అన్వేషించండి

Doordarshan Logo: దూరదర్శన్ కొత్త లోగో వివాదాస్పదం, కాషాయ రంగుపై ప్రతిపక్షాల అసహనం

Doordarshan Logo: దూరదర్శన్ కొత్త లోగోని కాషాయ రంగులోకి మార్చడం రాజకీయంగా వివాదాస్పదమవుతోంది.

Doordarshan Changes Logo: దూరదర్శన్ లోగో మార్పుపై (Doordarshan Logo Change) పెద్ద వివాదమే నడుస్తోంది. సరిగ్గా లోక్‌సభ ఎన్నికల ముందే లోగోని కాషాయ రంగులోకి మార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు తీవ్రంగా మండి పడుతున్నాయి. దూరదర్శన్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ DD News ఇటీవలే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇదే మా కొత్త లోగో అంటూ ఓ ప్రమోషనల్ వీడియో విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ వివాదం రాజుకుంది.

తమ సిద్ధాంతాలు ఎప్పటికీ మారవని, కాకపోతే కాస్త కొత్తగా అందరి ముందుకు వస్తున్నామని దూరదర్శన్ ప్రకటించింది. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, ప్రసార భారతి మాజీ సీఈవో జవహర్ సిర్కార్ దూరదర్శన్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓ మాజీ సీఈవో ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్టు వెల్లడించారు. కాషాయ రంగులో లోగోని మార్చి ఓటర్లను ప్రభావితం చేసే కుట్ర చేస్తోందని బీజేపీపై విమర్శలు చేశారు. స్వతంత్రంగా పని చేసే ఇలాంటి సంస్థలపైనా బీజేపీ తమ సిద్ధాంతాలను రుద్దుతోందని మండి పడ్డారు. ఈ మేరకు X వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. 

"ఎంతో చరిత్రాత్మకమైన దూరదర్శన్ లోగోని కాషాయ రంగులోకి మార్చడం ఆందోళన కలిగించింది.  ఓ మాజీ సీఈవోగా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలా కాషాయ రంగుని వేయడం ముమ్మాటికీ సరికాదు. ఇప్పటి నుంచి ఇది ప్రసార భారతిగా కాకుండా ప్రచార భారతిగా మారిపోతుందేమో అన్న ఆందోళన కలుగుతోంది"

- జవహర్ సిర్కార్, ప్రసార భారతి మాజీ సీఈవో

2012-16 మధ్య కాలంలో ప్రసార భారతి సీఈవోగా పని చేశారు జవహర్. అటు ఆల్ ఇండియా రేడియో సీఈవో బాధ్యతలూ చేపట్టారు. ఎంతో పేరు, కీర్తి ఉన్న దూరదర్శన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేదని అసహనం వ్యక్తం చేశారాయన. అంతే కాదు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌నీ ఇది ఉల్లంఘించడమే అవుతుందని తేల్చి చెప్పారు. అయితే...ప్రస్తుత యాజమాన్యం మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. కేవలం లోగో బాగా కనిపించాలనే ఉద్దేశంతోనే ఆ రంగులోకి మార్చామని వెల్లడించింది. కేవలం లోగో మాత్రమే కాదని, పూర్తిగా ఛానల్‌నే అప్‌గ్రేడ్ చేసినట్టు వివరించింది. 

టాప్ హెడ్ లైన్స్

Mega DSC Sports Quota: ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు
ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు
US Iran War Code 100: అమెరికాకు ఇరాన్ 'కోడ్ 100' అల్టిమేటం.. యుద్ధం ముగించడానికి 7 షరతులు!
అమెరికాకు ఇరాన్ 'కోడ్ 100' అల్టిమేటం.. యుద్ధం ముగించడానికి 7 షరతులు!
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేరు కోరిన రేవంత్ రెడ్డి.. టాలీవుడ్ డైరెక్టర్లలో ఎవరి మాట నెగ్గుతుందో!
వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేరు కోరిన రేవంత్ రెడ్డి.. టాలీవుడ్ డైరెక్టర్లలో ఎవరి మాట నెగ్గుతుందో!
ABP Desam Top 10, 20 September 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 20 September 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mega DSC Sports Quota: ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు
ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు
Asian Games Medal: షూటింగ్‌లో బోణీ కొట్టిన భారత్.. ఇలావేనిల్ డబుల్ ధమాకా.. వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో సిల్వర్ సాధించిన షూటర్..
షూటింగ్‌లో బోణీ కొట్టిన భారత్.. ఇలావేనిల్ డబుల్ ధమాకా, వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో సిల్వర్ సాధించిన షూటర్..
Suryapet Road Accident: హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
South Coast Railway: కాకినాడ నుంచి రైలు మార్గంలో వుడ్ పల్ప్ రవాణా.. భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం
కాకినాడ నుంచి రైలు మార్గంలో వుడ్ పల్ప్ రవాణా.. భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం
AP Local Body Elections: ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్
ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్
Danam Nagender Disqualification: ఫైటర్ ఉపఎన్నికకు రెడీ..! దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు?
ఫైటర్ ఉపఎన్నికకు రెడీ..! దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు?
AP TS Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
Embed widget