Trump Twitter Account: ట్విట్టర్ ఖాతా కోసం కోర్టుకు వెళ్లిన డొనాల్డ్ ట్రంప్!
తన ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోర్టును ఆశ్రయించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్విట్టర్ ఖాతా కోసం కోర్టును ఆశ్రయించారు. ఖాతాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసి పునరుద్ధరించాలని కోరారు. ఫ్లోరిడాలోని ఫెడరల్ కోర్టులో ఈ విచారణ జరిగింది.
కాంగ్రెస్ సభ్యులు చేసిన ఒత్తిడి వల్లే తన ఖాతాను ట్విట్టర్ సస్పెండ్ చేసిందని ట్రంప్ ఆరోపించారు. సామాజిక మాధ్యమ ఖాతాల శాశ్వత పునరుద్ధరణ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ పిటిషన్ వేశారు ట్రంప్. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ సంస్థలపై జులైలోనే వ్యాజ్యం దాఖలు చేశారు ట్రంప్. యూజర్లపై సెన్సార్షిప్ విధిస్తోందని, ఇది భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుకు విఘాతం కలిగిస్తోందని పేర్కొన్నారు.
అయితే ఈ వాదనను ట్విట్టర్ ఖండించింది. తాము చేసిన విజ్ఞప్తిపై ట్రంప్ వెంటనే స్పందించలేదని కోర్టుకు తెలిపింది.
జనవరి 6వ తేదీన అమెరికాలో ట్రంప్ మద్దతుదారులు బీభత్సం సృష్టించారు. ఆ ఘటనను ప్రేరేపించేలా ట్రంప్ పోస్టులు ఉన్నాయని ఆరోపిస్తూ ట్విట్టర్ అతడి ఖాతాను నిషేధించింది. ఆ తర్వాత ఫేస్‌బుక్, గూగుల్ కూడా ట్రంప్ ఖాతాలపై పలు చర్యలు తీసుకున్నాయి. బ్యాన్ సమయంలో ట్విట్టర్లో ట్రంప్‌నకు 8.8 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
Also Read: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్.. రూ.45 లక్షల వరకు జీతం..