అన్వేషించండి

DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!

Anitha Radhakrishnan: త విజయ్, త్రిషలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎమ్మెల్యే, అనితా రాధాకృష్ణన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మద్రాస్ హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించింది.

DMK MLA Anitha Radhakrishnan Arrest:  తమిళనాడు  ముఖ్యమంత్రి  జోసెఫ్ విజయ్ ,  ప్రముఖ నటి త్రిష కృష్ణన్  లపై అనుచిత వ్యాఖ్యల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న అధికార ప్రతిపక్ష డీఎంకే  సీనియర్ నేత, తిరుచెందూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్‌ను శుక్రవారం తమిళనాడు పోలీసులు అధికారికంగా అరెస్ట్ చేశారు. మద్రాస్ హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను నిర్ద్వంద్వంగా తిరస్కరించిన కొద్దిసేపటికే పోలీసులు ఆయన్ను ఆత్తూరులో అదుపులోకి తీసుకున్నారు.

ఈ వివాదానికి ప్రధాన కారణం జూన్ 20న తూత్తుకుడి జిల్లా ఆత్తూరులో జరిగిన మాజీ సీఎం కరుణానిధి జయంతి వేడుకల బహిరంగ సభ. ఆ వేదికపై అనితా రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. సీఎం విజయ్ సినిమా రంగాన్ని వీడి రాజకీయాల్లోకి రావడం, ఇటీవల అసెంబ్లీలో ఆయన వ్యవహరిస్తున్న శైలిని ఎగతాళి చేశారు. జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా నటి త్రిష సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్‌ను కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. "తాను రాజకీయాల్లో ఇలా ఇరుక్కుపోయానని విజయ్ లోలోపల బాధపడుతూ ఉంటారు.. ఇంట్లో నటి  తో ఎంతో సంతోషంగా ఉండేవాడినని ఆయన గుర్తుచేసుకుంటున్నారేమో?" అంటూ ఇద్దరి వ్యక్తిగత జీవితంపై తీవ్ర పరువు నష్టం కలిగించేలా, అత్యంత అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యానించారు.
 

 ఈ వ్యాఖ్యలపై టీవీకే  పార్టీ శ్రేణులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా.. అనితా రాధాకృష్ణన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే జస్టిస్ జి.కె. ఇళంతిరైయన్ ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తూ..  ఏడు సార్లు ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి.. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రిపై ఇంతటి దిగజారుడు భాషను ఎలా ఉపయోగిస్తారు  అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
అనితా రాధాకృష్ణన్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. ఒక మహిళా నటిని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇంతటి  చీప్  పాలిటిక్స్ చేయడంపై నెటిజన్లు సైతం మండిపడ్డారు. టీవీకే ఆత్తూరు అర్బన్ సెక్రటరీ ఎస్. సెల్వం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆత్తూరు పోలీసులు ఆయనపై భారతీయ న్యాయ సంహిత  లోని సెక్షన్ 352  , సెక్షన్ 353(2)   కింద నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.   

మరోవైపు, ఈ అరెస్టుపై డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. కేవలం పరువు నష్టం వ్యాఖ్యల కేసులో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేను ఇంత అత్యవసరంగా అరెస్ట్ చేయడం పూర్తిగా  రాజకీయ కక్షసాధింపు  చర్యేనని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడలేని కూటమి ప్రభుత్వం.. ప్రతిపక్ష నేతలను అణచివేయడానికే ఇలాంటి అప్రజాస్వామిక పద్ధతులకు పాల్పడుతోందని విమర్శించారు. ఏదేమైనా, సినీ గ్లామర్‌తో పాటు రాజకీయంగా దూసుకుపోతున్న సీఎం విజయ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయబోయి.. డీఎంకే సీనియర్ నేత చివరకు కటకటాల పాలవ్వడం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
CM Revanth Reddy: 2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Embed widget