Durex counter to L And T : 90 గంటల పని డిబేట్‌లోకి కండోమ్ కంపెనీ - ఎల్ అండ్ టీ చైర్మన్‌ను ఇలా ట్రోల్ చేసిందేంటి?
Durex: ఎంత సేపు భార్య ముఖం చూస్తారు.. ఆదివారాలు కూడా ఆఫీసుకు వచ్చేయండి అని పిలిచిన ఎల్ అండ్ టీ చైర్మన్ వ్యాఖ్యలపై చాలా కామెంట్లు వచ్చాయి. డ్యూరెక్స్ కంపెనీ పరోక్ష ట్రోల్ మాత్రం వైరల్ గా మారింది.

Durex Trolls L and T Chairman Over 90 Hour Work Week Remark : ఓ వ్యక్తి ఎన్ని గంటలు పని చేయాలన్న దానిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనికి కారణం కొన్నాళ్ల కిందట ఇన్ఫోసిస్ ఫౌండర్ ఆర్ నారాయణమూర్తి వారానికి 70 గంటలు పని చేయాలని యువతకు సలహా ఇవ్వడం ఒకటి అయితే.. ఇటీవల ఎల్ అండ్ టీ చైర్మన్ మరో అడుగు ముందుకేసి 90 గంటలు పని చేయాలని పిలుపునిచ్చారు. అలా మామూలుగా సలహా ఇచ్చినట్లయితే మామూలు డిబేట్ జరిగేది. కానీ ఇందులోకి ఆయన భార్యల ప్రస్తావన తీసుకువచ్చారు.
ఎంత సేపు అని భార్యల ముఖం చూస్తూ ఉంటారని ఆయన ప్రశ్నించారు. అలాగే భార్యలను కూడా ప్రశ్నించారు . ఎంత కాలం అని భర్తల ముఖం చూస్తారని ప్రశ్నించారు. దీంతో వర్కింగ్ అవర్స్ నుంచి టాపిక్ డిబేట్.. భార్యల వైపు మళ్లింది. గతంలో ఎల్ అండ్ టీ చైర్మన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయక ముందు 70 గంటల పని విధానంపై గౌతమ్ అదానీ స్పందించారు. అలా అయితే భార్యలు పుట్టింటికి వెళ్లిపోతారని సెటైర్ వేశారు. ఇక 90 గంటల టాపిక్ వచ్చిన తర్వాత ఆయన స్పందించలేదు కానీ..ఆయన మాటలు మాత్రం వైరల్ అయ్యాయి. అదే సమయంలో చాలా మంది పారిశ్రామికవేత్తలు.. కొంత మంది ప్రముఖులు కూడా ఎల్ అండ్ టీ చైర్మన్ వ్యాఖ్యలు మరీ బాసిజంతో ఉన్నాయని చెప్పుకొచ్చారు.
తన భార్య అంటే తనకు చాలా ఇష్టం అని ఆమెను చూస్తూ ఉండటం ఇష్టమని మరికొంత మంది చెప్పుకొచ్చారు. ఇలాంటి డిబేట్ నడుస్తూనే ఉంది. ఈ చర్చలోకి ప్రముఖ కండోమ్స్ తయారీ కంపెనీ డ్యూరెక్స్ వచ్చేసింది. ఇన్ స్టాలో ఓ పోస్టు పెట్టింది. భార్యల ముఖం చూడటం తప్పని సరి కాదు కానీ అని ఆపేసింది. ఎవరి ఊహలకు తగ్గట్లుగా వారు ఊహించుకోవచ్చని సంకేతాలు ఇచ్చింది. అయితే కింద లవ్ అండ్ టీజ్ కార్పొరేషన్ అని పెట్టడమే హైలెట్ అయింది.
View this post on Instagram
సురక్షిత శృంగారాన్ని ప్రోత్సహించే కండోమ్ కంపెనీలు ఇలాంటి అవకాశాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవు. భార్యల ముఖం చూడకపోయినా పర్వేలేదు అంటే...అంటే ఏం చేయాలని అంటున్నారో మనమే ఊహించుకోవాలి. కానీ ఎల్ అండ్ టీ చైర్మన్ ఇచ్చిన కౌంటర్ మాత్రం అదిరిపోయిందని అనుకోవచ్చు.





















