AP TS Dispute : సాగర్ డ్యాంపై ఏపీ పోలీస్ వర్సెస్ తెలంగాణ పోలీస్ - మళ్లీ అప్పటి సీన్ రిపీట్ !
నాగార్జున సాగర్ డ్యామ్‌పై ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య వివాదం ఏర్పడింది. ఉన్నతాధికారులు రాజీ కుదుర్చినట్లుగా తెలుస్తోంది.
AP TS Dispute : తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం ప్రారంభమయింది. అయితే ఇది ప్రుత్వాల మధ్య కాదు. పోలీసుల మధ్య . నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద తెలుగు రాష్ట్రాల పోలీసులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు.. కేసులు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. మొదట డ్యామ్‌పై రాకపోకల విషయం ఏపీ సివిల్ పోలీసులు, తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసుల మధ్యకు వాగ్వాదం జరిగింది. డ్యామ్‌పైకి ఏపీకి చెందిన ఎస్‌ఐ వాహనాన్ని తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బంది అనుమతించలేదు.ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న పోలీసులు... తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులు వాహనాలతో ఏపీ పరిధిలోకి వచ్చినప్పుడు .. వారి వాహనాలకు చలాన్లు విధించారు.
ఏపీ పోలీసులను డ్యామ్‌పైకి అనుమతించని తెలంగాణ ఎస్పీఎఫ్ - ప్రతిగా చలాన్ విధించిన ఏపీ పోలీసులు
కక్ష పూరితంగా ఇలా వాహనాలకు చలాన్లు విధించారని భావించిన తెలంగాణ పోలీసులు.. వాగ్వాదానికి దిగార. రెండు ఘటనలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వివాదాం ముదిరి.. ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీసులు ఒకరిపై ఒకరు దూషణకు దిగారు. ఈ పంచాయతీ ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారుల వద్దకు చేరినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పోలీసుల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
కోట్ల విలువైనా బంగారం, వెండి ఉన్నా ముట్టుకోడు- రూపాయి నగదు కనిపించినా నొక్కేస్తాడు!
కొన్ని రోజులుగా రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం
కొన్ని రోజులుగా నాగార్జున సాగర్ లో ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య గొడవలు జరుగుతున్నాయని అంటున్నారు. ఒకరి పై ఒకరు కక్షపూరితంగా వ్యవహరిస్తుండటంతో చిన్న చిన్న విషయాల్లోనూ వివాదం నెలకొందని చెబుతున్నారు.నాగార్జున సాగర్ డ్యామ్ ప్రస్తుతం తెలంగాణలోని నల్గొండ జిల్లా, ఏపీలోని పల్నాడు జిల్లా సరిహద్దుల్లో ఉంది. అయితే డ్యామ్ నిర్వహణ మాత్రం తెలంగాణ అధీనంలో ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణను ఏపీకి కేటాయించారు. కానీ తరచూ నాగార్జున సాగర్ డ్ామ్‌పై విభేదాలు చోటుచేసుకుంటున్నట్టుగా చెబుతున్నారు.
సగటున ఉపాధి హామీ వేతనం రూ.240లు ఉండాలి- జిల్లా యంత్రాంగానికి సీఎం ఆదేశం
బయటకు తెలియకుండా రాజీ చేసేసిన ఉన్నతాధికారులు
2015 ఫిబ్రవరిలో ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదం చోటుచేసుకున్నాయి. సమయంలో.. నాగార్జున సాగర్ డ్యామ్ రణరంగంగా మారింది. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం రాగా.. రెండు ప్రభుత్వాలు పంతానికి పోవడంతో నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఆ సమయంలో తీవ్ర ఉద్రికత్తలు తలెత్తాయి. నీటి విడుదల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ పోలీసులు పరసర్పం ముష్టిఘాతాలకు దిగారు. పోలీసుపై పోలీసులే లాఠీచార్జీకి దిగి కొట్టుకునేంత వరకు వెళ్లారు. అయితే 2015లో రెండు రాష్ట్ర ప్రభుత్వాల విభేదాల కారణంగా జరగగా.. ఇప్పుడు జరిగింది మాత్రం వ్యక్తిగత విభేదాల వల్లేనని తెలుస్తోంది. దీన్ని అధికారులు సర్దుబాటు చేశారు.