాలకు ఇచ్చే అవకాశం లేదని.. బీజేపీ నుంచి మాత్రమే ఉపరాష్ట్రపతి ఉంటారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. 

మరో వైపు ఇండియా కూటమి అభ్యర్థిని నిలబెట్టకపోతే ఏకగ్రీవం అవుతుంది. పోటీకి అభ్యర్థిని పెట్టాలని ఇండియా కూటమి భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఓటింగ్ ఖాయం.  ఓటింగ్ జరగాల్సి వస్తే సెప్టెంబర్ 9న నిర్వహిస్తారు. కౌంటింగ్ కూడా అదే రోజు జరుగుతుంది. ఉపరాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన,  నామినేటెడ్ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఉపరాష్ట్రపతి ని ఎన్నుకుంటుంది.  ఎన్నిక ఒకే బదిలీ ఓటు (Single Transferable Vote) ద్వారా జరుగుతుంది.  గెలుపొందడానికి అభ్యర్థికి సభలోని మొత్తం ఓట్లలో సగం కంటే ఎక్కువ అంటే  సాధారణ మెజారిటీ  అవసరం. అభ్యర్థి నామినేషన్‌ను దాఖలు చేయడానికి కనీసం 20 మంది ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ప్రతిపాదకులుగా,   20 మంది బలపరిచేవారిగా సంతకం చేయాలి. 

 ఉపరాష్ట్రపతి పదవీకాలం 5 సంవత్సరాలు.  2025 జులై 21న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ ఆరోగ్య కారణాలతో రాజీనామా చేశారు. దీంతో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ప్రస్తుతం జరిగేది ఉపఎన్నిక కాదు. అందుకే ఎన్నికయ్యే వారు ఐదేళ్లు పదవిలో ఉంటారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు .  రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వహిస్తారు .

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan: అడవితల్లి బాట 2.0కు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్.. చింతచెట్టు కింద గిరిపుత్రులతో మాటా మంతి
అడవితల్లి బాట 2.0కు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్.. చింతచెట్టు కింద గిరిపుత్రులతో మాటా మంతి
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget