Digital condoms: ఇది కూడా వచ్చేసింది - డిజిటల్ కండోమ్స్ అట - ఎలా వాడాలో తెలుసా ?
Viral News: సర్వం డిజిటల్ మయం అయిపోతోంది. అందులో భాగంగా డిజిటల్ కండోమ్స్ కూడా వచ్చాయి. కానీ వీటిని ఎలా వాడాలన్నది మాత్రం పెద్ద పజిల్.
Digital condoms come in the market: భారత్‌లో అత్యధిక జనాభా ఉన్నారు. దీనికి కారణం పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయించుకోకపోవడం, గర్భ నిరోధక ప్రయత్నాలు చేయకపోవడం అని ఎక్కువ మంది భావిస్తారు. అందుకే ప్రభుత్వం గతంలో కండోమ్స్ వినియోగాన్ని ప్రోత్సహించింది. ఎలా ఉపయోగించాలో కూడా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎంత మందికి తెలిసింది.. ఎంత మందికి తెలియలేదు అన్న విషయం పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి డిజిటల్ కండోమ్స్ వచ్చాయి. ఫిజికల్ గా వాడాల్సిన కండోమ్స్ డిజిటల్ గా వస్తే ఏమిటి ఉపయోగం అన్న డౌట్ చాలా మందికి వస్తుంది.
ఫిజికల్ కండోమ్‌కు డిజిటల్ కండోమ్ ప్రత్యామ్నాయం కాదు
నిజానికి డిజిటల్ కండోమ్స్ అనేది ఫిజికల్ కండోమ్ కు ప్రత్యామ్నాయం కాదు. ఇదో రకమైన సైబర్ సెక్యూరిటీ యాప్. ప్రస్తుతం పార్టనర్‌తో కలిసి ప్రైవేటు వ్యవహారాల్లో మునిగి తేలుతున్నప్పుడు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం అనే ఓ రకమైన నేరం ఎక్కువగా జరుగుతోంది. ఇలా ఎలా వీడియోలు తీయగలరంటే... చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల ఇలాంటి వీడియోలు రికార్డు అవుతూంటాయి. అలాంటి నిర్లక్ష్యాన్ని నిర్ణయించడానికే డిజిటల్ కండోమ్స్ ను తీర్చిదిద్దారు. ఇది ఓ యాప్.దీన్ని ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకుంటే .. ప్రైవేటు మూమెంట్స్ లో కెమెరాలు పని చేయకుండా చేస్తుంది. రికార్డింగ్ ఆపేస్తుంది. అంతేనా ఫోన్ డిస్ట్రబ్ చేయకుండా చేస్తుంది.
గూగుల్‌పై కోర్టుకెళ్లి రూ.26 వేల కోట్ల పరిహారం పొందుతున్నారు - ఈ యూకే జంట పంట పండినట్లే !
జర్మనీకి చెందిన బిల్లీబాయ్ కంపెనీ వినూత్న ఆలోచన
జర్మనీకి చెందిన బిల్లీ బాయ్ అనే కంపెనీ దీన్ని రూపొందించింది. డిజిటల్ కండోమ్ అంటే అందరూ ఫిజికల్ గా ఉపయోగించేదని అనుకుంటూ వస్తున్నారు. దానికి బిల్లీ బాయ్ క్లారిటీ ఇచ్చింది . ఎంతో ఆసక్తి రేపి తీసుకు వచ్చిన ఈ యాప్ అంచనాలకు అనుగుణంగా లేదని కొంత మంది విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే పెగ్నెన్సీని అవాయిడ్ చేయాలనుకుంటే కండోమ్ ఎంత ముఖ్యమో.. వ్యక్తిగత జీవితం ఆన్ లైన్ సరుకు కాకుండా ఉండాలంటే ఈ డిజిటల్ కండోమ్ అంతే ముఖ్యమని కొంత మంది అంటున్నారు.
కిండర్ గార్టెన్లను వృద్ధాశ్రమాలుగా మార్చేస్తున్నారు - చైనా ముసలిదైపోతోంది !
హాట్ టాపిక్ గా డిజిటల్ కండోమ్
ప్రస్తుతానికి ఈ డిజిటల్ కండోమ్ హాట్ టాపిక్ అయింది. అండ్రాయిడ్ యూజర్లకు మాత్రం అందుబాటులోకి వచ్చింది. యూజర్ల ఫీడ్ బ్యాక్ తీసుకుని మరింత ఉపయోగకరంగా మారుస్తామని అంటున్నారు. బిల్లీ బాయ్ అనే కంపెనీ సెక్సువల్ వెల్ నెస్ ప్రొడక్ట్స్ ను అమ్ముతంది. డిజిటల్ కండోమ్ అనే కాన్సెప్ట్ ను వినూత్నంగా అందుబాటులోకి తెచ్చింది. బిల్లీబాయ్ ఉత్పత్తులు దాదాపుగా 30 దేశాల్లో అమ్ముతూంటారు.